విండీస్‌తో వన్డే : రిషబ్‌ పంత్‌ అరంగేట్రం | Rishabh Pant Debut In West Indies One Day | Sakshi
Sakshi News home page

విండీస్‌తో వన్డే : రిషబ్‌ పంత్‌ అరంగేట్రం

Published Sun, Oct 21 2018 1:41 PM | Last Updated on Sun, Oct 21 2018 2:05 PM

Rishabh Pant Debut In West Indies One Day - Sakshi

ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా నేడు (ఆదివారం) గువాహటిలో తొలి వన్డే జరుగునుంది.

గువాహటి: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్‌ గెలిచి భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా నేడు (ఆదివారం) గువాహటిలో తొలి వన్డే జరుగునుంది. ఇటీవల టెస్ట్‌ సీరిస్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో అందరినీ అకట్టుకున్న యువ సంచలనం రిషభ్‌ పంత్‌ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌కు ముందు సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ చేతుల మీదుగా పంత్‌ తన తొలి వన్డే క్యాప్‌ అందుకున్నాడు. టెస్ట్ సిరీస్‌ను క్లీస్‌ స్వీప్‌ చేసి మంచి ఊపుమీద ఉ‍న్న టీమిండియా వన్డేల్లోనూ అదే దూకుడుని కొనసాగించాలని పట్టుదలతో ఉండగా.. కనీసం వన్డే సిరీస్‌నైనా గెలిచి పరువు నిలుపుకోవాలని వెస్టిండీస్‌ భావిస్తోంది. 

భారత్‌ జట్టు : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ దావన్‌, అంబటి రాయుడు, ధోని, రిషబ్‌ పంత్‌, జడేజా, ఉమేష్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, కలీల్‌, చహల్‌

వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), ఆంబ్రిస్, కీరన్‌ పావెల్, షై హోప్, హెట్‌మెయిర్, శామ్యూల్స్, రోవ్‌మన్‌ పావెల్, ఆష్లే నర్స్, కీమో పాల్, బిషూ, కీమర్‌ రోచ్‌.  

చదవండి: వన్డేలూ ఏకపక్షమేనా! 

సచిన్‌కు చేరువలో కోహ్లి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement