Hashim Amla: సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హషీం ఆమ్లా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతున్న ఆమ్లా.. ఈ ఏడాది (2023) కౌంటీ సీజన్ బరిలోకి దిగేది లేదని స్పష్టం చేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్‌లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేసి తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు. రిటైర్మెంట్ ప్రకటనలో ఆమ్లా.. సర్రే టీమ్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా సర్రే డైరెక్టర్ అలెక్ స్టివర్ట్ పేరును ప్రస్తావిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . అంతర్జాతీయ క్రికెట్‌లో 55 సెంచరీల సాయంతో 18000కు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment