Surrey Team
-
సాయి సుదర్శన్ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్‌లో ఆడనున్న యువ సంచలనం!
తమిళనాడు సూపర్ స్టార్, గుజరాత్ టైటాన్స్ యువ సంచలనం సాయి సుదర్శన్ తొలి సారి ఇంగ్లండ్ కౌంటీల్లో అడనున్నాడు. 21 ఏళ్ల సుదర్శన్ ఇంగ్లీష్ క్రికెట్ క్లబ్ సర్రేతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడు కౌంటీ ఛాంపియన్షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో సర్రే తరపున ఆడనున్నాయి. అయితే టామ్ లాథమ్, విల్ జాక్స్ , సామ్ కర్రాన్ వంటి సర్రే ఆటగాళ్లు తమ జాతీయ జట్టు విధుల కారణంగా ఆఖరి కౌంటీ మ్యాచ్‌లకు అందుబాటులో లేరు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ సర్రే తరపున ఇంగ్లండ్ కౌంటీల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. సాయి సుదర్శన్ ప్రస్తుతం అధ్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్‌తో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో దుమ్మురేపాడు. అదే విధంగా ఎమర్జింగ్ ఆసియాకప్‌లో కూడా సాయి అదరగొట్టాడు. వైట్‌బాల్ క్రికెట్లో అదరగొడుతున్న సుదర్శన్.. రెడ్‌బాల్ క్రికెట్లో కూడా తన టాలెంట్‌ను నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు. ఈ క్రమంలో సర్రే క్రికెట్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పటివరకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్.. 42.71 సగటుతో 598 పరుగులు చేశాడు. చదవండి: Asia Cup 2023: పాకిస్తాన్‌తో అంత ఈజీ కాదు.. విధ్వంసకర ఆటగాళ్లు వీరే! అయినా టీమిండియాదే -
కసితీరా బాదారు.. టి20 చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఛేదన
తుఫాను వచ్చేముందు ప్రశాంతత ఉంటుందంటారు. అయితే ఒక్కసారి వర్షం మొదలయ్యాకా వచ్చే ఉరుములు, మెరుపులు మనల్ని ఉలికిపాటుకు గురి చేస్తాయి. అచ్చం అలాంటి తుఫాను ఇన్నింగ్స్ టి20 బ్లాస్ట్ 2023 టోర్నీలో నమోదైంది. కొడితే సిక్సర్.. లేదంటే బౌండరీ అనేలా స్టేడియం పరుగుల జడివానలో తడిసి ముద్దయింది. టోర్నీలో భాగంగా సౌత్ గ్రూప్‌లో ఉన్న సర్రీ, మిడిలెసెక్స్ మధ్య మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యాయి.. సర్రీ జట్టు విధించిన 253 పరుగుల భారీ టార్గెట్‌ను మిడిలెసెక్స్ ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే చేధించడం విశేషం. ఇరుజట్లలో ఎవరు సెంచరీలు చేయకపోయినప్పటికి సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డారు. మ్యాచ్‌లో మొత్తంగా 52 బౌండరీలు, 24 సిక్సర్లు నమోదయ్యాయి. టి20 బ్లాస్ట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన తొలి జట్టుగా మిడిలెసెక్స్ చరిత్ర సృష్టించగా.. ఓవరాల్‌గా టి20 చరిత్రలో ఇది రెండో అత్యధిక లక్ష్య చేధన కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన సర్రీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 252 పరుగుల భారీ స్కోరు చేసింది. విల్ జాక్స్ (45 బంతుల్లో 96 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు) నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. లారి ఎవన్స్ (37 బంతుల్లో 85 పరుగులు, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరు మినహా మిగతావారి నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు రాలేదు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. వచ్చినోళ్లు వచ్చినట్లు కసితీరా బాదారు. తొలుత ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజి(39 బంతుల్లో 73 పరుగులు, 13 ఫోర్లు, ఒక సిక్సర్), జో క్రాక్నెల్(16 బంతుల్లో 36 పరుగులు, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ హోల్డన్(35 బంతుల్లో 68 నాటౌట్, 9 ఫోర్లు, 2 సిక్సర్లు), రియాన్ హిగ్గిన్స్(24 బంతుల్లో 48 పరుగులు) విధ్వంసం సృష్టించగా.. ఆఖర్లో జాక్ డేవిస్ 3 బంతుల్లో 11 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. Utterly extraordinary 😲@Middlesex_CCC had lost their previous 14 Blast matches and have just chased down 253 🤯#Blast23 pic.twitter.com/NxeweZyKOh — Vitality Blast (@VitalityBlast) June 22, 2023 చదవండి: 'గిల్ క్యాచ్' పునరావృతం.. ఈసారి అన్యాయమే గెలిచింది! -
సామ్ కర్రాన్ ఊచకోత.. కేవలం 18 బంతుల్లోనే సరి కొత్త చరిత్ర!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ సామ్ కర్రాన్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. ఈ టోర్నీలో సర్రే క్లికెట్ క్లబ్‌కు సామ్ కర్రాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో లండన్‌లోని ఓవల్ మైదానంలో , గ్లామోర్గాన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కర్రాన్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు బౌలర్లను కర్రాన్ ఊచకోత కోశాడు. కర్రాన్ కేవలం 18 బంతుల్లోనే 6 భారీ సిక్సర్లు, 3 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో టీ20 బ్లాస్ట్‌లో సర్రే తరపున వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును సామ్ కర్రాన్ తన పేరిట లిఖించకున్నాడు. ఓవరాల్ ఈ మ్యాచ్‌లో 22 బంతులు ఎదుర్కొన్న సామ్.. 59 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు ఓపెనర్లు విల్ జాక్స్(69), ఏవెన్స్(40) పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో సర్రే..238 పరుగుల రికార్డు స్కోర్ సాధించింది. అనంతరం 239 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గ్లామోర్గాన్ 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు మాత్రమే చేసింది. గ్లామోర్గాన్ బ్యాటర్లలో క్రిస్ కోక్(49) మినహా మిగితా ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. సర్రే బౌలర్లలో క్రిస్ జోర్డాన్ నాలుగు వికెట్లు, నరైన్ రెండు వికెట్లు సాధించాడు. చదవండి: అలా అయితే వేలంలో నన్నెవరూ కొనుగోలు చేయరు.. అయినా సిగ్గెందుకు?: ధోని Sam Curran was in electric form with the bat last night ⚡️ His 59 from 22 helped Surrey to their third-highest T20 total ever - 238/5!#Blast23 pic.twitter.com/ymYCoQRux3 — Vitality Blast (@VitalityBlast) June 21, 2023 -
కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు
కౌంటీ క్రికెట్ క్లబ్ సర్రే జట్టు చరిత్ర సృష్టించింది. కౌంటీ చరిత్రలో రెండో అత్యధిక పరుగుల టార్గెట్‌ను(501 పరుగలు)చేధించిన సర్రే జట్టు ఔరా అనిపించింది. కౌంటీల్లో 1925 తర్వాత ఒక జట్టు 500కు పైగా పరుగుల లక్ష్యాన్ని చేధించడం ఇది రెండోసారి. ఇంతకముందు ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా నాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిలెసెక్స్ 502 పరుగుల టార్గెట్‌ను చేధించింది. అప్పట్లో పాస్టీ హెండ్రెన్ 206 పరగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. మళ్లీ 98 ఏళ్ల తర్వాత 500 పరుగుల టార్గెట్‌ను అందుకున్న జట్టుగా సర్రే చరిత్రకెక్కింది. విషయంలోకి వెళితే.. కెంట్ విధించిన 501 పరుగుల భారీ టార్గెట్‌ను సర్రే జట్టు ఐదు వికెట్లు కోల్పోయి చేధించింది. ఐదోరోజు ఆట మొదలయ్యే సమయానికి సర్రే విజయానికి 238 పరుగులు అవసరం కాగా.. కెంట్కు ఏడు వికెట్లు కావాలి. జేమీ స్మిత్ 77 బంత్లులో 114 పరుగులు చేసి ఔటయ్యాడు. క్రీజులో డామ్ సిబ్లే, బెన్ ఫోక్స్ ఉన్నారు. ఈ ఇద్దరు కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బెన్ ఫోక్స్(211 బంతుల్లో 124 పరుగులు, 15 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔట్ కాగా.. రెండురోజులు ఎంతో ఓపికతో ఆడిన డోమ్ సిబ్లే(511 నిమిషాల పాటు) 415 బంతుల్లో 140 పరుగులు నాటౌట్ అసమాన ఇన్నింగ్స్ ఆడి సర్రేకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. చివర్లో జోర్డాన్ క్లాక్ 26 నాటౌట్ అతనికి సహకరించాడు. ఇక అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల లక్ష్య చేధన 418గా ఉంది. 2003లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ ఏడు వికెట్లు కోల్పోయి 418 పరగుల టార్గెట్‌ను అందుకుంది. ఆ తర్వాత రెండో స్థానంలో సౌతాఫ్రికా ఉంది. 2008లో ఆస్ట్రేలియా విధించిన 414 పరుగుల టార్గెట్‌ను ప్రొటిస్ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. మూడో స్థానంలో టీమిండియా ఉంది. 1976లో వెస్టిండీస్ విధించిన 403 పరుగుల టార్గెట్‌ను టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. What an effort by Dom Sibley 👏 Sibs finishes 140 not out after batting for 146.1 overs 🤩 So good to have you home 🏡 🤎 | #SurreyCricket https://t.co/iJKxxiQJOt pic.twitter.com/5Wn4Fa7okE — Surrey Cricket (@surreycricket) June 14, 2023 An incredible day 📷 🤎 | #SurreyCricket pic.twitter.com/jYWh9ho31l — Surrey Cricket (@surreycricket) June 14, 2023 చదవండి: రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్ ఎవరు?.. గూగుల్ AI ఊహించని పేర్లు -
రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్
Hashim Amla: సౌతాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హషీం ఆమ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఇవాళ (జనవరి 18) ప్రకటించాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమ్లా.. తాజాగా మిగతా ఫార్మాట్ల నుంచి కూడా తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఇంగ్లండ్ కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతున్న ఆమ్లా.. ఈ ఏడాది (2023) కౌంటీ సీజన్ బరిలోకి దిగేది లేదని స్పష్టం చేశాడు. గతేడాది కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో లాంకషైర్‌తో తన చివరి మ్యాచ్ ఆడేసిన ఆమ్లా.. ఆ సీజన్లో దాదాపు 40 సగటున 700కు పైగా పరుగులు చేసి తన జట్టును (సర్రే) ఛాంపియన్‌గా నిలిపాడు. రిటైర్మెంట్ ప్రకటనలో ఆమ్లా.. సర్రే టీమ్ స్టాఫ్ మొత్తానికి కృతజ్ఞతలు తెలిపాడు. ముఖ్యంగా సర్రే డైరెక్టర్ అలెక్ స్టివర్ట్ పేరును ప్రస్తావిస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న ఆమ్లా.. 24 ఏళ్ల కెరీర్లో ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు . అంతర్జాతీయ క్రికెట్లో 55 సెంచరీల సాయంతో 18000కు పైగా పరుగులు చేసిన ఆమ్లా.. వన్డేల్లో వేగంగా 2000, 3000, 4000, 5000, 6000, 7000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. సౌతాఫ్రికా టెస్ట్ టీమ్ కెప్టెన్‌గానూ వ్యవహరించిన ఆమ్లా.. వన్డేల్లో అత్యంత వేగంగా 10, 15, 16, 17, 18, 20, 25, 27 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆమ్లా ఖాతాలో టెస్ట్‌ల్లో ట్రిపుల్ హండ్రెడ్ (311 నాటౌట్)తో పాటు ఐపీఎల్‌లోనూ 2 సెంచరీలు ఉన్నాయి. -
చెలరేగిన అశ్విన్.. 69 పరుగులకే ప్రత్యర్ధి ఆలౌట్
లండన్: ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2021 ఫైనల్లో తేలిపోయిన టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఇంగ్లండ్ గడ్డపై సత్తాచాటాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్లో సర్రే తరఫున ఆడుతున్న అశ్విన్ ఒకే ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లు వేసిన యాష్.. 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి నడ్డి విరిచాడు. అశ్విన్‌కి మరో స్పిన్నర్ డేనియల్ మోరియార్టీ (4 వికెట్లు) తోడవ్వడంతో సోమర్సెట్ 69 పరుగులకే కుప్పకూలింది. అశ్విన్ ధాటికి ముగ్గురు బ్యాట్స్‌మన్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించగా, జె హిల్డ్రెత్ (14) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే, జులై 11న (ఆదివారం) మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సోమర్సెట్, తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. హిల్డ్రెత్(107) శతకానికి మరో అయిదుగురు ఆటగాళ్లు 40లు సాధించడంతో సోమర్సెట్ తొలి ఇన్నింగ్స్‌లో 429 పరుగులకు ఆలౌటైంది. సర్రే బౌలర్లు జోర్డాన్ క్లార్క్, అమర్ విర్ధి చెరో 3 వికెట్లు పడగొట్టగా, డేనియల్ మోరియార్టీ 2, అశ్విన్, ఆర్ క్లార్క్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సర్రే జట్టులో ఓపెనర్లు రోరీ బర్న్స్(50), స్టోన్మెన్(67) మాత్రమే రాణించడంతో కేవలం 240 పరుగులకే ఆలౌటైంది. సోమర్సెట్ బౌలర్లు జాక్ లీచ్ 6, వాన్ డెర్ మెర్వే 4 వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సోమర్సెట్కు స్పిన్నర్లు అశ్విన్(6), మోరియార్టీ(4) చుక్కలు చూపించారు. వీరి ధాటికి సోమర్సెట్ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం 259 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్రే జట్టు కడపటి వార్తలందేసరికి 3 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. క్రీజ్‌లో హషీమ్ ఆమ్లా(24), జేమీ స్మిత్(26) ఉన్నారు. సర్రే గెలుపునకు మరో 178 పరుగుల అవసరం ఉంది. కాగా, ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ముగిశాక టీమిండియా ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరకడంతో వారంతా కుటుంబాలతో కలిసి విహార యాత్రలో ఉన్నారు. అశ్విన్‌కు మాత్రం అనుకోకుండా కౌంటీ జట్టు సర్రే నుంచి ఆహ్వానం అందిండంతో ఆయన వెంటనే జట్టుతో చేరాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ముందు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. -
టీమిండియా స్పిన్నర్ అరుదైన ఘనత.. 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలా..
లండన్: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. 11 ఏళ్ల తర్వాత కౌంటీ క్రికెట్లో తొలి ఓవర్ వేసిన స్పిన్నర్‌గా రికార్డు నెలకొల్పాడు. 2010లో న్యూజిలాండ్ స్పిన్నర్ జీతన్ పటేల్ ఆరంభ ఓవర్ వేయగా.. మళ్లీ ఇన్నాళ్లకు అశ్విన్ ఇన్నింగ్స్ తొలి బంతిని వేశాడు. ఆదివారం సోమర్‌సెట్‌తో జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే తరఫున బరిలోకి దిగిన అశ్విన్.. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేశాడు. పిచ్ మందకొడిగా ఉండటంతో సర్రే కెప్టెన్ రోరీ బర్న్స్ కొత్త బంతిని అశ్విన్‌కు అప్పజెప్పాడు. తొలిరోజు 28 ఓవర్లు వేసిన అశ్విన్.. 70 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఎక్కువగా వైవిధ్యం ప్రదర్శించలేదు. పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని ఒకే ప్రాంతంలో నిలకడగా బంతులు విసిరి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చాడు. మ్యాచ్ సాగుతున్న కొద్ది బంతి ఎక్కువగా టర్న్ కాకపోవడంతో అశ్విన్ తెలివిగా బౌలింగ్ చేశాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి సోమర్సెట్ 98 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 280 పరుగులు స్కోర్ చేసింది. ఇదిలా ఉంటే, టీమిండియా ఇదే మైదానంలో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు ఆడనుంది. కాగా, ప్రస్తుతం టీమిండియా సభ్యులకు విరామం దొరకడంతో ఇంగ్లండ్ పరిసరాల్లో కుటుంబ సభ్యులతో పాటు పర్యటిస్తున్నారు. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ముగిశాక భారత ఆటగాళ్లకు మూడు వారాల విరామం దొరికింది. ఈ మధ్యలో యాష్‌కు అనుకోకుండా సర్రే జట్టు నుంచి ఆహ్వానం అందింది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు ఈ కౌంటీ మ్యాచ్ ద్వారా మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన యాష్.. వెంటనే సర్రే జట్టు ఆహ్వానాన్ని అంగీకరించాడు. కాగా, యాష్‌కు గతంలో నాటింగ్హమ్షైర్, వొర్సెస్టర్‌షైర్ కౌంటీలకు ఆడిన అనుభవం ఉంది. -
278 బంతుల్లో 37 నాటౌట్.. బౌలర్లకు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా లెజెండ్
లండన్: టీమిండియా మాజీ కెప్టెన్, ద వాల్ రాహుల్ ద్రవిడ్ డిఫెన్స్‌కు పెట్టింది పేరు. అతని తర్వాత ఆ స్థానాన్ని టీమిండియా నయా వాల్ చతేశ్వర్ పుజారా ఆక్రమించాడు. అయితే వీరిద్దరి డిఫెన్స్‌ను తలదన్నేలా, ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ హాషీమ్ ఆమ్లా. వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాక కౌంటీ క్రికెట్లో సర్రే జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సౌథాంప్టన్ వేదికగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 278 బంతులను ఎదుర్కొన ఆమ్లా.. 37 పరుగులతో అజేయంగా నిలిచి డిఫెన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యర్థి జట్టుకు రుచి చూపించాడు. ఈ క్రమంలో బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్‌ను గుర్తుకు తెచ్చాడు. ఆమ్లా డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌తో సర్రే జట్టు ఓటమి నుంచి బయటపడింది. Hashim Amla has played one of the great first-class innings - 37* off 278!balls to secure a draw for Surrey against Hampshire. An epic performance. pic.twitter.com/QfBF388UDl — Derek Alberts (@derekalberts1) July 7, 2021 ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగులు చేసింది. కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 213 బంతుల్లో 174 పరుగులు చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో సర్రే కేవలం 72 పరుగులకే ఆలౌటైంది. ఇందులో హషీమ్ ఆమ్లా చేసిన 29 పరుగులే అత్యధికం. దీంతో ఫాలో ఆన్ ఆడిన సర్రే.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కష్టాల్లో పడింది. ఆఖరి రోజు 6/2తో ఆట ఆరంభించిన ఆ జట్టు మరో 3 పరుగులకే మూడో వికెట్ కోల్పోయింది. నాలుగో స్థానంలో దిగిన ఆమ్లా తన క్లాస్ ఆటతీరుతో జట్టును ఆదుకున్నాడు. ఆఖరి రోజంతా క్రీజులో నిలబడ్డ ఆయన.. బౌన్సర్లు, యార్కర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ క్రికెట్లోని క్లాస్‌ను ప్రత్యర్ధులకు రుచి చూపించాడు. Hashim Amla batting on 5 runs in 114 deliveries for Surrey. Pujara bhai Wada Wau Wau moment for England series loading. — Silly Point (@FarziCricketer) July 7, 2021 తొలి 100 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన ఆమ్లా.. హాంప్‌షైర్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. ఎంత కఠినంగా బంతులేసినా.. ఊరించినా అస్సలు వికెట్ చేజార్చుకోలేదు. తాను ఆడిన 125వ బంతికి తొలి బౌండరీ కొట్టిన ఈ మిస్టర్ డిఫెన్స్.. 13.31 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మరో పక్క వికెట్లు పడుతున్నా.. ఆమ్లా క్రీజులో నిలవడంతో సర్రే మ్యాచ్ ముగిసే సమయానికి 122/8తో నిలిచింది. దీంతో ఆ జట్టు మ్యాచ్‌ను డ్రా చేసుకోగలిగింది. ఈ క్రమంలో ఆమ్లా ఓ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ రికార్డును తిరగరాశాడు. 40లోపు పరుగులు(37*) సాధించేందుకు అత్యధిక బంతులను(278) ఎదుర్కొన్న క్రికెటర్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. ఆమ్లా ఆడిన ఈ మాస్టర్ క్లాస్ డిఫెన్సివ్ ఇన్నింగ్స్‌పై నెట్టింట జోకులు పేలుతున్నాయి. నయా వాల్ చతేశ్వర్ పుజారా మాదిరిగా ఆమ్లా కూడా జట్టును రక్షించాడని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. Most balls faced in a first-class innings of less than 40: 278 HM Amla (37*) Surrey v Hampshire Southampton 2021 277 TE Bailey (38) England v Australia Leeds 1953 (where balls faced are known) — Andrew Samson (@AWSStats) July 7, 2021 -
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు టీమిండియా స్పిన్నర్‌కు లక్కీ ఛాన్స్..
లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ గొప్ప అవకాశం దొరికింది. జులై 11న సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడే లక్కీ ఛాన్స్ లభించింది. దీంతో ప్రతిష్ఠాత్మక సిరీస్‌కు ముందు యాష్‌కు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికినట్లవుతుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఓటమి తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్‌ల గురించి ప్రశ్నించిన నేపథ్యంలో యాష్‌కు సరైన సమయంలో సరైన అవకాశం లభించినట్టైంది. కాగా, అశ్విన్‌కు గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్హమ్షైర్, వొర్సెస్టర్‌షైర్‌కు ఆడిన అనుభవం ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా విరామంలో ఉన్నారు. వారితో పాటే అశ్విన్ సైతం కుటుంబంతో కలిసి బ్రిటన్‌లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అన్నీ సవ్యంగా సాగితే జులై 11న అతడు సర్రే తరఫున బరిలోకి దిగుతాడు. ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సర్రే.. సోమర్సెట్ను ఢీకొంటుంది. ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ఆడనుంది. ఈ రకంగా కూడా యాష్ కౌంటీ మ్యాచ్ ఆడటం టీమిండియాకు కలిసొచ్చే అంశమే. మరోవైపు సర్రే యాజమాన్యం సైతం యాష్పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. -
ఆర్చర్ బనానా ఇన్‌స్వింగర్.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్
లండన్: ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్‌కు 2021 ఏడాది అంతగా కలిసిరాలేదు. జనవరి నుంచి వరుసగా గాయాల బారిన పడుతూ జట్టులోకి రావడం... పోవడం చేస్తున్నాడు. టీమిండియాతో జరిగిన టెస్టు, టీ20 సిరీస్‌లో ఆడిన ఆర్చర్ మోచేతి గాయంతో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఆర్చర్‌కు శస్త్ర చికిత్స అవసరం పడడంతో స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ 14వ సీజన్‌కు కూడా దూరమయ్యాడు. తాజాగా సర్జరీ అనంతరం ప్రాక్టీస్ ఆరంభించిన ఆర్చర్ ఇంగ్లీష్ కౌంటీల్లో ఆడుతూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సెకండ్ ఎలెవెన్ చాంపియన్‌షిప్ ఆడుతున్న ఆర్చర్ ససెక్స్ సెకండ్ ఎలెవెన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా సర్రీ సెకండ్ ఎలెవెన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్చర్ అద్బుత బౌలింగ్‌తో మెరిశాడు. క్రికెట్లో అరుదుగా కనిపించే బనానా ఇన్‌స్వింగర్ వేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను బోల్తా కొట్టించి అతను వికెట్ తీయగా.. బ్యాటింగ్ చేస్తున్న ఎన్ఎమ్జే రీఫిర్ నోరెళ్లబెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోనూ సెసెక్స్ క్రికెట్ తన ట్విటర్లో షేర్ చేసింది. '' ఆర్చర్ ఈజ్ బ్యాక్.. నాట్ ఏ బ్యాడ్ డెలివరీ..'' అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జతచేసింది. ఇక బనానా డెలివరీ అంటే బౌలర్ బంతిని విడుదల చేయగానే కాస్త ఎత్తులో వెళుతూ సీ షేప్‌గా మారుతుంది. అది పిచ్ మీద పడగానే ఇన్‌స్వింగ్ లేదా ఔట్ స్వింగ్ అయి యార్కర్‌లా మారుతుంది. ఒకవేళ ఆ బంతిని బ్యాట్స్‌మన్ వదిలేస్తే బౌల్డ్.. లేకపోతే ఎల్బీగా వెనుదిరగడం ఖాయం. ఇక బనానా ఇన్‌స్వింగర్ అంటే మనకు గుర్తుచ్చేది టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. రివర్స్ స్వింగ్ రాబట్టడంలో మంచి పేరున్న పఠాన్ బనానా డెలివరీలు వేయడంలోనూ తన ప్రత్యేకతను చూపించాడు. చదవండి: Jofra Archer: ఫుల్ రిథమ్‌లో జోఫ్రా ఆర్చర్ Not a bad delivery! 😅 Two wickets for @JofraArcher against Surrey's second XI yesterday, including this one... ☄️ pic.twitter.com/vBc5s09l4B — Sussex Cricket (@SussexCCC) May 7, 2021 -
25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు..
దుబాయ్: ఇంగ్లండ్ యువ క్రికెటర్ విల్ జాక్స్ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన టీ10 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన జాక్స్ కేవలం 25 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఎనిమిది ఫోర్లు, పదకొండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. ఈ క్రమంలోనే ఒక ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. టీ10 మ్యాచ్‌లో భాగంగా సర్రే జట్టుకు ఆడుతున్న జాక్స్.. లాంక్షైర్ జట్టు బౌలర్లపై బ్యాట్‌తో విరుచుకుపడ్డాడు. ఆది నుంచి బౌండరీలే లక్ష్యంగా చెలరేగిన జాక్స్ పరుగుల వరద పారించాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ 5వ ఓవర్ ఆరంభానికి ముందు వ్యక్తిగత స్కోరు 62 వద్ద ఉన్న ఈ హిట్టర్.. ఆ ఓవర్ ముగిసే సమయానికి 98 పరుగులతో నిలిచాడు.కేవలం 14 బంతుల్లోనే అర్ధశతకం మైలురాయిని అందుకున్న జాక్స్.. ఆ తర్వాత 25 బంతుల్లో శతకం మార్క్‌ని చేరుకోవడం విశేషం. 30 బంతుల్లో 105 పరుగులు చేసిన అనంతరం జాక్స్ ఔటయ్యాడు. జాన్స్ జోరుతో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రే జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నస్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యఛేదనలో తడబడిన లాన్‌షైర్ 9.3 ఓవర్లలోనే 81 పరుగులకి ఆలౌటైంది. ఫలితంగా సర్రే జట్టు 95 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఇటీవల తిరువనంతపురం వేదికగా భారత్-ఎ జట్టుతో తలపడిన ఇంగ్లండ్ లయన్స్ జట్టులో జాక్స్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. -
ఫించ్ పిచ్చకొట్టుడు!
లండన్ : ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెచ్చిపోయాడు. ఒక పరుగు వద్ద లభించిన లైఫ్‌తో విధ్వంసం సృష్టించాడు. 79 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లతో 131 పరుగులు బాది రికార్డు సృష్టించాడు. ఇంగ్లీష్ బ్లాస్ట్ టీ20 టోర్నీలో భాగంగా సర్రే జట్టు తరపున బరిలోకి దిగిన ఫించ్.. సస్సెక్స్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. దీంతో సర్రే జట్టు 52 పరుగుల తేడాతో సస్సెక్స్‌పై విజయం సాధించింది. ఫించ్ తొలి పరుగు వద్దనే జోఫ్రా ఆర్చర్‌కు రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. అతను నేలపాలు చేశాడు. ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకున్న ఫించ్ సెంచరీతో చెలరేగాడు. ఇది సర్రె జట్టు బ్యాట్స్‌మన్‌గా అత్యధిక స్కోర్ కాగా.. ఫించ్‌కు టీ20ల్లో ఐదో టీ20 సెంచరీ. దీంతో సర్రే జట్టు మూడు వికెట్లు కోల్పోయి 192 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్య చేధనలో సస్సెక్స్ జట్టు తడబడింది. 18వ ఓవర్లోనే 140 పరుగుల వద్ద చాపచుట్టేసింది. ఇక వరల్డ్ నెం1 బౌలర్ అఫ్గాన్ సంచలనం రషీద్‌ఖాన్ బౌలింగ్‌ను సైతం ఫించ్ చీల్చిచిండాడడు. ఈ దెబ్బకు రషీద్ 40 పరుగులు సమర్పించుకున్నాడు. -
‘ప్రత్యేక హోదా’ లేదు
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్, ప్రపంచ అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్, ఐపీఎల్లో అత్యధిక పారితో షికం అందుకుంటున్న విరాట్ కోహ్లి... ఇంగ్లండ్ కౌంటీ జట్టు సర్రేకు మాత్రం సాధారణ మ్యాచ్ ఫీజుతోనే ఆడనున్నాడు. దీంతోపాటు అతడి విమాన ప్రయాణ, వసతి ఖర్చులను మాత్రమే సర్రే చెల్లించనుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తాజాగా తెలిపారు. అసలు కాంట్రాక్టు మొత్తం వెల్లడించలేమన్న ఆయన... సగటు కౌంటీ ఆటగాడికి ఎంత చెల్లిస్తున్నారో అంతే ఉంటుందని వివరించారు. భారత్ జూన్ నుంచి ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. 2014లో అక్కడ ఎదురైన చేదు అనుభవాలను చెరిపివేయాలని గట్టి పట్టుదలతో ఉన్న కోహ్లి, మ్యాచ్ ఫీజు విషయాన్ని తేలిగ్గా తీసుకుంటున్నాడు. మరోవైపు విరాట్–సర్రే ఒప్పందం మార్చిలోనే వెల్లడైనా అతడి ఆకర్షణ స్థాయిని కౌంటీ జట్టు వాణిజ్య కోణంలో ఉపయోగించుకుంటుందని బీసీసీఐ అనుమానించింది. దీంతో ఒప్పందం ఆచరణలోకి రావడానికి సమయం పట్టింది. ఇక కౌంటీల్లో కోహ్లి మొత్తం ఆరు మ్యాచ్‌లు (మూడు 50 ఓవర్ల మ్యాచ్‌లు, మూడు నాలుగు రోజుల మ్యాచ్‌లు) ఆడనున్నాడు. -
వయసు 39.. సెంచరీలు 100
లీడ్స్: శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర విజృంభణ కొనసాగుతోంది. ఇంగ్లీష్ కౌంటీల్లో ఇరగదిస్తున్నాడు. వరుస శతకాలతో మోత మోగిస్తున్నాడు. ఈ క్రమంలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కెరీర్లో వందో శతకం పూర్తి చేశాడు. ఇంగ్లీష్ కౌంటీల్లో భాగంగా సర్రే టీమ్ తరపున ఆడుతున్న సంగక్కర అన్ని ఫార్మాట్లలో కలిపి 45,529 పరుగులు సాధించాడు. కౌంటీ చాంపియన్ షిప్లో భాగంగా మంగళవారం యార్క్‌షైర్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో తన జట్టుకు విజయాన్ని అందించాడు. 121 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన సర్రే టీమ్ 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 313 పరుగులు చేసింది. యార్క్‌షైర్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 289 పరుగులు సాధించింది. 39 ఏళ్ల సంగక్కర రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. దేశవాళీ క్రికెట్ నుంచి కూడా త్వరలో తప్పుకోనున్నట్టు ఇటీవల ప్రకటించాడు. మరో నాలుగు నెలలు మాత్రమే క్రికెట్ ఆడతానని వెల్లడించాడు. వయసు మీదపడుతున్న అతడి బ్యాటింగ్ పదును తగ్గలేదు. కౌంటీ చాంపియన్ షిప్లో సర్రే టీమ్ తరపున రు సెంచరీలు సాధించడమే ఇందుకు తాజా రుజువు. కెరీర్లో సంగక్కర సాధించిన వంద శతకాల్లో 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలుండగా, 39 లిస్ట్-ఎ సెంచరీలున్నాయి. కెరీర్ ముగించేలోపు మైదానంలో అతడు మరిన్ని రికార్డులు సాధించడం ఖాయం.