ధర్మశాల: వెస్టిండీస్తో నాలుగో వన్డేలో భారత్ దూకుడుగా ఆడుతోంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా శుక్రవారమిక్కడ జరుగుతున్న నాలుగో మ్యాచ్లో ధోనీసేన టాస్ ఓడి బ్యాటింగ్ దిగింది. భారత్ 35 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
ఓపెనర్లు రహానె, ధవన్ తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభం అందించారు. ధవన్ అవుటయిన తర్వాత రహానెకు విరాట్ కోహ్లీ అండగా నిలిచారు. రహానె (68), కోహ్లీ (57 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ధవన్ 35 పరుగులు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ, రైనా క్రీజులో ఉన్నారు.
ఈ సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. తొలి మ్యాచ్లో విండీస్ నెగ్గగా, రెండో వన్డేలో ధోనీసేన గెలుపొందింది. మూడో వన్డే వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. దీంతో సిరీస్ గెలవాలంటే ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం.
నాలుగో వన్డే: రహానె, కోహ్లీ హాఫ్ సెంచరీలు
Published Fri, Oct 17 2014 4:54 PM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM
Advertisement
Advertisement