retirement decision
-
దేశ ప్రధాని జోక్యం.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఒక్కరోజు వ్యవధిలోనే తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు తమీమ్ ఇక్బాల్. కాగా అతను రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం వెనుక బంగ్లా ప్రధాని షేక్ హసీనా జోక్యం ఉన్నట్లు సమాచారం. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తమీమ్ ఇక్బాల్ శుక్రవారం(జూలై 7న) సాయంత్రం బంగ్లా ప్రధాని షేక్ హసీనాను మర్యాద పూర్వకంగా కలిశాడు. ఈ నేపథ్యంలో ప్రధాని తనను రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరిందంటూ తమీమ్ ఇక్బాల్ మీడియాకు వివరించాడు. మీడియాతో మాట్లాడుతూ.. ''ముఖ్యమైన వన్డే వరల్డ్‌కప్ ముందు ఇలాంటి నిర్ణయం తగదని.. వరల్డ్‌కప్ వరకైనా క్రికెట్ ఆడితే బాగుంటుందని'' ప్రధాని తనను కోరినట్లు తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు. రిటైర్మెంట్ విషయంలో ఎవరు చెప్పినా వినకపోయేవాడినని.. అయితే ప్రధాని షేక్ హసీనా మాటల విషయంలో మాత్రం తాను అభ్యంతరం చెప్పలేకపోయానని.. అందుకే రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నా. స్వయంగా బంగ్లా ప్రధాని తనకు నెలన్నర రోజుల పాటు ఆటకు దూరంగా ఉండాలని.. మానసికంగా కుదుటపడాలని కోరారు. అందుకే నెలన్నర పాటు ఆటకు దూరంగా ఉండాలనుకుంటున్నా. మానసికంగా సిద్దమయ్యాకా మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ఇక తమీమ్ ఇక్బాల్ బంగ్లా తరఫున 70 టెస్ట్‌లు, 241 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. లెఫ్ట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్.. టెస్ట్‌ల్లో 10 సెంచరీలు, 31 అర్ధసెంచరీల సాయంతో 5134 పరుగులు.. వన్డేల్లో 14 సెంచరీలు, 56 అర్ధసెంచరీల సాయంతో 8313 పరుగులు.. టీ20ల్లో సెంచరీ, 7 అర్ధసెంచరీల సాయంతో 1758 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో తమీమ్ అత్యుత్తమ ఆటగాడిగా పేరుగాంచాడు. చదవండి: Tamim Iqbal Retirement: స్టార్ క్రికెటర్ షాకింగ్ నిర్ణయం.. అర్ధాంతరంగా రిటైర్మెంట్ ప్రకటన -
రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
Hashim Amla: సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హషీం ఆమ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతున్న ఆమ్లా.. ఈ ఏడాది (2023) కౌంటీ సీజన్ బరిలోకి దిగేది లేదని స్పష్టం చేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేసి తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు. రిటైర్మెంట్ ప్రకటనలో ఆమ్లా.. సర్రే టీమ్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా సర్రే డైరెక్టర్ అలెక్ స్టివర్ట్ పేరును ప్రస్తావిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18000కు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. -
రిటైర్మెంట్ ప్రకటనపై యూ టర్న్ తీసుకోనున్న మిథాలీ రాజ్..?
Mithali Raj: భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ సారధి మిథాలీ రాజ్ ఇటీవలే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె తన రిటైర్మెంట్ ప్రకటనపై వెనక్కు తగ్గాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీ హండ్రెడ్ పర్సెంట్ క్రికెట్ పోడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. మళ్లీ మైదానంలోకి దిగుతానంటూ సూచనప్రాయంగా వెల్లడించింది. వచ్చే ఏడాది గనుక మహిళల ఐపీఎల్ ప్రారంభమైతే తప్పక తాను బరిలో ఉంటానని పరోక్షంగా పేర్కొంది. Mithali Raj said, "It would be lovely to be part of the women's IPL. I'm open to coming out of retirement." (To ICC). — Mufaddal Vohra (@mufaddal_vohra) July 25, 2022 ఐపీఎల్ కోసం ఆ ఆప్షన్‌ను (రీఎంట్రీ) ఎప్పుడూ ఓపెన్‌గా పెట్టుకుంటానని తెలిపింది. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటారా అని ఎదురైన ప్రశ్నకు మిథాలీ పైవిధంగా స్పందించింది. కాగా, మహిళల ఐపీఎల్ నిర్వహణకు బీసీసీఐ గత కొద్ది కాలంగా భారీ కసరత్తు చేస్తుంది. వుమెన్స్ ఐపీఎల్‌ను ఎలాగైనా వచ్చే ఏడాది (2023) ప్రారంభిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా కొద్దిరోజుల కిందట ప్రకటన కూడా చేశారు. మొత్తం 6 జట్లతో మహిళల ఐపీఎల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. చదవండి: Ind Vs WI 2nd ODI: నిరాశకు లోనయ్యాను.. ద్రవిడ్ సర్ చాలా టెన్షన్ పడ్డారు! -
ఎన్సీఎల్ఏటీ చైర్మన్‌గా జస్టిస్ చీమా కొనసాగొచ్చు
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) చైర్పర్సన్ జస్టిస్ అశోక్ ఇక్బాల్‌సింగ్ చీమాను గడువు కంటే ముందే పదవీ విరమణ చేయించడంపై తలెత్తిన వివాదానికి తెరపడింది. ఈయన ఈ నెల 20వ తేదీ దాకా పదవిలో కొనసాగుతూ తీర్పులిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జస్టిస్ చీమా ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా ఈ నెల 20న పదవీ విమరణ చేయాల్సి ఉండగా, కేంద్ర ప్రభుత్వం ఈ పదవిలో జస్టిస్ ఎం.వేణుగోపాల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం ఈ నెల 11వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని తేల్చిచెప్పింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ జస్టిస్ చీమా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై సీజేఐ జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర సర్కారు తరపున అటారీ్న జనరల్ వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ నెల 20 దాకా జస్టిస్ చీమా ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌గా కొనసాగవచ్చని, తీర్పులు వెలువరించవచ్చని అన్నారు. జస్టిస్ వేణుగోపాల్‌ను అప్పటిదాకా సెలవుపై పంపిస్తామని వెల్లడించారు. ట్రిబ్యునళ్ల నియామకాల విషయంలో ధర్మాసనం కేంద్రం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్రం ఇటీవల తీసుకొచి్చన ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం–2021 ప్రకారం. ఎన్సీఎల్ఏటీ చైర్‌పర్సన్‌ను మార్చే అధికారం ప్రభుత్వానికి ఉందని వేణుగోపాల్ చెప్పగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. తమ సుమోటో అధికారాలను ఉపయోగించి ఈ చట్టంపై స్టే విధిస్తామని ఒక దశలో ప్రభుత్వాన్ని హెచ్చరించింది. -
ధోనీ రిటైర్మెంట్పై వివాదం
ముంబై: టీమిండియా వన్డే, టి-20 కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ తప్పుకోవడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వచ్చే వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్త సారథిని ఎంపిక చేసేందుకు వీలుగా ధోనీ వైదొలగాడని పలువురు క్రికెటర్లు, మాజీలు అభిప్రాయపడగా.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బీసీసీఐ అతనిపై ఒత్తిడి చేసినట్టు తాజాగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. మహీ స్వతహాగా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోలేదని కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో ధోనీ రిటైర్మెంట్ ప్రకటనపై వివాదం ఏర్పడటంతో భారత సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాల్సిందిగా ధోనీపై ఎవరూ ఎలాంటి ఒత్తిడి చేయలేదని, అతను స్వతహాగానే నిర్ణయం తీసుకున్నాడని ప్రసాద్ స్పష్టం చేశాడు. రంజీ ట్రోఫీ సెమీస్ మ్యాచ్ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్ గురించి తనతో మాట్లాడినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ పదవి నుంచి తాను వైదొలగాలని భావిస్తున్నానని, తన స్థానంలో మరొకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయాలని కోరినట్టు ప్రసాద్ తెలిపాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతానని ధోనీ తనతో చెప్పాడని ఎంఎస్కే ప్రసాద్ వివరణ ఇచ్చాడు. ధోనీ నిజాయతీ గల వ్యక్తని, అతని నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు. విరాట్ కోహ్లీకి జట్టు పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన నిర్ణయమని, అతనికి ధోనీ గైడ్‌గా వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే వన్డే, టి-20 సిరీస్‌లకు విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ జట్టులో ధోనీకి స్థానం కల్పించారు. -
'రిటైర్మెంట్ నిర్ణయంపై బాధలేదు'
టీమిండియా సీనియర్ పేసర్ ఆశీష్ నెహ్రా లేటు వయసులో అదరగొడుతున్నాడు. 36 ఏళ్ల నెహ్రా ఆసియా కప్, టి-20 ప్రపంచ కప్‌లలో సత్తాచాటి శభాష్ అనిపించుకున్నాడు. నెహ్రా ప్రదర్శన భారత్ మాజీ పేసర్ జహీర్ ఖాన్ ను ఆకట్టుకుంది. తనకు స్ఫూర్తినిచ్చిందని జహీర్ చెప్పాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తాను వైదొలిగినందుకు బాధగా లేదని 37 ఏళ్ల జహీర్ చెప్పాడు. ఈ ఐపీఎల్ సీజన్లో చివరిసారి ఆడనున్న జహీర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. 'అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నేను తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషంగా ఉన్నా. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. దీనికే కట్టుబడి ఉంటాను. నెహ్రా రాణించినందుకు సంతోషంగా ఉంది. నాకు స్ఫూర్తి కలిగించాడు. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడుతున్నా. యువ బౌలర్లకు సలహాలు ఇస్తూ సీజన్‌ను ఆస్వాదిస్తా' అని జహీర్ అన్నాడు. ఐపీఎల్ వల్ల బౌలర్లకు పెద్దగా ఉపయోగం ఉండదని జహీర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ ప్రదర్శనతో బౌలర్లు అంతర్జాతీయ వన్డేలు, టెస్టులకు ఎంపిక కావడం కష్టమని చెప్పాడు. బౌలర్లకు భిన్నమైన నైపుణ్యాలు ఉండాలని పేర్కొన్నాడు. వన్డేలు, టెస్టులతో పోలిస్తే టి-20 ఫార్మాట్ పూర్తిగా భిన్నమైదని అన్నాడు.