Quadrangular series
-
పాకిస్థాన్ మొదలు పెడితే మరో రెండు దేశాలు అదే పాట పాడుతున్నాయి..!
భారత్, పాక్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాలను కలుపుకుని నాలుగు దేశాల టీ20 సిరీస్ నిర్వహించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) గత కొన్ని రోజులుగా ఐసీసీని విన్నవించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ విషయమై చర్చించేందుకు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (సీఈసీ) నిన్న (ఏప్రిల్ 8) దుబాయ్‌లో సమావేశమైంది. క్వాడ్రాంగ్యులర్ టీ20 సిరీస్‌ల విషయంలో పాక్ మొదలు పెట్టిన పాటను, ఈ సమావేశం వేదికగా మరో రెండు దేశాల బోర్డులు అందుకున్నాయి. పాక్ ప్రతిపాదించిన తరహాలోనే టీ20 సిరీస్‌లు నిర్వహించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ వెస్టిండీస్ (సీడబ్ల్యూఐ) ఐసీసీకి విజ్ఞప్తి చేశాయి. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సైతం ఆయా దేశాలు ఐసీసీ ముందుంచాయి. పీసీబీ ప్రతిపాదించిన టోర్నీ విషయమై చర్చిద్దామని సమావేశం ఏర్పాటు చేస్తే తాజాగా మరో రెండు దేశాల బోర్డులు అదే తరహా ప్రతిపాదనతో ముందుకు రావడంతో ఐసీసీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే, పీసీబీ చీఫ్ రమీజ్ రాజా ఆదివారం సాయంత్రం క్వాడ్రాంగ్యులర్ సిరీస్‌కు సంబంధించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను ఐసీసీ ముందుంచనున్నాడు. తమ ప్రతిపాదనతో ఆయా దేశాల క్రికెట్ బోర్డులకు భారీ ఆదాయం సమకూరడంతో పాటు ప్రేక్షకులకు సైతం అమితమైన వినోదం ఉంటుందని పీసీబీ ఐసీసీని కన్విన్స్ చేయనుందని సమాచారం. తటస్థ వేదికలపై ఈ సిరీస్ నిర్వహణకు అవకాశమివ్వాలని పీసీబీ ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది. చదవండి: భర్త ఐపీఎల్లో ఇరగదీస్తుంటే.. భార్య భారత్‌కు బంగారు పతకం సాధించి పెట్టింది..! -
భారత కుర్రాళ్లు కుమ్మేశారు..
మకే(ఆస్ట్రేలియా): ఆస్ట్రేలియాలో జరిగిన క్వాడ్రాంగులర్ క్రికెట్ సిరీస్‌ను భారత -ఎ జట్టు కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆద్యంతం ఆస్ట్రేలియాపై పైచేయి సాధించిన భారత కుర్రాళ్లు అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి సత్తా చాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవ్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్ కరుణ్ నాయర్(1) ఆదిలో పెవిలియన్ చేరినప్పటికీ, మరో ఓపెనర్ మన్ దీప్ సింగ్(95;108 బంతుల్లో 11 ఫోర్లు) రాణించాడు. అనంతరం ఐయ్యర్(41), మనీష్ పాండే(61) ఆకట్టుకున్నారు. ఈ జోడీ మూడో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు నమోదు చేసింది. ఇక చివర్లో కేదర్ జాదవ్(25 నాటౌట్), అక్షర్ పటేల్(22నాటౌట్ ) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది. ఆపై బ్యాటింగ్ దిగిన ఆస్ట్రేలియా-ఎ జట్టు 44.5 ఓవర్లలో 209 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.ఆసీస్ జట్టును భారత స్పిన్నర్ యుజ్వేందర్ చాహల్ చావు దెబ్బ తీశాడు. చాహల్ 8.5 ఓవర్లలో 34 పరుగుల ఇచ్చి నాలుగు కీలక వికెట్లను పడగొట్టాడు. అతనికి జతగా కులకర్ణి, నాయర్, అక్షర్‌లు తలో రెండు వికెట్లు సాధించడంతో భారత ఘన విజయం సొంతం చేసుకుంది. భారత ఆటగాడు మన్ దీప్ సింగ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.