
India Tour Of England 2022: టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ కోవిడ్ బారిన పడటంతో ఈ నెల 16న టీమిండియా సభ్యులతో పాటు ఇంగ్లండ్‌కు బయల్దేరని విషయం తెలిసిందే. అయితే తాజాగా అశ్విన్‌కు కోవిడ్ నెగిటివ్ రిపోర్టు రావడంతో ఇంగ్లండ్‌తో టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు లండన్‌కు బయల్దేరనున్నాడని సమాచారం. అతను ఇవాళే లండన్ ఫ్లైట్ ఎక్కనున్నాడని బీసీసీఐ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు.
హోం ఐసోలేషన్‌లో ఉన్న అశ్విన్‌కు ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగిటివ్ వచ్చిందని, అతనికి ఇంగ్లండ్ వెళ్లాక మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తారని, ఆతర్వాతే అతను టీమిండియాతో కలుస్తాడని ఆయన పేర్కొన్నారు. అయితే అశ్విన్ ఈ నెల 24 నుంచి లీసెస్టర్‌షైర్‌తో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో పాల్గొనే అవకాశం మాత్రం లేదని ఆయన వివరించారు. కాగా, ఐపీఎల్ ముగిశాక తమిళనాడు క్రికెట్ సంఘం నిర్వహించిన స్థానిక లీగ్‌లో పాల్గొన్న సందర్భంగా అశ్విన్ కోవిడ్ బారిన పడ్డాడు.
చదవండి: ఇంగ్లండ్‌కు బయల్దేరనున్న సుందర్.. గాయం నుంచి కోలుకోని చాహర్