సౌథీ.. ఒకే ఒక్కడు | tim southee achives rare feat in new zealand one day innigs | Sakshi
Sakshi News home page

సౌథీ.. ఒకే ఒక్కడు

Published Sun, Oct 16 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 5:25 PM

సౌథీ.. ఒకే ఒక్కడు

సౌథీ.. ఒకే ఒక్కడు

ధర్మశాల:ఐదు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ తో తొలి మ్యాచ్ లో న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సౌథీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సౌథీ (55;45 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. తద్వారా న్యూజిలాండ్ వన్డే క్రికెట్ చరిత్రలో కొత్త రికార్డును నమోదు చేశాడు. న్యూజిలాండ్ వన్డే ఇన్నింగ్స్ ల్లో 10 లేదా 11 వ స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చి అర్థశతకం సాధించిన ఆ దేశ తొలి ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కివీస్ వన్డే మ్యాచ్ ల్లో ఆ స్థానంలో కేల్ మిల్స్(44నాటౌట్) చేసిన పరుగులే ఇప్పటివరకూ అత్యధికం. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో మిల్స్ సాధించిన ఆ ఘనతను సౌథీ సవరించాడు.

మరోవైపు టామ్ లాధమ్ కూడా మరో ఘనతను అందుకున్నాడు. భారత పర్యటనలో భాగంగా ఏడు ఇన్నింగ్స్ ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 43.5 ఓవర్లలో190 పరుగులకు ఆలౌటైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement