విండీస్ విజయలక్ష్యం 331 | india set target of 320 runs against west indies | Sakshi
Sakshi News home page

విండీస్ విజయలక్ష్యం 331

Published Fri, Oct 17 2014 6:13 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

విండీస్ విజయలక్ష్యం 331

విండీస్ విజయలక్ష్యం 331

ధర్మశాల: వెస్టిండీస్ తో ఇక్కడ జరుగుతున్న నాల్గో వన్డేలో టీమిండియా 331 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కు శుభారంభం లభించింది. టాస్ ఓడిన టీమిండియాకు ఓపెనర్లు రహానే (68), శిఖర్ థావన్ (35) పరుగులతో ఆకట్టుకున్నారు. అనంతరం విరాట్ కోహ్లి, రైనాల జోడీ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. కోహ్లి(127; 113 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్ లు ), రైనా (71 ;58 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లులు) విండీస్ కు చుక్కులు చూపించారు. తొలి వన్డేలో ఓటమి పాలైన అనంతరం రెండో వన్డేలో ఘన విజయం సాధించిన టీమిండియా ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు.  వన్డేలో 20 వ సెంచరీ చేసిన కోహ్లీ భారత్ ను పటిష్ట స్థితిలోకి చేర్చాడు. 

 

దీంతో భారత్ నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది.  విండీస్ బౌలర్లలో  టేలర్, హోల్డర్,రస్సెల్, బెన్ లకు తలో వికెట్టు లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement