సాక్షి, అనంతపురం: మిడిలార్డర్ ఆటగాడు శాశ్వత్ రావత్ (235 బంతుల్లో 122 బ్యాటింగ్; 15 ఫోర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో భారత్ ‘సి’జట్టుతో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’జట్టు 77 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది.
భారత్ ‘సి’జట్టు బౌలర్ల ధాటికి 36 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ‘ఎ’జట్టును శాశ్వత్ రావత్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ప్రథమ్ సింగ్ (6), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (6), హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ (5), రియాన్ పరాగ్ (2), కుమార్ కుషాగ్ర (0) విఫలమయ్యారు.
ఈ దశలో షమ్స్ ములానీ (76 బంతుల్లో 44; 5 ఫోర్లు, ఒక సిక్సర్)తో కలిసి శాశ్వత్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దులీప్ ట్రోఫీలో అటు బౌలింగ్‌లో ఇటు బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటున్న ఆల్‌రౌండర్ షమ్స్ ములానీ మరోసారి తన విలువ చాటుకున్నాడు. భారత్ ‘సి’జట్టు బౌలర్లలో అన్షుల్ కంబోజ్ 3, విజయ్ కుమార్ వైశాఖ్ రెండు వికెట్లు పడగొట్టారు.
గత మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తాచాటిన అన్షుల్... ఆరంభంలోనే పదునైన పేస్‌తో ప్రత్యర్థి టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. జట్టు స్కోరులో సింహభాగం పరుగులు చేసిన శాశ్వత్ అజేయంగా నిలవగా... అతడితో పాటు అవేశ్ ఖాన్ (16 బ్యాటింగ్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) క్రీజులో ఉన్నాడు.
స్కోరు వివరాలు
భారత్ ‘ఎ’తొలి ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (సి) సాయి సుదర్శన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; మయాంక్ అగర్వాల్ (సి) ఇషాన్ కిషన్ (బి) అన్షుల్ కంబోజ్ 6; తిలక్ వర్మ (రనౌట్) 5; రియాన్ పరాగ్ (సి) సాయి సుదర్శన్ (బి) విజయ్ కుమార్ వైశాఖ్ 2; శాశ్వత్ రావత్ (నాటౌట్) 122; కుమార్ కుషాగ్ర (సి) ఇషాన్ కిషన్ (బి) విజయ్ కుమార్ వైశాక్ 0; షమ్స్ ములానీ (సి) రజత్ పాటిదార్ (బి) గౌరవ్ యాదవ్ 44; తనుశ్ కొటియాన్ (సి) బాబా ఇంద్రజిత్ (బి) అన్షుల్ కంబోజ్ 10; అవేశ్ ఖాన్ (నాటౌట్) 16; ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: (77 ఓవర్లలో 7 వికెట్లకు) 224. వికెట్ల పతనం: 1–11; 2–14; 3–17; 4–35; 5–36; 6–123; 7–154, బౌలింగ్: అన్షుల్ కంబోజ్ 14–2–40–3; గౌరవ్ యాదవ్ 17–7–46–1; విజయ్‌కుమార్ వైశాఖ్ 15–1–33–2; పులి్కత్ నారంగ్ 21–0–58–0; మానవ్ సుతార్ 10–1–38–0.
Comments
Please login to add a commentAdd a comment