బ్ల్యూటీసీ ఫైనల్ ఓటమి నేపథ్యంలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌ను బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలో జూలై 12న డొమినికా వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టుకు ముందు రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భారత జట్టును ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా బార్బడోస్ వేదికగా జరగనున్నట్లు సమాచారం.
కాగా ఈ టెస్టు సిరీస్ కోసం టీమిండియా వేర్వేరు బ్యాచ్‌లగా కరీబియన్ దీవులకు చేరుకోనుంది. జూలై 2న బ్రిడ్జ్‌టౌన్‌లో భారత ఆటగాళ్లు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. కాగా విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు ఇంకా లండన్‌లోనే గడుపుతున్నారు.
వీరిద్దరూ నేరుగా లండన్ నుంచి కరీబియన్ గడ్డపై అడుగుపెట్టనున్నారు. అనంతరం ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో భాగం కానున్నారు. అయితే క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఫస్ట్‌క్లాస్ క్రికెట్ హోదాలో జరగవు. కొంత మంది బార్బడోస్ స్ధానిక ఆటగాళ్లు భారత జట్టుతో కలవనున్నారు. అనంతరం రెండు జట్లగా విడిపోయి నాలుగు రోజుల ఇంట్రాస్వాడ్ మ్యాచ్‌లు భారత్ ఆడనుంది.
ఇక వెస్టిండీస్ విషయానికి వస్తే.. కరీబియన్ జట్టు ఆంటిగ్వాలోని హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో తమ ప్రాక్టీస్ క్యాంప్‌ను ఏర్పరుస్తుంది. తొలి టెస్టుకు ముందు విండీస్ జట్టు డొమినికాకు వెళ్లనున్నారు. ఇక కొంత మంది టెస్టు స్పెషలిస్ట్‌లు ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్స్ బీజీబీజీగా ఉన్నారు.
విండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: Suresh Raina: యూరప్‌లో భారత మాజీ క్రికెటర్ కొత్త బిజినెస్.. నోరూరించే రుచులతో..
Comments
Please login to add a commentAdd a comment