PAK Vs WI ODI: Shai Hope Becomes 3rd Fastest To Score 4 000 Runs In ODIs - Sakshi
Sakshi News home page

PAK vs WI: వెస్టిండీస్‌ ఓపెనర్‌ వన్డేల్లో అరుదైన ఫీట్‌.. మూడో ఆటగాడిగా..!

Published Fri, Jun 10 2022 4:34 PM | Last Updated on Sat, Jun 11 2022 9:39 AM

Shai Hope Becomes 3rd Fastest to Score 4 000 Runs in ODIs - Sakshi

వెస్టిండీస్‌ ఓపెనర్‌ షాయ్ హోప్ వన్డేల్లో అరుదైన ఘనత సాధించాడు. విండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌తో కలిసి వన్డేల్లో అత్యంత వేగంగా 4000 పరుగులు చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. రిచర్డ్స్‌ 88 ఇన్నింగ్స్‌లలో ఈ మైలు రాయిని అందుకోగా.. హోప్ కూడా 88 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన హోప్‌(127) ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

2016 విండీస్‌ తరపున అరంగేట్రం చేసిన హోప్‌.. ఇప్పటి వరకు 88 ఇన్నింగ్స్‌లలో 4026 పరుగులు సాధించాడు. ఇక దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా ఈ ఘనతను 81 ఇన్నింగ్స్‌లలో సాధించి తొలి స్థానంలో ఉండగా.. పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం 82 రెండు ఇన్నింగ్స్‌లలో సాధించి రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: గర్ల్‌ఫ్రెండ్‌ను దారుణ హత్య చేసిన ఫుట్‌బాలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement