రోహిత్ శర్మ సారధ్యంలోని భారత జట్టు వచ్చె నెల(జూలై)లో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై 12న డొమెనికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్ ప్రారంభం కానుంది.
షెడ్యూల్ నో ఛేంజ్..
కాగా వెస్టిండీస్ జట్టు ప్రస్తుతం వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బీజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే క్వాలిఫయర్స్ ఆడుతున్న విండీస్ జట్టులో హోల్డర్, మైర్స్, జోసఫ్ వంటి టెస్టు స్పెషలిస్టులు ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ ఫైనల్ జూలై 9న జరగనుంది. ఈ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న విండీస్.. ఫైనల్‌కు చేరడం పెద్ద కష్టమేమి కాదు.
ఈ క్రమంలో జూలై 12న మొదలు కావాల్సిన టెస్టు సిరీస్ ఆలస్యం కానున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. "భారత్-విండీస్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు. క్రికెట్ వెస్టిండీస్ వారి సన్నాహకాలు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటోంది. అది విండీస్ క్రికెట్ పరిష్కరించుకుంటుంది.
షెడ్యూల్‌లో స్వల్ప మార్పు కూడా మొత్తం పర్యటనకు ఆటంకం కలిగిస్తుంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో పేర్కొన్నారు. కాగా వన్డే వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో విండీస్ జట్టు ఫైనల్‌కు చేరినప్పటికి.. ఆ జట్టు టెస్టు సభ్యులు మాత్రం ముందుగానే ప్రత్యేక విమానంలో నేరుగా జింబాబ్వే నుంచి డొమెనికా చేరుకోనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: IND vs IRE: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్.. టీమిండియా స్టార్ బౌలర్ రీ ఎంట్రీ!
Comments
Please login to add a commentAdd a comment