ఓపెనర్లు ఇద్దరూ అవుట్‌ | team india openers out | Sakshi
Sakshi News home page

ఓపెనర్లు ఇద్దరూ అవుట్‌

Published Sun, Jan 15 2017 6:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

ఓపెనర్లు ఇద్దరూ అవుట్‌

ఓపెనర్లు ఇద్దరూ అవుట్‌

ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది.

పుణె: ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో 351 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియాకు మొదట్లోనే ఎదురు దెబ్బ తగిలింది. విల్లీ బౌలింగ్‌లో ఓపెనర్లు ధవన్, లోకేష్‌ రాహుల్‌ ఇద్దరూ వెంటవెంటనే అవుటయ్యారు. 10 బంతులాడిన ధవన్‌ ఒక్క పరుగుకే అవుటయ్యాడు.  విల్లీ బౌలింగ్‌లో మొయిన్ అలీకి క్యాచిచ్చాడు. వెంటనే రాహుల్‌ కూడా విల్లీ బౌలింగ్‌లోనే బౌల్డ్ అయ్యాడు. భారత్‌ 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. కోహ్లీ, యువరాజ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

పుణెలో ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్‌ పూర్తి ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది.  జాసన్ రాయ్(73; 61 బంతుల్లో 12 ఫోర్లు), జో రూట్(78; 95 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), బెన్ స్టోక్స్(62) హాఫ్‌ సెంచరీలతో రాణించగా, మోర్గాన్(28), బట్లర్(31), అలీ (28)లు ఫర్వాలేదనిపించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement