
రోహిత్ శర్మ సెంచరీ
మంగళవారం ఆప్ఘనిస్తాన్ ఇక్కడ జరిగే మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా అదరగొడుతోంది.
అడిలైడ్:వరల్డ్ కప్ సన్నాహక మ్యాచ్ ల్లో భాగంగా ఆప్ఘనిస్తాన్ తో ఇక్కడ మంగళవారం జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (4) పరుగులకే పెవిలియన్ కు చేరి అభిమానుల్ని నిరాశపరిచాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మ తనదైన శైలిలో మరోసారి ఆప్ఘన్ బౌలర్లపై విరుచుకుపడుతూ 9 ఫోర్లు, 4 సిక్సర్లతో (103 నాటౌట్) సెంచరీ చేశాడు.
మూడో వికెట్గా వచ్చిన విరాట్ కోహ్లి(5) ఈ మ్యాచ్లో కూడా ఆకట్టుకోలేకపోయాడు. టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా (75) అదరగొట్టాడు.33 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయిన టీమిండియా 190 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది.