లండన్: ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు ముందు టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఓ గొప్ప అవకాశం దొరికింది. జులై 11న సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడే లక్కీ ఛాన్స్ లభించింది. దీంతో ప్రతిష్ఠాత్మక సిరీస్‌కు ముందు యాష్‌కు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికినట్లవుతుంది. ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఓటమి తర్వాత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్‌ల గురించి ప్రశ్నించిన నేపథ్యంలో యాష్‌కు సరైన సమయంలో సరైన అవకాశం లభించినట్టైంది. కాగా, అశ్విన్‌కు గతంలో కౌంటీ క్రికెట్లో నాటింగ్హమ్‌షైర్, వొర్సెస్టర్‌షైర్‌కు ఆడిన అనుభవం ఉంది.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లంతా విరామంలో ఉన్నారు. వారితో పాటే అశ్విన్ సైతం కుటుంబంతో కలిసి బ్రిటన్‌లో పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అన్నీ సవ్యంగా సాగితే జులై 11న అతడు సర్రే తరఫున బరిలోకి దిగుతాడు. ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో సర్రే.. సోమర్సెట్‌ను ఢీకొంటుంది. ఇదే మైదానంలో టీమిండియా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ ఆడనుంది. ఈ రకంగా కూడా యాష్ కౌంటీ మ్యాచ్ ఆడటం టీమిండియాకు కలిసొచ్చే అంశమే. మరోవైపు సర్రే యాజమాన్యం సైతం యాష్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment