
జాసన్ రాయ్ ఇరగదీశాడు
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇరగదీశాడు.
పుణె: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ ఇరగదీశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో భాగంగా రాయ్ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి మెరుపులు మెరిపించాడు. జాసన్ రాయ్ 10 ఫోర్లు సాయంతో అర్థ శతకాన్ని సాధించాడు. తద్వారా భారత్ పై అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రెండో ఇంగ్లిష్ ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.
అయితే భారత్ పై వేగవంతమైన హాఫ్ సెంచరీ సాధించే అవకాశాన్ని రాయ్ తృటిలో కోల్పోయాడు. గతంలో ఓవై షా, ఫ్లింటాఫ్లు భారత్ పై 35 బంతుల్లో వేగవంతమైన అర్థ శతకాలు సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఆ రికార్డును తిరగరాసే అవకాశాన్ని రాయ్ స్వల్ప తేడాలో మిస్సయ్యాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్ ఆదిలోనే హేల్స్(9) వికెట్ ను రనౌట్ రూపంలో కోల్పోయింది. ఆ తరువాత జో రూట్ తో కలిసి రాయ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. రాయ్ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రెండో వికెట్ గా అవుటయ్యాడు.జడేజా బౌలింగ్ లో ముందుకెళ్లి ఆడబోయిన రాయ్ ను ధోని స్టంప్ అవుట్ చేశాడు.