
విరాట్ సేన ఫీల్డింగ్
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
పుణె: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడ ఆదివారం ఇంగ్లండ్తో ఆరంభమైన తొలి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లి పూర్తి స్థాయి భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆడుతున్న తొలి సిరీస్ ఇది. ఈ సిరీస్ మొదటి మ్యాచ్లో కోహ్లి సారథ్యంలోని భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. ఛేజింగ్ హీరోగా ముద్రపడిన కోహ్లి.. లక్ష్యాన్ని ఛేదించేందుకు మొగ్గు చూపుతూ తొలుత ఫీల్డింగ్ తీసుకున్నాడు.
టెస్టుల్లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్.... వన్డేల్లోనూ అదే జోరును ప్రదర్శించాలని భావిస్తోంది. మరోవైపు పరిమితి ఓవర్ల స్పెషలిస్ట్ ఆటగాళ్లతో భారత్‌కు వచ్చిన ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఫలితం పునరావృతం కాకుండా చూసుకోవాలని యోచిస్తోంది.