'ఇక్కడ బ్యాట్స్మెన్ సక్సెస్ రేటు ఎక్కువ' | ashim Amla says batsmen can be successful in T20s without "looking agricultural" | Sakshi
Sakshi News home page

'ఇక్కడ బ్యాట్స్మెన్ సక్సెస్ రేటు ఎక్కువ'

Published Mon, May 8 2017 6:46 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM

'ఇక్కడ బ్యాట్స్మెన్ సక్సెస్ రేటు ఎక్కువ'

'ఇక్కడ బ్యాట్స్మెన్ సక్సెస్ రేటు ఎక్కువ'

మొహాలి: క్రికెటర్లు బ్యాట్స్మెన్ గా సక్సెస్ కావడానికి ట్వంటీ 20 ఫార్మాట్ అనేది ఎంతగానో దోహదపడుతుందని దక్షిణాఫ్రికా క్రికెటర్, కింగ్స్ పంజాబ్ ఆటగాడు హషీమ్ ఆమ్లా అభిప్రాయపడ్డాడు. పెద్దగా హిట్టింగ్ చేయని తనలాంటి ఆటగాళ్లకు ట్వంటీ 20 క్రికెట్  అనేది భారీగా పరుగులు చేయడానికి ఉపయోగపడుతుందన్నాడు. దీని ద్వారా కచ్చితమైన క్రికెటింగ్ షాట్లను కూడా నేర్చుకునే అవకాశం లభిస్తుందని ఆమ్లా తెలిపాడు.

'ఇక్కడ సక్సెస్ కావడానికి క్రికెట్ గురించి లోతైన  శోధన అవసరం లేదు. ట్వంటీ 20 ఫార్మాట్ క్రికెట్ ద్వారా ప్రతీ బంతిని ఎదుర్కోవడం తెలియాలి. దాదాపు 10 ఏళ్ల ఈ ఫార్మాట్ ను పరిశీలిస్తే అనేక మంది విజయవంతమైన క్రికెటర్లు ఉన్నారు. ఇది బ్యాట్స్మెన్ సక్సెస్ ఫార్మాట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు .ఈ ఫార్మాట్ ద్వారా వెలుగులోకి వచ్చిన చాలా మందికి తొలుత భారీ హిట్టింగ్ అనేది తెలియకపోవచ్చు. ఇక్కడకు  వచ్చిన తరువాత దీనికి అలవాటై పరుగులు ఎలా చేయాలి అనేది నేర్చుకుంటున్నారు. ఆ రకంగా బ్యాట్స్మెన్ సక్సెస్ కు ఐపీఎల్ కానీ, ట్వంటీ 20 క్రికెట్ కానీ ఉపయోగపడుతుందనేది నా అభిప్రాయం. ఇక్కడ బ్యాట్స్మెన్ సక్సెస్ రేటు ఎక్కువ' అని ఆమ్లా తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement