భారత్తో తొలివన్డే.. విండీస్ పరుగుల మోత | Westindies sets 322 runs target for India in first one day | Sakshi
Sakshi News home page

భారత్తో తొలివన్డే.. విండీస్ పరుగుల మోత

Published Wed, Oct 8 2014 6:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

Westindies sets 322 runs target for India in first one day

కోచి: భారత్తో ఐదువన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డేలో వెస్టిండీస్ భారీ స్కోరు సాధించింది. బుధవారమిక్కడ జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. భారత బౌలర్లు కరీబియన్లను కట్టడి చేయడంలో విఫలమయ్యారు.

మార్లన్ శామ్యూల్స్ (126) అజేయ సెంచరీతో చెలరేగగా, రాందిన్ (61) హాఫ్ సెంచరీతో రాణించాడు. డ్వెన్ స్మిత్ 46, డారెన్ బ్రావో 28 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ నాలుగు, జడేజా, అమిత్ మిశ్రా చెరో వికెట్ తీశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement