టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారిన పడ్డాడు. అశ్విన్ ప్రస్తుతం హోం ఐషోలేషన్‌లో ఉన్నాడు. తద్వారా ఇంగ్లండ్‌తో ఏకైక టెస్టు కోసం భారత జట్టుతో కలిసి అశ్విన్ వెళ్లలేదు. జూన్ 16న భారత జట్టు ఇంగ్లండ్‌కు పయనమైంది. అయితే త్వరలోనే అశ్విన్ క్వారంటైన్ ముగియనుందని, కరోనా తగ్గిన తర్వాత మాత్రమే అతడు జట్టులోకి చేరుతాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి."లండన్‌కు బయలుదేరే ముందు అశ్విన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది.
దీంతో అతడు జట్టుతో కలిసి వెళ్లలేదు. జూలై 1వ తేదీన టెస్ట్ మ్యాచ్ ప్రారంభం అయ్యే లోపపు అశ్విన్ కోలుకుంటాడని మేము ఆశిస్తున్నాము. అయితే అతడు లీసెస్టర్‌షైర్‌తోజరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చు" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇక లీసెస్టర్‌షైర్ చేరుకున్న భారత్.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఆధ్వర్యంలో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. ఇక భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, ఆటగాళ్లు రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ త్వరలోనే జట్టులో చేరున్నారు.
చదవండి: ENG vs IND: ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక టెస్టు.. చెమటోడుస్తున్న టీమిండియా.. ఫోటోలు వైరల్!
Comments
Please login to add a commentAdd a comment