భారత్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొదలు కానుంది. ఇప్పటికే డొమినికాకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్ కాగా.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శన విండీస్‌కు కూడా ఇది మొదటి టెస్టు సిరీస్.
దీంతో ఇరు జట్లు కూడా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఊవ్విళ్లరుతున్నాయి. ఇక తొలి టెస్టు నేపథ్యంలో వెస్టిండీస్ మెంటార్ బ్రియాన్ లారా తమ జట్టుకు మద్దతుగా నిలిచాడు. జట్టులో కొంత మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వారికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉంది అని లారా అభిప్రాయపడ్డాడు.
"ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో భాగంగా ప్రారంభమయ్యే ఈ టెస్టు సిరీస్ మాకు చాలా కీలకం. టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకటి. వారికి తమ స్వదేశంలోనైనా, విదేశీ గడ్డలపైనా అయినా ప్రత్యర్ధిలకు మట్టి కరిపించే సత్తా ఉంది. అటువంటి టాప్ క్లాస్ టీమ్‌తో మేము తలబడబోతున్నాం. మేము అందుకు తగ్గట్టు సన్నద్దం అవుతున్నాము. మేము ఇప్పటికే ఒక ట్రైనింగ్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేశాం.
తొలి టెస్టుకు ఇంకా మాకు కేవలం మూడు రోజుల మాత్రమే ఉంది. క్రైగ్ బ్రాత్‌వైట్ నేతృత్వంలోని యువ జట్టు భారత్‌కు పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఈ సిరీస్‌లో కొంతమంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడానికి సిద్దంగా ఉన్నారు. భారత్ వంటి కఠిన జట్లతో ఆడితేనే మన టాలెంట్ ఎంటో బయటపడుతుందని లారా విలేకురల సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈ టీమిండియా సిరీస్‌తో కిర్క్ మెకెంజీ,అలిక్ అథానాజ్‌లు అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది.
టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు:
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్.
చదవండి: Ind Vs WI: ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment