భారత కుర్రాళ్లు కుమ్మేశారు..
మకే(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాలో జరిగిన క్వాడ్రాంగులర్ క్రికెట్ సిరీస్ను భారత -ఎ జట్టు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ఆస్ట్రేలియాపై పైచేయి సాధించిన భారత కుర్రాళ్లు అటు బ్యాటింగ్లోనూ, ఇటు బౌలింగ్లోనూ రాణించి సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవ్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్ కరుణ్ నాయర్(1) ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, మరో ఓపెనర్ మన్ దీప్ సింగ్(95;108 బంతుల్లో 11 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఐయ్యర్(41), మనీష్ పాండే(61) ఆకట్టుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు నమోదు చేసింది. ఇక చివర్లో కేదర్ జాదవ్(25 నాటౌట్), అక్షర్ పటేల్(22నాటౌట్ ) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.
ఆపై బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 44.5 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.ఆసీస్ జట్టును భారత స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ చావు దెబ్బ తీశాడు. చాహల్ 8.5 ఓవర్లలో 34 పరుగుల ఇచ్చి నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. అతనికి జతగా కులకర్ణి, నాయర్, అక్షర్లు తలో రెండు వికెట్లు సాధించడంతో భారత ఘన విజయం సొంతం చేసుకుంది. భారత ఆటగాడు మన్ దీప్ సింగ్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.