భారత్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 305 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్తో తొలి వన్డేలో ఆస్ట్రేలియా 305 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఏడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారమిక్కడ జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కంగారూలు నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 304 పరుగులు చేశారు.
ఆసీస్ జట్టులో కెప్టెన్ బెయిలీ (85), అరోన్ ఫించ్ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఫించ్, హ్యూస్ (47) జోడీ 110 పరుగుల శుభారంభమందించారు. ఈ దశలో భారత బౌలర్లు విజృంభించడంతో ఆసీస్ జోరు కాస్త తగ్గింది. భారత బౌలర్లలో అశ్విన్, యువరాజ్ సింగ్ చెరో రెండు, వినయ్కుమార్, ఇషాంత్, జడేజా తలా వికెట్ తీశారు. ధోనీసేన లక్ష్యాన్ని ఛేదించాల్సివుంది.