వెస్టిండీస్-ఎతో అనధికారిక తొలిటెస్టులో భారత్-ఎ పోరాడుతోంది. 264/5 ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ రెండో రోజు గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 429 పరుగులకు ఆలౌటైంది. భారత యువ స్పిన్నర్ పర్వేజ్ రసూల్ (5/116) రాణించి టెయిలెండర్ల పనిపట్టాడు. కాగా ఫుడాడిన్ (86 నాటౌట్), మిల్లర్ (49) విండీస్ జట్టుకు భారీ స్కోరు అందించారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్-ఎ ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రాహుల్ 46 పరుగులు చేయగా, జీవన్జ్యోత్ సింగ్ (16), పుజారా (3) నిరాశపరిచారు. జునేజా (47 బ్యాటింగ్)తో పాటు ఖడివాలె (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత్-ఎ తొలిఇన్నింగ్స్లో ఇంకా 305 పరుగులు వెనకబడివుంది.
రాణించిన రసూల్, పోరాడుతున్న భారత్-ఎ
Published Thu, Sep 26 2013 7:04 PM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM
Advertisement