
ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం
బులావాయో: ఆమ్లా (132 బంతుల్లో 122; 6 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో రాణించడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 93 పరుగుల తేడాతో నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగినసఫారీ 50 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. డికాక్ (63), డుప్లెసిస్ (59)రాణించారు. అనంతరం జింబాబ్వే 49.5 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. మసకద్జ (61), విలియమ్స్ (51) అర్ధ సెంచరీలు సాధించారు.