first one day
-
చారిత్రాత్మక వన్డేలో టీమిండియా ఘనవిజయం
-
భారత్ VS దక్షిణాఫ్రికా: తొలి వన్డేలో ఓటమి
-
తొలి వన్డే భారత్ ఘనవిజయం
-
విండీస్‌తో వన్డే : రిషబ్ పంత్ అరంగేట్రం
గువాహటి: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా నేడు (ఆదివారం) గువాహటిలో తొలి వన్డే జరుగునుంది. ఇటీవల టెస్ట్ సీరిస్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ అకట్టుకున్న యువ సంచలనం రిషభ్ పంత్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ చేతుల మీదుగా పంత్ తన తొలి వన్డే క్యాప్ అందుకున్నాడు. టెస్ట్ సిరీస్‌ను క్లీస్ స్వీప్ చేసి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా వన్డేల్లోనూ అదే దూకుడుని కొనసాగించాలని పట్టుదలతో ఉండగా.. కనీసం వన్డే సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. భారత్ జట్టు : విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ దావన్, అంబటి రాయుడు, ధోని, రిషబ్ పంత్, జడేజా, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, కలీల్, చహల్ వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), ఆంబ్రిస్, కీరన్ పావెల్, షై హోప్, హెట్మెయిర్, శామ్యూల్స్, రోవ్‌మన్ పావెల్, ఆష్లే నర్స్, కీమో పాల్, బిషూ, కీమర్ రోచ్. చదవండి: వన్డేలూ ఏకపక్షమేనా! సచిన్‌కు చేరువలో కోహ్లి.. -
దక్షిణాఫ్రికా గెలుపు
దంబుల్లా: సఫారీ బౌలింగ్ దెబ్బకు శ్రీలంక తోకముడిచింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన దక్షిణాఫ్రికా ఐదు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. పేసర్ రబడ (4/41), స్పిన్నర్ షమ్సీ (4/33) చెలరేగడంతో ఆదివారం జరిగిన పోరులో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత శ్రీలంక 34.3 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (72 బంతుల్లో 81; 11 ఫోర్లు, 1 సిక్స్), తిసారా పెరీరా (30 బంతుల్లో 49; 8 ఫోర్లు) రాణించారు. తర్వాత దక్షిణాఫ్రికా 31 ఓవర్లలో 5 వికెట్లకు 196 పరుగులు చేసి గెలిచింది. డుమిని (53 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డికాక్ (47), డు ప్లెసిస్ (47) నిలకడగా ఆడి జట్టును గెలిపించారు. -
ధావన్ మెరుపులు తొలి వన్డే కైవసం
-
ధావన్ మెరుపులు..తొలి వన్డే కైవసం
దంబుల్లా: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్ రాణించడంతో శ్రీలంకపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌లో శిఖర్ ధావన్ 132(90), మెరుపులకు కెప్టెన్ కోహ్లీ 82(70) తోడవ్వడంతో శ్రీలంక నిర్ధేశించిన 217 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ ఆపై భారత బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసింది. ప్రధానంగా స్పిన్నర్ల దెబ్బకు లంక బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. భారత స్పిన్ త్రయం చాహల్, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్ లు లంక పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లతో సత్తా చాటగా, చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించారు. పేసర్ బూమ్రా రెండు వికెట్లు తీశాడు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 217 పరుగుల సాధారణ లక్ష్యాన్నిమాత్రమే లంక నిర్దేశించగలిగింది. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ రోహిత్ శర్మ(4) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ క్రమంలో శిఖర్ ధావన్ 71 బంతుల్లోనే సెంచరీ చేయగా, కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. దీంతో భారత్ 28.5 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 220పరుగులు చేసి విజయం సాధించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులకు ఓపెనర్లు గుణతిలకా, డిక్ వెల్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించి మంచి రన్ రేట్ ను బోర్డుపై ఉంచారు. కాగా, గుణతిలకా(35) అవుటైన తరువాత డిక్ వెల్లా కుదరుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే డిక్ వెల్లా(64) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే డిక్ వెల్లా అవుటైన తరువాత లంకేయులు ఒక్కసారిగా తడబడ్డారు. 139 పరుగుల వద్ద లంక రెండో వికెట్ ను డిక్ వెల్లా రూపంలో కోల్పోగా, ఆపై వరుస విరామాల్లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. కుశాల్ మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2)లు వరుసగా పెవిలియన్ చేరడంతో లంక స్కోరు మందగించింది. కాగా, ఏంజెలో మాథ్యూస్(36 నాటౌట్) కాస్త ఫర్వాలేదనిపించడంతో లంక రెండొందల మార్కును చేరింది. -
భారత బౌలర్ల విజృంభణ
దంబుల్లా: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. లంకను 43.2 ఓవర్లలో 216 పరుగులకే కట్టడి చేసి శభాష్ అనిపించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక ఆరంభంలో నిలకడగా ఆడినప్పటికీ ఆపై భారత బౌలింగ్ దెబ్బకు చేతులెత్తేసింది. ప్రధానంగా స్పిన్నర్ల దెబ్బకు లంక బ్యాట్స్‌మెన్ విలవిల్లాడారు. భారత స్పిన్ త్రయం చాహల్, కేదర్ జాదవ్, అక్షర్ పటేల్ లు లంక పతనాన్ని శాసించారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లతో సత్తా చాటగా, చాహల్, జాదవ్ లు తలో రెండు వికెట్లు సాధించారు. పేసర్ బూమ్రాకు రెండు వికెట్లు తీశాడు. భారత బౌలర్లు సమష్టిగా రాణించడంతో 217 పరుగుల సాధారణ లక్ష్యాన్నిమాత్రమే లంక నిర్దేశించకల్గింది. నిలకడగా ఆడుతున్న టీమిండియా 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతూ లక్ష్యం దిశగా సాగుతోంది. ఆరంభంలోనే రోహిత్ శర్మ నాలుగు పరుగుల వద్ద రన్నౌట్ అయినా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లి కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. ఈ జోడీ నిలకడగా ఆడుతుండటంతో టీమిండియా 23 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ కోల్పోయి 163 పరుగులు చేసింది. ధావన్ 101 పరుగులు, కోహ్లి 56 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ కు దిగిన లంకేయులకు ఓపెనర్లు గుణతిలకా, డిక్ వెల్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 74 పరుగులు జోడించి మంచి రన్ రేట్ ను బోర్డుపై ఉంచారు. కాగా, గుణతిలకా(35) అవుటైన తరువాత డిక్ వెల్లా కుదరుగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే డిక్ వెల్లా(64) హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే డిక్ వెల్లా అవుటైన తరువాత లంకేయులు ఒక్కసారిగా తడబడ్డారు. 139 పరుగుల వద్ద లంక రెండో వికెట్ ను డిక్ వెల్లా రూపంలో కోల్పోగా, ఆపై వరుస విరామాల్లో నాలుగు కీలక వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. కుశాల్ మెండిస్(36), ఉపుల్ తరంగా(13), కపుగదెరా(1), హసరంగా(2)లు వరుసగా పెవిలియన్ చేరడంతో లంక స్కోరు మందగించింది. కాగా, ఏంజెలో మాథ్యూస్(36 నాటౌట్) కాస్త ఫర్వాలేదనిపించడంతో లంక రెండొందల మార్కును చేరింది. -
చెమటోడుస్తున్న బౌలర్లు!
-
చెమటోడుస్తున్న బౌలర్లు!
దంబుల్లా: శ్రీలంకతో్ జరుగుతున్న తొలి వన్డేలో భారత బౌలర్లు చెమటోడ్చుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న విరాట్ సేన.. లంక బ్యాట్స్‌మెన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. 20 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక వికెట్ నష్టానికి 117 పరుగులు చేసి భారత బౌలింగ్ లైనప్ కు పరీక్షగా నిలిచింది. తొలి వికెట్ ను తీయడానికి భారత్ కు 14 ఓవర్లు అవరసమైంది. ఓపెనర్ గుణతిలకా(35) తొలి వికెట్ గా చాహల్ బౌలింగ్ లో ఇన్నింగ్స్ 14 ఓవర్ చివరి బంతికి అవుటయ్యాడు. ఆపై మరో ఓపెనర్ డిక్ వెల్లాకు కుశాల్ మెండిస్ జత కలిసి జట్టు స్కోరును ముందుకు తీసుకెళుతున్నాడు. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. దాంతో బ్యాటింగ్ చేపట్టిన లంకేయులకు శుభారంభం లభించింది. ఓపెనర్లు తొలి వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి చక్కటి పునాది వేశారు. -
విరాట్ సేన ఫీల్డింగ్
దంబుల్లా: శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి పీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి తొలుత లంకేయుల్ని బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంకను చితక్కొట్టిన కోహ్లి బృందం ఎనలేని ఆత్మవిశ్వాసంతో ఉంది. అలాగే 2019 వన్డే ప్రపంచకప్ కోసం జట్టును ఇప్పటి నుంచే తయారు చేయాలనే ఆలోచనతో ఉన్న టీమ్ మేనేజిమెంట్ ఆ దిశగా ఈ సిరీస్‌ను ఉపయోగించుకోవాలనుకుంటోంది. బలహీనంగా కనిపిస్తున్న లంకపై యువ ఆటగాళ్లను పరీక్షించనుంది. మరొకవైపు టెస్టుల్లో వైట్‌వాష్ అనంతరం వన్డే సిరీస్ ఆడబోతున్న లంక తీవ్ర ఒత్తిడిలో ఉంది. తమ అభిమానులను తిరిగి ఆకట్టుకోవాలంటే ఈ జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సిందే. కొత్త కెప్టెన్ ఉపుల్ తరంగ నేతృత్వంలో నూతనోత్తేజంతో బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి వన్డే (చాంపియన్స్ ట్రోఫీ)లో తామే గెలవడం లంకేయులకు కొద్దిగా ఊరటనిచ్చే విషయం. శ్రీలంక తుది జట్టు: ఉపుల్ తరంగ(కెప్టెన్), డిక్ వెల్లా(వికెట్ కీపర్), గుణతిలకా, కుశాల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, చమరా కపుగెదెరా, వానిందు హసరంగా, తిషారా పెరీరా, లక్షన్ సండాకన్, విశ్వ ఫెర్నెండో, లసిత్ మలింగా భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, లోకేశ్ రాహుల్, ఎంఎస్ ధోని, కేదర్ జాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, బూమ్రా, చాహల్ -
ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
-
ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం
పుణె: ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన తొలివన్డేలో పరుగుల వరద పారింది. జాదవ్ వీర విహారానికి, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తోడవడంతో ఓ దశలో ఓటమి అంచుల వరకు వెళ్లిన భారత్, ఇంగ్లండ్‌పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్, భారత్ ఎదుట 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్ రాహుల్ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్ బాల్ ఓవర్లో ధోనీ పెవిలియన్ చేరారు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన కేదార్ జాదవ్, విరాట్ కోహ్లీతో కలిసి ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కీలక సమయంలో జాదవ్ 120 పరుగులు(76 బంతుల్లో,12ఫోర్లు, 4సిక్సులు) మెరుపు సెంచరీకి తోడు, కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 122 పరుగులు(105 బంతుల్లో, 8 ఫోర్లు, 5 సిక్సులు)తో చెలరేగారు. కోహ్లీకి వన్డేల్లో 27వ సెంచరీ కాగా, జాదవ్ కిది రెండో శతకం. 12 ఓవర్లలో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత్‌ను విరాట్, జాదవ్‌లు ఆదుకున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు కీలక 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయం దిశగా నడిపించారు. స్టోక్స్ బౌలింగ్‌లో విరాట్ క్యాచ్ అవుటయ్యాడు. జట్టు 291 పరుగుల వద్ద జాదవ్ దూకుడుగా ఆడబోయి జేటీ బాల్ బౌలింగ్‌లో స్టోక్స్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జడేజా(13) నిరాశ పరిచినా పాండ్యా(40), అశ్విన్(15) సమయోచితంగా ఆడటంతో భారత్ తొలి వన్డేలో మూడు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. చివరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 70 వరకు పరుగులు చేసే అవకాశముందని భావించారు. భారత బౌలర్లు రాణిస్తే 300 స్కోరుకు కాస్త అటూ ఇటుగా ఇంగ్లండ్‌ను కట్టడి చేయవచ్చని ఊహించారు. అయితే సీన్ రివర్సయింది. చివరి 8 ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయగా, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఇరగదీశారు. దీంతో మ్యాచ్ టీ-20లా సాగింది. చివర్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ధారాళంగా పరుగులిచ్చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నాలుగు సిక్సర్లు, ఫోర్ బాదారు. ఇక ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టారు. అశ్విన్ కూడా ఓ ఓవర్లో 4, 6 సమర్నపించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. పూర్తి ఓవర్లు అయ్యే సరికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 350 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. చివర్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీసినా పరుగులను కట్టడి చేయలేకపోయారు. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు. -
కోహ్లీ, జాదవ్ సెంచరీలు
పుణె: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియాను విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ ఆదుకున్నారు. కీలక సమయంలో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి సెంచరీ చేయగా, జాదవ్ మెరుపు సెంచరీతో చెలరేగాడు. 63/4 స్కోరుతో కష్టాల్లోపడిన టీమిండియాను వీరిద్దరూ విలువైన భాగస్వామ్యం నెలకొల్పి విజయం దిశగా నడిపించారు. కోహ్లీ (93 బంతుల్లో సెంచరీ)కిది వన్డేల్లో 27వ సెంచరీ కాగా, జాదవ్ (65 బంతుల్లో సెంచరీ)కిది రెండో శతకం. 36.3 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. స్టోక్స్ బౌలింగ్‌లో విరాట్ క్యాచవుటయ్యాడు. 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్ రాహుల్ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్ బాల్ ఓవర్లో ధోనీ పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 12 ఓవర్లలో 63 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ సమయంలో విరాట్, జాదవ్ ఐదో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు. -
ఇక ఆశలన్నీ కోహ్లీపైనే..!
పుణె: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లోపడింది. 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్ (1), లోకేష్ రాహుల్ (8)వెంటవెంటనే అవుటవగా.. సీనియర్లు యువరాజ్ (15), ధోనీ (6) కూడా నిరాశపరిచారు. స్టోక్స్ బౌలింగ్‌లో యువీ, జేక్ బాల్ ఓవర్లో ధోనీ పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. కోహ్లీ, జాదవ్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఓపెనర్లతో పాటు సీనియర్లు యువీ, ధోనీ అవుటవడంతో ఇక జట్టు భారమంతా కోహ్లీపైనే పడింది. పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా, మోర్గాన్ (28), బట్లర్ (31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు. -
ఓపెనర్లు ఇద్దరూ అవుట్
పుణె: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్, లోకేష్ రాహుల్ ఇద్దరూ వెంటవెంటనే అవుటయ్యారు. 10 బంతులాడిన ధవన్ ఒక్క పరుగుకే అవుటయ్యాడు. విల్లీ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచిచ్చాడు. వెంటనే రాహుల్ కూడా విల్లీ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. భారత్ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. కోహ్లీ, యువరాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా, మోర్గాన్(28), బట్లర్(31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు. -
ఆ 8 ఓవర్లలో మనోళ్లను చితక్కొట్టారు
పుణె: టీమిండియాతో జరుగుతున్న తొలి వన్డేలో 42 ఓవర్లలో ఇంగ్లండ్ స్కోరు 245/5. క్రీజులో బెన్ స్టోక్స్ (12), మొయిన్ అలీ (0) ఉన్నారు. చివరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 70 వరకు పరుగులు చేసే అవకాశముందని భావించారు. భారత బౌలర్లు రాణిస్తే 300 స్కోరుకు కాస్త అటూ ఇటుగా ఇంగ్లండ్‌ను కట్టడి చేయవచ్చని ఊహించారు. అయితే సీన్ రివర్సయింది. చివరి 8 ఓవర్లలో భారత బౌలర్లు చేతులెత్తేయగా, ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఇరగదీశారు. దీంతో మ్యాచ్ టీ-20లా సాగింది. చివర్లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా ధారాళంగా పరుగులిచ్చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నాలుగు సిక్సర్లు, ఫోర్ బాదారు. ఇక ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు, సిక్సర్ కొట్టారు. అశ్విన్ కూడా ఓ ఓవర్లో 4, 6 సమర్నపించుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ స్కోరు బోర్డు వేగంగా పరుగులు పెట్టింది. పూర్తి ఓవర్లు అయ్యే సరికి ఇంగ్లండ్ 7 వికెట్లకు 350 పరుగులు చేసి టీమిండియా ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆఖరి 8 ఓవర్లలో ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. స్టోక్స్ 40 బంతుల్లో 62, అలీ 17 బంతుల్లో 28 పరుగులు చేశారు. చివర్లో భారత బౌలర్లు రెండు వికెట్లు తీసినా పరుగులను కట్టడి చేయలేకపోయారు. పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో విరాట్ సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. -
విరాట్ సేనకు భారీ లక్ష్యం
పుణె: భారత్ తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరుగుతున్న తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 351 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ ఆది నుంచి దూకుడును కొనసాగించింది. ఇంగ్లండ్ ఓపెనర్ హేల్స్(9)ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, మరో జాసన్ రాయ్(73;61 బంతుల్లో 12 ఫోర్లు) రాణించాడు. అతనికి జతగా జో రూట్(78;95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) లు బాధ్యతాయుతంగా ఆడగా, మిగతా ఆటగాళ్లు మోర్గాన్(28), బట్లర్(31),లు ఫర్వాలేదనిపించారు. స్టోక్స్ స్ట్రోక్.. ఇంగ్లిష్ విధ్వంసకర ఆటగాడు బెన్ స్టోక్స్ చెలరేగిపోయాడు. ఇంగ్లండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ భారత్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఈ క్రమంలోనే 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో అర్థ శతకం సాధించాడు. దాంతో ఇంగ్లండ్ 46.0 ఓవర్లు ముగిసే సరికి 300 పరుగుల మార్కును దాటింది. స్టోక్స్ విధ్వంసానికి మొయిన్ అలీ(28) చక్కటి సహకారం అందించాడు. ఒకవైపు అలీ వికెట్ ను కాపాడకుంటూ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. అదే క్రమంలో వన్డేల్లో భారత్ పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా స్టోక్స్ నిలిచాడు. గతంలో ఓవై షా, ఫ్లింటాఫ్‌లు భారత్ పై 35 బంతుల్లో వేగవంతమైన అర్థ శతకాలు సాధించిన రికార్డును స్టోక్స్ చెరిపేశాడు. 40 బంతుల్లో 62 పరుగులు చేసిన తరువాత స్టోక్స్ ను బూమ్రా అవుట్ చేశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు ఓపెనర్ జాసన్ రాయ్ చక్కటి ఆరంభాన్నిచ్చాడు. జో రూట్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ క్రమంలోనే రాయ్ 36 బంతుల్లో 10 ఫోర్లతో హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే రూట్ తో కలిసి 69 పరుగులు జోడించిన తరువాత రాయ్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. ఆపై ఇంగ్లిష్ ఆటగాళ్లు తమ వంతు బాధ్యతను సమర్ధవంతంగా ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. భారత బౌలర్లలో బూమ్రా,హార్థిక పాండ్యాలకు తలోరెండు వికెట్లు లభించగా,ఉమేష్ యాదవ్,.జడేజాలకు చెరో వికెట్ దక్కింది. చివర్లో ఇంగ్లండ్ పవర్ పంచ్ ఇంగ్లండ్ చివరి ఓవర్లలో చెలరేగి ఆడింది. ప్రధానంగా ఆఖరి ఐదు ఓవర్లలో స్టోక్స్-మొయిన్ అలీలు ఇంగ్లండ్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో ఇంగ్లండ్ విలువైన పరుగుల్ని పిండుకుంది. ఈ జోడి సహకారంతో ఆఖరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ 65 పరుగుల్ని రాబట్టింది. 45.0 ఓవర్లలో 285 పరుగులు చేసిన ఇంగ్లండ్.. 50 ఓవర్లు ముగిసే సరికి 350 పరుగులకు చేరిందంటూ ఆ జట్టు ఎంత దూకుడుగా ఆడిందో అర్ధం చేసుకోవచ్చు. -
విరాట్ సేన ఫీల్డింగ్
-
జాసన్ రాయ్ ఇరగదీశాడు
పుణె: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇరగదీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రాయ్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి మెరుపులు మెరిపించాడు. జాసన్ రాయ్ 10 ఫోర్లు సాయంతో అర్థ శతకాన్ని సాధించాడు. తద్వారా భారత్ పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఇంగ్లిష్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. అయితే భారత్ పై వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించే అవకాశాన్ని రాయ్ తృటిలో కోల్పోయాడు. గతంలో ఓవై షా, ఫ్లింటాఫ్‌లు భారత్ పై 35 బంతుల్లో వేగవంతమైన అర్థ శతకాలు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ రికార్డును తిరగరాసే అవకాశాన్ని రాయ్ స్వల్ప తేడాలో మిస్సయ్యాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆదిలోనే హేల్స్(9) వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. ఆ తరువాత జో రూట్ తో కలిసి రాయ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రాయ్ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ గా అవుటయ్యాడు.జడేజా బౌలింగ్ లో ముందుకెళ్లి ఆడబోయిన రాయ్ ను ధోని స్టంప్ అవుట్ చేశాడు. -
విరాట్ సేన ఫీల్డింగ్
పుణె: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఆదివారం ఇంగ్లండ్‌తో ఆరంభమైన తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి పూర్తి స్థాయి భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఛేజింగ్ హీరోగా ముద్రపడిన కోహ్లి.. లక్ష్యాన్ని ఛేదించేందుకు మొగ్గు చూపుతూ తొలుత ఫీల్డింగ్ తీసుకున్నాడు. టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.... వన్డేల్లోనూ అదే జోరును ప్రదర్శించాలని భావిస్తోంది. మరోవైపు పరిమితి ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఫలితం పునరావృతం కాకుండా చూసుకోవాలని యోచిస్తోంది. -
కివీస్ కుమ్మేసింది!
క్రిస్ట్‌చర్చ్: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయాన్నినమోదు చేసింది. బంగ్లాదేశ్ ను 77 పరుగుల తేడాతో ఓడించిన కివీస్ సిరీస్ లో బోణి కొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 341 పరుగులు చేసింది. కివీస్ ఆటగాళ్లలో లాథమ్(137;121 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం సాధించగా, మున్రో(87;61 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకట్టుకుని జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 44.5 ఓవర్లలో 264 పరుగుల పరిమితమై ఓటమి పాలైంది. షకిబుల్ హసన్(59), మోసడెక్ హుస్సేన్(50 నాటౌట్), ముష్కిఫికర్ రహీమ్(42), తమీమ్ ఇక్బాల్(38)లు రాణించినా జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయారు. కివీస్ బౌలర్లో నీషమ్, ఫెర్గ్యుసన్ తలో మూడు వికెట్లు సాధించగా, సౌతీకి రెండు వికెట్లు దక్కాయి. -
తొలి వన్డేలో భారత్ ఘన విజయం
మూలపాడు(విజయవాడ):మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇక్కడ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్ మహిళలతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత మహిళలు ఘన విజయం సాధించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ ను 131 పరుగులకే కూల్చేసిన భారత్.. ఆ తరువాత నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత ఓపెనర్లు దీప్తి శర్మ(16), మందనా(7)లు నిరాశపరిచినా, కెప్టెన్ మిథాలీ రాజ్(46 నాటౌట్), వేద కృష్ణమూర్తి(52 నాటౌట్) రాణించి గెలుపులో కీలక పాత్ర పోషించారు. దాంతో భారత జట్టు 39.1 ఓవర్లలోలక్ష్యాన్ని అందుకుని సిరీస్ లో 1-0తో ఆధిక్యం సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన విండీస్ 132 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది. హెలే మాథ్యూస్(24), అగ్విల్లెరియా(42 నాటౌట్)లు మాత్రమే విండీస్ జట్టులో మోస్తరుగా ఆకట్టుకున్నారు. విండీస్ మహిళల్లలో ఎనిమిది మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.భారత మహిళల్లో ఏక్తా బిష్ మూడు వికెట్లు సాధించగా,రాజేశ్వరి గైక్వాడ్ కు రెండు వికెట్లు లభించాయి. జూలన్ గోస్వామి, శిఖా పాండేలు తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే నవంబర్ 13 వ తేదీన జరుగనుంది. -
కోహ్లీ హాఫ్ సెంచరీ.. భారత్ ఘనవిజయం
-
అరంగేట్రమే అదుర్స్ అనిపించాడు!
ధర్మశాల: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ తరఫున హార్దిక్ పాండ్యా అరంగేట్రం చేశాడు. అందులో విశేషం ఏముందంటారా.. అరంగేట్ర మ్యాచ్ అయినప్పటికీ వన్డేల్లో పటిష్టమైన కివీస్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. వన్డేల్లో తాను రంగప్రవేశం చేసిన తొలి మ్యాచ్ లోనే అద్బుత ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో వన్డేల్లో ఈ ఫీట్ నమోదు చేసిన భారత నాలుగో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో క.ఎల్ రాహుల్, మోహిత్ శర్మ, సందీప్ పాటిల్ మాత్రమే వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్ లో అదరగొట్టే ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాధించారు. తాను వేసిన తొలి ఓవర్లోనే వికెట్ పడగొట్టిన బౌలర్ గానూ నిలిచిన పాండ్యా మాట్లాడుతూ.. మొదట్లో కాస్త టెన్షన్ పడ్డాను. ఆస్ట్రేలియా పిచ్ లపై, దేశవాలీ లీగ్స్, ఇతర మ్యాచులలో బౌలింగ్ చేసిన అనుభవం కలిసొచ్చిందన్నాడు. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 3/31 తో రాణించాడు. ఉమేశ్ యాదవ్ తో కలిసి కివీస్ టాపార్డర్ ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. ఈ వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ అతికష్టం మీద 43.5 ఓవర్లాడి 190 పరుగులకే ఆలౌట్ కాగా, భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీతో (81 బంతుల్లో 85: 9 ఫోర్లు, 1 సిక్స్) ఛేజింగ్ లో తానేంత ప్రమాదకర ఆటగాడే మరోసారి నిరూపించుకున్నాడు. కివీస్ పై భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. -
కోహ్లీ హాఫ్ సెంచరీ.. భారత్ ఘనవిజయం
ధర్మశాల: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలర్ల సమిష్టి రాణింపు, భారత స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీ(81 బంతుల్లో 85: 9 ఫోర్లు, 1 సిక్స్) చేయడంతో సిరీస్ లో జట్టుకు విజయం దక్కింది. వన్డేల్లో కోహ్లీకిది 37వ అర్ధశతకం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 43.5 ఓవర్లాడి 190 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 33.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. కివీస్ బౌలర్లలో బ్రాస్ వెల్, సోధీ, నీషమ్ చెరో వికెట్ తీశారు. కోహ్లీతో పాటు జాదవ్ 10 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. లక్ష్యానికి భారత్ కొన్ని పరుగుల దూరంలో ఉండగా ధోనీ రనౌట్ అయి 4వ వికెట్ రూపంలో నిష్క్రమించాడు. లక్ష్య ఛేదనకు దిగిన భారత్ కు మంచి ఆరంభమే లభించింది. తొలి వికెట్ కు 9.2ఓవర్లలో రోహిత్ శర్మ(14), అజింక్యా రహానే(34 బంతుల్లో 33 పరుగులు: 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి 49 పరుగులు జోడించారు. మనీష్ పాండే(17), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(21) పరుగులు చేశారు. న్యూజిలాండ్ ను భారత బౌలర్లు తొలి ఓవర్ నుంచే కట్టడి చేశారు. ఓపెనర్ మార్టిన్ గప్టిల్(12)ను పాండ్యా తొలి వికెట్ గా వెనక్కి పంపగా అక్కడి నుంచి కివీస్ పతనం ఆరంభమైంది. మరో ఓపెనర్ లాథమ్(98 బంతుల్లో 79 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) పోరాటానికి టీమ్ సౌథీ అద్భుత ఇన్నింగ్స్ తోడైంది. లేకపోతే ఓ దశలో 65/7 ఉన్న కివీస్ 100 పరుగులకే ఆలౌటయ్యేది. ఈ మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సౌథీ (55; 45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రధాన ఆటగాళ్లలో టేలర్, రోంచీ డకౌట్ అయ్యారు. తొలి వన్డే ఆడుతున్న హార్దిక్ పాండ్యా 3/31 తో రాణించాడు. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 3 వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్, కేదార్ జాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. -
సౌథీ.. ఒకే ఒక్కడు
ధర్మశాల:ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్ తో తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సౌథీ (55;45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్ వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డును నమోదు చేశాడు. న్యూజిలాండ్ వన్డే ఇన్నింగ్స్ ల్లో 10 లేదా 11 వ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి అర్థశతకం సాధించిన ఆ దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కివీస్ వన్డే మ్యాచ్ ల్లో ఆ స్థానంలో కేల్ మిల్స్(44నాటౌట్) చేసిన పరుగులే ఇప్పటివరకూ అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో మిల్స్ సాధించిన ఆ ఘనతను సౌథీ సవరించాడు. మరోవైపు టామ్ లాధమ్ కూడా మరో ఘనతను అందుకున్నాడు. భారత పర్యటనలో భాగంగా ఏడు ఇన్నింగ్స్ ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 43.5 ఓవర్లలో190 పరుగులకు ఆలౌటైంది. -
టీమిండియాకు స్వల్ప లక్ష్యం
ధర్మశాల: టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి రెట్టించిన ఉత్సాహంతో సుదీర్ఘమైన వన్డే సిరీస్ కు సిద్దమైన భారత జట్టు తొలి వన్డేలో సైతం ఆకట్టుకుంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కల్గిన న్యూజిలాండ్ ను చెల్లాచెదురు చేసి స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. తొలుత కివీస్ ఆటగాళ్లను క్రీజ్ లో కుదరుకోనీయకుండా చేసి వారి బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలం చేసింది. అయితే టెయిలెండర్ల సాయంతో లాధమ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దడంతో న్యూజిలాండ్ 191 పరుగుల లక్ష్యాన్ని భారత్ ముందుంచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ తొలుత కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ ను ఆదిలోనే హార్దిక్ పాండ్యా చావు దెబ్బ కొట్టాడు. డాషింగ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్(12) తొలి వికెట్ గా పెవిలియన్ కు పంపి శుభారంభాన్నిచ్చాడు. అనంతరం ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(3) ను ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. ఇలా మొదలైన కివీస్ పతనం ఏడో వికెట్ వరకూ కొనసాగింది. న్యూజిలాండ్ 65 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఓపెనర్ టామ్ లాధమ్(79 నాటౌట్;98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) మాత్రం తన పోరాటాన్ని కొనసాగించాడు. కివీస్ వికెట్లు పడుతున్నా ఓపెనర్ గా వచ్చిన లాధమ్ మాత్రం పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాడు. ఒకవైపు సహచర టాపార్డర్ ఆటగాళ్లు ఘోరంగా విఫలమైతే, లాధమ్ మాత్రం హాఫ్ సెంచరీ సాధించి జట్టు ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. న్యూజిలాండ్ సాధించిన వంద పరుగుల్లో 50 పరుగులను లాధమ్ సాధించినవే కావడం విశేషం. ఈ క్రమంలోనే ఎనిమిదో వికెట్ బ్రాస్ వెల్(15)తో కలిసి 41 పరుగులను జత చేయడంతో న్యూజిలాండ్ వంద పరుగుల మార్కును దాటింది. అనంతరం టిమ్ సౌతీతో కలిసి మరో 71 పరుగులు భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ క్రమంలోనే సౌతీ (55) వన్డేల్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. దాంతో న్యూజిలాండ్ 43.5 ఓవర్లలో 190 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అమిత్ మిశ్రాలు చెరో మూడు వికెట్లు సాధించగా, ఉమేష్ యాదవ్, కేదర్ జాదవ్ లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
16 ఫోర్లు..11 సిక్సర్లు
సెంచూరియన్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో ఇక్కడ శుక్రవారం రాత్రి జరిగిన తొలి డే అండ్ నైట్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓపెనర్ డీ కాక్ చెలరేగిపోయాడు. ఆస్ట్రేలియా బౌలింగ్ అటాక్ ను చీల్చి చెండాడిన డీకాక్(178) భారీ సెంచరీ సాధించాడు. 113 బంతులను ఎదుర్కొన్న డీ కాక్ 16 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా సునాయాస విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా విసిరిన 295 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో డీకాక్, రస్కోల జోడి బౌండరీ లైనే లక్ష్యంగా విరుచుకుపడింది. క్రమంలోనే రస్కో 45 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 63 పరుగులు చేశాడు. ఈ జోడి తొలి వికెట్ కు 103 బంతుల్లో 145 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి దక్షిణాఫ్రికాను పటిష్ట స్థితికి చేర్చింది. అనంతరం డు ప్లెసిస్(26) ఫర్వాలేదనిపించాడు. ఇక చివర్లో డేవిడ్ మిల్లర్(10నాటౌట్), బెహర్దియన్(5 నాటౌట్) మిగతా పనిని పూర్తి చేయడంతో దక్షిణాఫ్రికా 36. 2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఘన విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఆసీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 50.0 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో డేవిడ్ వార్నర్(40), ఫించ్(33), బెయిలీ(74), హాస్టింగ్స్(51), మిచెల్ మార్ష్(31)లు రాణించారు. -
తొలి టెస్టు బరిలో అశ్విన్!
పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువలో స్పిన్నర్ న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో గాయపడిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోలుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్‌కు చేరువలో ఉన్న అతను వచ్చే నెల 5న మొహాలీలో ప్రారంభం కానున్న తొలి టెస్టులో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. ‘ప్రస్తుతానికి నేను బాగానే ఉన్నా. ఇంకాస్త ఫిట్నెస్ సాధించాలి. త్వరలోనే దాన్ని సాధిస్తా. టెస్టు సిరీస్‌లో రాణిస్తాననే నమ్మకం ఉంది’ అని అశ్విన్ పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో ఏదైనా జరగొచ్చని చెప్పిన స్పిన్నర్ ఏకపక్షంగా సాగే అవకాశాల్లేవని స్పష్టం చేశాడు. ‘టెస్టుల్లో హోరాహోరీ ఖాయం. దక్షిణాఫ్రికా పటిష్టమైన జట్టు. ఇక్కడి పరిస్థితులకు బాగా అలవాటు పడ్డారు. కాబట్టి వాళ్లను అందుకోవడం మాకు కూడా ఓ సవాలే’ అని అన్నాడు. -
నేనే అక్కడ ఆడుతుంటే...
జింబాబ్వేపై తొలి వన్డేలో రాయుడు చాలా పరిణతి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి రెండేళ్లుగా జట్టుతో పాటే ఉంటున్నా తనకి వచ్చిన అవకాశాల సంఖ్య తక్కువ. సీనియర్లందరూ ఉంటే తుది జట్టులో రాయుడికి అవకాశం రావడం చాలా కష్టమైన పరిస్థితి. ప్రపంచకప్ అంతటా జట్టుతో పాటే తిరిగినా పాపం ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇలా బెంచ్‌పై కూర్చోవడం ఏ ఆటగాడికైనా కష్టమే. అయితే అలాంటి సమయంలో నిరాశ చెందకుండా ఉండటానికి రాయుడికి కోహ్లి ఒక చిట్కా నేర్పాడట. ‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉంటే... నేనే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ స్థానంలో ఆడుతున్నట్లు ఊహించుకుంటా. అలాంటి పరిస్థితిలో బ్యాట్స్‌మన్ ఆడుతున్న బంతిని నేనైతే ఎలా ఆడతానో అంచనా వేసుకుంటూ మ్యాచ్ చూస్తా. దీనివల్ల మ్యాచ్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవచ్చు. మానసికంగా మ్యాచ్ ఆడినట్లే భావించవచ్చు. కాబట్టి ఎక్కువ అవకాశాలు రాకుండా బెంచ్‌పై కూర్చున్నా నిరాశగా అనిపించదు. ఈ చిట్కా నాకు కోహ్లి నేర్పించాడు’ అని రాయుడు చెప్పాడు. ఆటపై నియంత్రణ ఎలా తెచ్చుకోవాలో ధోనిని చూసి నేర్చుకున్నానని ఈ హైదరాబాదీ తెలిపాడు. -
అంబటి రాయుడికి విరాట్ చిట్కా..
జింబాబ్వేపై తొలి వన్డేలో రాయుడు చాలా పరిణతి చెందిన ఇన్నింగ్స్ ఆడాడు. నిజానికి రెండేళ్లుగా జట్టుతో పాటే ఉంటున్నా తనకి వచ్చిన అవకాశాల సంఖ్య తక్కువ. సీనియర్లందరూ ఉంటే తుది జట్టులో రాయుడికి అవకాశం రావడం చాలా కష్టమైన పరిస్థితి. ప్రపంచకప్ అంతటా జట్టుతో పాటే తిరిగినా పాపం ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఇలా బెంచ్‌పై కూర్చోవడం ఏ ఆటగాడికైనా కష్టమే. అయితే అలాంటి సమయంలో నిరాశ చెందకుండా ఉండటానికి రాయుడికి కోహ్లి ఒక చిట్కా నేర్పాడట. ‘మ్యాచ్ జరుగుతున్నప్పుడు నేను బయట ఉంటే... నేనే క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ స్థానంలో ఆడుతున్నట్లు ఊహించుకుంటా. అలాంటి పరిస్థితిలో బ్యాట్స్‌మన్ ఆడుతున్న బంతిని నేనైతే ఎలా ఆడతానో అంచనా వేసుకుంటూ మ్యాచ్ చూస్తా. దీనివల్ల మ్యాచ్‌లో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోవచ్చు. మానసికంగా మ్యాచ్ ఆడినట్లే భావించవచ్చు. కాబట్టి ఎక్కువ అవకాశాలు రాకుండా బెంచ్‌పై కూర్చున్నా నిరాశగా అనిపించదు. ఈ చిట్కా నాకు కోహ్లి నేర్పించాడు’ అని రాయుడు చెప్పాడు. ఆటపై నియంత్రణ ఎలా తెచ్చుకోవాలో ధోనిని చూసి నేర్చుకున్నానని ఈ హైదరాబాదీ తెలిపాడు. -
సిరీస్ విజయంపై గురి
మధ్యాహ్నం గం. 12.30 నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం నేడు జింబాబ్వేతో భారత్ రెండో వన్డే హరారే: తొలి వన్డేలో జింబాబ్వే ఎదురుదాడి నుంచి తృటిలో తప్పించుకున్న భారత్ జట్టు ఇప్పుడు రెండు అంశాలపై దృష్టిసారించింది. వీలైనంత త్వరగా మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించాలని భావిస్తున్న టీమిండియా రెండో వన్డేతోనే సిరీస్‌ను గెలిచి ఒత్తిడి లేకుండా మూడో మ్యాచ్ ఆడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) జింబాబ్వేతో జరగనున్న రెండో వన్డేలో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో రాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన మురళీ విజయ్, మనోజ్ తివారీ, ఉతప్ప, కేదార్ జాదవ్‌లు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గాడిలో పడతారేమో చూడాలి. కెరీర్లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రాయుడు, బిన్నీలు ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమే అయినా జింబాబ్వేలాంటి ప్రత్యర్థిపై కనీసం మూడొందలకు పైగా స్కోరు చేయాలి. లేదంటే ఊహించని పరాజయం తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ ఫర్వాలేదనిపించినా.. పేసర్లు గాడిలో పడాల్సి ఉంది. భువనేశ్వర్ పరుగులు నియంత్రిస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. ధవల్ రెండింటిలోనూ నిరాశపరుస్తున్నాడు. సీనియర్ ఆటగాడు హర్భజన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు అత్యంత అవసరం. మరోవైపు జింబాబ్వే స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతోంది. భారీ లక్ష్యం కళ్లముందున్నా... కెప్టెన్ చిగుంబురా చూపిన తెగువ అమోఘం. సహచరుల నుంచి అతనికి ఇంకాస్త సహకారం అందితే ఈ సిరీస్‌లో భారత్ పరాజయం తప్పకపోవచ్చేమో. తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నా... రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని జింబాబ్వే కృతనిశ్చయంతో ఉంది. మసకద్జా, సికిందర్ రజా, సీన్ విలియమ్స్, సిబండా, చిబాబా కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం. బౌలర్లు ఓ మోస్తరుగా రాణిస్తున్నా... మంచి భాగస్వామ్యాలను విడగొట్టలేకపోవడం నిరాశ కలిగించే అంశం. -
అవకాశాన్ని అందుకుంటారా!
లైవ్ మ. గం. 12. 30నుంచి టెన్ క్రికెట్లో ప్రత్యక్ష ప్రసారం ఉత్సాహంగా భారత కుర్రాళ్లు నేడు జింబాబ్వేతో తొలి వన్డే బంగ్లాదేశ్ చేతిలో ఓటమి తర్వాత భారత్‌కు బలమైన రిజర్వ్ బెంచ్ అవసరం కనిపించింది. దీనికితోడు సీనియర్ క్రికెటర్లు విశ్రాంతి అడగటంతో జింబాబ్వే పర్యటనకు భారత్ చాలా కొత్త మొహాలతో వెళ్లింది. కాబట్టి ఈ సిరీస్‌లో వచ్చే అవకాశాలను కుర్రాళ్లు ఎలా నియోగించుకుంటారు..? ఎవరైనా భారత రెగ్యులర్ జట్టులోకి రాగల క్రికెటర్ ఉన్నాడా..? కెప్టెన్‌గా రహానే సామర్థ్యం ఏమిటి..? అందివచ్చిన అవకాశాలని కొత్తవాళ్లు అందుకుంటారా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్ ద్వారా సమాధానం దొరకాల్సి ఉంది. హరారే: జింబాబ్వే జట్టును ‘లైట్’ తీసుకుంటే బంగ్లాదేశ్‌లో ఎదురైన పరాభవమే పునరావృతమవుతుంది. ఎందుకంటే ఆ జట్టు బలంగా ఉంది. ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను దాదాపుగా గెలిచినంత పని చేసిన ఈ ఆఫ్రికా జట్టు... ఇటీవల పాకిస్తాన్‌కు ముచ్చెమటలు పట్టించింది. ప్రస్తుతం ఉన్న భారత జట్టుతో పోలిస్తే జింబాబ్వే క్రికెటర్లకు రెట్టింపు అంతర్జాతీయ అనుభవం ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో శుక్రవారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగే తొలి వన్డేలో భారత్ నాణ్యమైన ఆటతీరును ప్రదర్శించాల్సిందే. భారత్, జింబాబ్వే మధ్య 57 వన్డేలు జరగ్గా... భారత్ 45, జింబాబ్వే 10 గెలిచాయి. మరో 2 ‘టై’గా ముగిశాయి. తుది జట్టులో ఎవరో..? దాదాపు జట్టులోని అన్ని స్థానాల్లో కొత్త ఆటగాళ్లు వస్తున్నారు కాబట్టి కూర్పు రహానేకు కష్టం కాకపోవచ్చు. బంగ్లాదేశ్‌తో చివరి రెండు వన్డేల్లో చోటు లభించని రహానే, ఇప్పుడు బ్యాట్స్‌మన్‌గా కూడా తనను తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాయుడు, భువనేశ్వర్‌లాంటి రెగ్యులర్ ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో సీనియర్లుగా కనిపిస్తున్నారు. టెస్టు జట్టు ఓపెనర్ విజయ్‌తో పాటు ఏడాది తర్వాత మనోజ్ తివారికి మరో అవకాశం దక్కవచ్చు. మిడిలార్డర్లో మనీశ్ పాండే అంతర్జాతీయ అరంగేట్రం ఖాయం కాగా, కీపర్ బాధ్యతలు ఉతప్ప నిర్వర్తిస్తాడు. భువీతో పాటు ధావల్ జట్టులో ఉంటాడు. సీనియర్ ఆటగాడు హర్భజన్ తుది జట్టులో ఉండటం ఖాయం కాబట్టి రెండో స్పిన్నర్‌గా అక్షర్‌ను ఆడిస్తారా లేక మూడో పేసర్‌గా మోహిత్‌కు అవకాశం ఇస్తారా చూడాలి. 30 ఏళ్ల వయసులో జట్టులో చోటు దక్కించుకున్న స్టువర్ట్ బిన్నీ ఏడాది కాలంగా తన ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. ఈ సిరీస్‌లోనైనా అతను రాణిస్తే భవిష్యత్తు బాగుంటుంది. సమష్టితత్వంతో... డేవ్ వాట్మోర్ కోచ్‌గా వచ్చిన తర్వాత జింబాబ్వే జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది. పాక్‌తో సిరీస్‌లో సెంచరీలు చేసిన చిగుంబురా, రజా సొంతగడ్డపై ఆ జట్టు బ్యాటింగ్ భారం మోస్తుండగా... మసకద్జా, విలియమ్స్ కూడా కీలకం కానున్నారు. ప్రధాన బ్యాట్స్‌మన్ ఇర్విన్, పేసర్ చటారా గాయాలతో దూరం కావడం ఆ జట్టును కాస్త బలహీనపర్చింది. అయితే పన్యగర, విటోరి పేస్ బాధ్యతలు నిర్వర్తించనుండగా... ఉత్సెయ, క్రిమర్ రూపంలో జట్టులో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. జట్టులో 9 మంది బౌలర్లు ఉన్నారంటూ కోచ్ ప్రకటించుకోవడం విశేషం. జట్లు (అంచనా) భారత్: రహానే (కెప్టెన్), విజయ్, తివారి, రాయుడు, పాండే, ఉతప్ప, బిన్నీ, అక్షర్/మోహిత్, హర్భజన్, భువనేశ్వర్, ధావల్. జింబాబ్వే: చిగుంబుర (కెప్టెన్), సిబాందా, చిబాబా, మసకద్జా, విలియమ్స్, రజా, రిచ్మండ్, ఉత్సెయ, క్రిమర్, పన్యగర, విటోరి. ఇటీవల పాక్‌తో సిరీస్‌లో జింబాబ్వే బాగా ఆడింది. వారిని తక్కువగా అంచనా వేయడం లేదు. మా సామర్థ్యానికి తగినట్లుగా ఆడి విజయం సాధిస్తాం. కుర్రాళ్లు తమను తాము నిరూపించుకునేందుకు ఇది మంచి అవకాశం. కెప్టెన్‌గా నాకంటూ కొన్ని కొత్త ఆలోచనలు, శైలి ఉన్నాయి. అయితే ఈ విషయంలో ధోని భాయ్నుంచి ఎంతో నేర్చుకున్నాను. -రహానే, భారత కెప్టెన్ మా పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గెలిస్తే భారత్ ద్వితీయ శ్రేణి జట్టంటారు. ఓడితే దీంతోనే గెలవలేకపోయామంటారు. అయితే మా జట్టు బలంగా ఉందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. సిరీస్ గెలవడమే లక్ష్యం. -వాట్మోర్, జింబాబ్వే కోచ్ పిచ్, వాతావరణం సాధారణంగా ఈ సీజన్లో జింబాబ్వేలో పిచ్‌లు పొడిగా ఉండి నెమ్మదిగా స్పందిస్తాయి. టర్న్ మరీ ఎక్కువ లభించకపోయినా తక్కువ స్కోర్లకు కట్టడి చేయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్ మొదటి గంట మాత్రం పేస్‌కు అనుకూలిస్తుంది. కొత్త వన్డే నిబంధనలతో బరిలోకి ఐసీసీ ప్రతిపాదించిన కొత్త వన్డే నిబంధనలు భారత్, జింబాబ్వే తొలి వన్డేతోనే అమల్లోకి రానున్నాయి. తొలి 10 ఓవర్లలో క్యాచింగ్ స్థానాల్లో తప్పనిసరిగా ఫీల్డర్లు ఉండటం, బ్యాటింగ్ పవర్‌ప్లే రద్దు, ఆఖరి 10 ఓవర్లలో 30 గజాల సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు, అన్ని నో బాల్‌లకు ఫ్రీ హిట్ తదితర నిబంధనలతో తొలి వన్డే జరగనుంది. పిచ్, వాతావరణం సాధారణంగా ఈ సీజన్లో జింబాబ్వేలో పిచ్‌లు పొడిగా ఉండి నెమ్మదిగా స్పందిస్తాయి. టర్న్ మరీ ఎక్కువ లభించకపోయినా తక్కువ స్కోర్లకు కట్టడి చేయడంలో స్పిన్నర్లే కీలక పాత్ర పోషిస్తారు. మ్యాచ్ మొదటి గంట మాత్రం పేస్‌కు అనుకూలిస్తుంది. -
మెక్ కల్లమ్ విధ్వంసం: కివీస్ ఘనవిజయం
క్రిస్ట్ చర్చ్: శ్రీలంకతో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ డాషింగ్ ఓపెనర్ బ్రాండెన్ మెక్ కల్లమ్ తన బ్యాట్ తో మరోసారి విధ్వంసం సృష్టించాడు. కేవలం 22 బంతులను ఎదుర్కొన్న మెక్ కలమ్ మూడు సిక్స్ లు, ఆరు ఫోర్లతో 51 పరుగులు చేసి కివీస్ కు సునాయాస విజయం అందించాడు. శ్రీలంక విసిరిన 219 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన కివీస్ ఆది నుంచి దూకుడుగా ఆడింది. మెక్ కల్లమ్ దూకుడుగా ఆడి రన్ రేట్ ను ముందుకు తీసుకెళితే.. కోరె అండర్సన్ 81 పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో 43 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకున్న కివీస్ మూడు వికెట్ల తేడాతో లంకేయులపై జయభేరీ మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 218 పరుగులు చేసింది. మహేలా జయవర్ధనే(104) పరుగులు చేసి లంక గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలుపంచుకున్నాడు. -
భారత్‌తో తొలివన్డే.. విండీస్ పరుగుల మోత
కోచి: భారత్‌తో ఐదువన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. బుధవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. భారత బౌలర్లు కరీబియన్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. మార్లన్ శామ్యూల్స్ (126) అజేయ సెంచరీతో చెలరేగగా, రాందిన్ (61) హాఫ్ సెంచరీతో రాణించాడు. డ్వెన్ స్మిత్ 46, డారెన్ బ్రావో 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ నాలుగు, జడేజా, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు. -
భారత్-ఇంగ్లండ్ ల తొలి వన్డే రద్దు
బ్రిస్టల్: భారత్-ఇంగ్లండ్ ల మధ్య జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ రద్దయింది. సోమవారం ఇరుజట్లు తొలిపోరుకు సిద్ధమైనా.. వరుణుడు మాత్రం కరుణించలేదు. ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదు. ఒక్క బంతికూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడంతో క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ చెందారు. టెస్టు సిరీస్ నెగ్గిన జోరులో ఉన్న ఇంగ్లండ్ వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. అయితే గతంలో సొంతగడ్డపై జరిగిన రెండు వన్డే సిరీస్‌లను కోల్పోయింది. పేస్ ఆల్రౌండర్లను ఈ మ్యాచ్ ద్వారా పరిశీలించాలని భావించిన ఇంగ్లండ్ కు వర్షం కారణంగా ఆ ఆశలు తీరలేదు. ఈ మ్యాచ్ కు టెస్ట్ మ్యాచ్ హీరో మొయిన్ అలీని పక్కన పెట్టి తమ పేస్ బౌలింగ్ ను పరీక్షించాలని ఇంగ్లండ్ భావించింది.ఇంగ్లండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ను గెలిచి ఆశాజనకంగా ఆరంభిద్దామని భావించిన టీమిండియా ఆశలు కూడా నెరవేరలేదు. -
మిథాలీసేనకు మరో సవాల్
భారత్, ఇంగ్లండ్ మహిళల తొలి వన్డే నేడు లండన్: ఇంగ్లండ్ పర్యటనలో మరో అగ్ని పరీక్షకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా నేటి నుంచి ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఏకైక టెస్టు విజయంతో ఆత్మవిశ్వాసాన్ని సాధించిన మిథాలీ సేన పటిష్టమైన ఇంగ్లండ్‌తో మరోసారి తాడోపేడో తేల్చుకోనుంది. బౌలర్లు జోరుమీదున్నప్పటికీ.. స్మృతి మందన, మిథాలీ మినహా మిగిలిన బ్యాట్స్‌వుమెన్ ఫామ్‌లో లేకపోవడం భారత జట్టును ఆందోళన పరుస్తోంది. అయితే ఇటీవల ఏకైక టెస్టులో సాధించిన సంచలన విజయం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఈ సిరీస్‌లో 21, 23, 25 తేదీల్లో మూడు వన్డేలు జరుగుతాయి. తొలిసారిగా... ఇంగ్లండ్ ఆతిథ్యమివ్వనున్న 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిబంధనల్ని మార్చింది. మహిళల క్రికెట్ కమిటీ గత ఏడాది చేసిన ప్రతిపాదనల ఆధారంగా ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు ఈ రెండున్నరేళ్లలో ప్రతీ జట్టు మిగిలిన ఏడు జట్లతో స్వదేశంలో కానీ, విదేశాల్లో కానీ ఒక్కో వన్డే సిరీస్ ఆడుతుంది. మొత్తంగా ఒక్కో జట్టుకు కనీసం 21 వన్డేలు ఆడే అవకాశం కలుగుతుంది. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు దక్కుతాయి. ఏడు రౌండ్లు ముగిసే సరికి పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. మిగిలిన నాలుగు జట్లు ప్రపంచకప్ క్వాలిఫయర్ ద్వారా అర్హత సాధించే చివరి అవకాశం ఉంటుంది. -
ఆమ్లా సెంచరీ దక్షిణాఫ్రికా ఘనవిజయం
బులావాయో: ఆమ్లా (132 బంతుల్లో 122; 6 ఫోర్లు; 3 సిక్సర్లు) సెంచరీతో రాణించడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా 93 పరుగుల తేడాతో నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగినసఫారీ 50 ఓవర్లలో 3 వికెట్లకు 309 పరుగులు చేసింది. డికాక్ (63), డుప్లెసిస్ (59)రాణించారు. అనంతరం జింబాబ్వే 49.5 ఓవర్లలో 216 పరుగులకు కుప్పకూలింది. మసకద్జ (61), విలియమ్స్ (51) అర్ధ సెంచరీలు సాధించారు. -
తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా
-
భారత్ అలవోకగా...
తొలి వన్డేలో నెగ్గిన టీమిండియా 7 వికెట్లతో బంగ్లాదేశ్ చిత్తు రాణించిన రహానే, ఉతప్ప మిర్పూర్: సీనియర్లు లేకపోయినా... జట్టులో సత్తాకు కొదవ లేదని భారత యువ ఆటగాళ్లు నిరూపించారు. సమష్టి ప్రదర్శనతో బంగ్లా పర్యటనలో శుభారంభం చేశారు. ఆదివారం ఇక్కడి షేర్-ఎ-బంగ్లా స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో రైనా బృందం 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (63 బంతుల్లో 59; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), షకీబ్ అల్ హసన్ (58 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా... అనాముల్ హక్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), మహ్ముదుల్లా (44 బంతుల్లో 41; 6 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ స్కోరు 16.4 ఓవర్లలో 100 పరుగులకు చేరిన దశలో భారీ వర్షం కురిసి మ్యాచ్‌కు చాలా సమయం పాటు అంతరాయం కలిగింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయీస్ నిబంధన ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 26 ఓవర్లలో 150 పరుగులుగా నిర్ణయించారు. టీమిండియా 24.5 ఓవర్లలో 3 వికెట్లకు 153 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అజింక్య రహానే (70 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రాబిన్ ఉతప్ప (44 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండో వన్డే మంగళవారం జరుగుతుంది. రసూల్‌కు అవకాశం... ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున ఇద్దరు ఆటగాళ్లు అంతర్జాతీయ వన్డేల్లో అరంగేట్రం చేశారు. ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్‌లకు ఆ అవకాశం దక్కింది. జమ్మూ కాశ్మీర్ తరఫున భారత్‌కు ఆడిన తొలి క్రికెటర్‌గా రసూల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు రాబిన్ ఉతప్ప ఆరేళ్ల విరామం తర్వాత భారత్ తరఫున వన్డే ఆడటం విశేషం. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) సాహా (బి) యాదవ్ 0; అనాముల్ (సి) రాయుడు (బి) రసూల్ 44; మోమినుల్ (సి) సాహా (బి) యాదవ్ 6; ముష్ఫికర్ (సి) రహానే (బి) రసూల్ 59; షకీబ్ (సి) అండ్ (బి) రైనా 52; మహ్ముదుల్లా (బి) మిశ్రా 41; నాసిర్ (సి) రహానే (బి) మిశ్రా 22; జియావుర్ (సి) రైనా (బి) యాదవ్ 2; మొర్తజా (బి) పటేల్ 18; రజాక్ (నాటౌట్) 16; అల్ అమీన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 272 వికెట్ల పతనం: 1-5; 2-35; 3-87; 4-134; 5-199; 6-229; 7-234; 8-235; 9-267. బౌలింగ్: మోహిత్ శర్మ 5.4-1-23-0; ఉమేశ్ యాదవ్ 9-0-48-3; ఉతప్ప 0.2-0-0-0; అక్షర్ పటేల్ 10-0-59-1; మిశ్రా 10-0-55-2; రసూల్ 10-0-60-2; రైనా 5-0-24-1. భారత్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) షకీబ్ 50; రహానే (సి) జియావుర్ (బి) మొర్తజా 64; పుజారా (ఎల్బీ) (బి) షకీబ్ 0; రాయుడు (నాటౌట్) 16; రైనా (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (24.5 ఓవర్లలో 3 వికెట్లకు) 153 వికెట్ల పతనం: 1-99; 2-100; 3-135. బౌలింగ్: మొర్తజా 5-0-25-1; అల్ అమీన్ 5-0-32-0; షకీబ్ 6-0-27-2; రజాక్ 5-0-34-0; జియావుర్ 1-0-9-0; మహ్ముదుల్లా 2.5-0-26-0. -
భారత్-బంగ్లాదేశ్ తొలి వన్డేకు వర్షం ఆటంకం
మీర్పూర్: భారత్-బంగ్లాదేశ్ తొలివన్డేకు వర్షం ఆటంకం కలిగించింది. 273 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన భారత్ 16.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 100 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. ఊతప్ప (50) హాఫ్ సెంచరీ చేశాడు. రహానె (46), పుజారా (0) క్రీజులో ఉన్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 272 పరుగులు చేసింది. భారత బౌలర్లు ఉమేష్ మూడు, అమిత్, పర్వేజ్ రెండేసి వికెట్లు తీశారు. భారత పేసర్ ఉమేష్ ఆరంభంలోనే తమీమ్ ఇక్బాల్ (0), మోమినల్ హక్ (6) అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కాగా ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పట్టు సడలించారు. బంగ్లా బ్యాట్స్‌మెన్ అనామల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (59), షకీబల్ హసన్ (52), మహ్మదుల్లా (41) జట్టును ఆదుకున్నారు. -
రాణించిన భారత బౌలర్లు.. బంగ్లాతో తొలివన్డే
మీర్పూర్: బంగ్లాదేశ్‌తో తొలివన్డేలో భారత బౌలర్లు రాణించారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్‌ను పూర్తి ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 272 పరుగులకు కట్టడి చేశారు. బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఆరంభమైన ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్ సత్తాచాటారు. ఉమేష్ మూడు, అమిత్, పర్వేజ్ రెండేసి వికెట్లు తీశారు. భారత పేసర్ ఉమేష్ ఆరంభంలోనే తమీమ్ ఇక్బాల్ (0), మోమినల్ హక్ (6) అవుట్ చేసి జట్టుకు శుభారంభం అందించాడు. కాగా ఆ తర్వాత భారత బౌలర్లు కాస్త పట్టు సడలించారు. బంగ్లా బ్యాట్స్‌మెన్ అనామల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (59), షకీబల్ హసన్ (52), మహ్మదుల్లా (41) జట్టును ఆదుకున్నారు. -
చెలరేగిన విరాట్, రోహిత్; భారత్ ఘనవిజయం
-
చెలరేగిన విరాట్, రోహిత్; భారత్ ఘనవిజయం
వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. గురువారమిక్కడ జరిగిన తొలి డే/నైట్ మ్యాచ్‌లో భారత బౌలర్ల విజృంభణకు బ్యాట్స్‌మెన్ కృషి తోడవడంతో ధోనీసేన ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 35.2 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. యువ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (86), రోహిత్ శర్మ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ధవన్ (5) నిరాశపరిచినా కోహ్లీ, రోహిత్ రెండో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కరీబియన్లు 48.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో రైనా, జడేజా చెరో మూడు, అశ్విన్ రెండు, షమీ వికెట్ తీశారు. విండీస్ జట్టులో డారెన్ బ్రావో (59) టాప్ స్కోరర్. బ్రావో, చార్లెస్ (42) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రెండో బంతికే సున్నా చుట్టేశాడు. గేల్‌ను భువనేశ్వర్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత బ్రావో, చార్లెస్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఇతర బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేకపోయారు. జడేజా, రైనా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు టాపార్డర్ పనిపట్టారు. దీంతో విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. -
చెలరేగిన భారత బౌలర్లు, వెస్టిండీస్ 211 ఆలౌట్
వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారమిక్కడ ఆరంభమైన తొలి డే/నైట్ వన్డేలో భారత బౌలర్ల ధాటికి కరీబియన్లు 48.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో రైనా, జడేజా చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అశ్విన్ రెండు, షమీ వికెట్ తీశారు. విండీస్ జట్టులో డారెన్ బ్రావో (59) టాప్ స్కోరర్. బ్రావో, చార్లెస్ (42) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కరీబియన్లకు ఆరంభంలోనే షాక్ తగిలింది. విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రెండో బంతికే సున్నా చుట్టేశాడు. గేల్‌ను భువనేశ్వర్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత బ్రావో, చార్లెస్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఇతర బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేకపోయారు. జడేజా, రైనా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు టాపార్డర్ పనిపట్టారు. దీంతో విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. 49వ ఓవర్లో రాంపాల్ ను అశ్విన్ అవుట్ చేయడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. -
తొలి వన్డే: భారత్‌పై ఆసీస్ విజయం
పూణె: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 72 పరుగుల తేడాతో విజయం సాధించి శుభారంభం చేసింది. ఆసీస్ విసిరిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే థావన్ (7) వికెట్టును కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో బ్యాటింగ్ వచ్చిన విరాట్ కోహ్లి , రోహిత్ శర్మకు జత కలిశాడు. వీరివురూ బాధ్యాతయుతంగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. రోహిత్ (47) పరుగుల వద్ద తన వికెట్టును కోల్పోయాడు. అనంతరం కోహ్లి(61) కూడా పెవిలియన్ కు చేరడంతో భారత్ కష్టాల బాటపట్టింది. రైనా(39), యువరాజ్(7),ధోని(19), జడేజా(11) పరుగులకే అవుట్ కావడంతో భారత్ 49.4 ఓవర్లలో 232 పరుగులకే చాప చుట్టేసి ఓటమి పాలైంది. ఆసీస్ బౌలర్లు సమిష్టిగా రాణించి భారత్‌ను కట్టడి చేశారు. తొలుత టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు హ్యూజెస్(47), ఫించ్(72) పరుగులతో మంచి ఆరంభాన్ని ఇవ్వడంతో ఆసీస్ 304 పరుగుల భారీ స్కోరు చేసింది. -
భారత్ విజయం లక్ష్యం 305
భారత్‌తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 305 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఏడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 304 పరుగులు చేశారు. ఆసీస్ జట్టులో కెప్టెన్ బెయిలీ (85), అరోన్ ఫించ్ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫించ్, హ్యూస్ (47) జోడీ 110 పరుగుల శుభారంభమందించారు. ఈ దశలో భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ జోరు కాస్త తగ్గింది. భారత బౌలర్లలో అశ్విన్, యువరాజ్ సింగ్ చెరో రెండు, వినయ్‌కుమార్, ఇషాంత్, జడేజా తలా వికెట్ తీశారు. ధోనీసేన లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది.