brain lara
-
అతడొక వరల్డ్‌క్లాస్ బౌలర్.. చరిత్రలో నిలిచిపోతాడు: లారా
టీ20 వరల్డ్‌కప్-2024లో జోరు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు భారత్ అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు. బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్ అని లారా కొనియాడాడు. కాగా ఈ మెగా టోర్నీలో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 8 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌పై విజయంలో కూడా బుమ్రా కీలక పాత్ర పోషించాడు."జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. వరల్డ్ క్రికెట్లో ఇటువంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉండాలని ప్రతీఒక్కరూ కోరుకుంటున్నారు. మా జట్టులో కూడా బుమ్రా లాంటి పేస్ గుర్రం ఉంటే బాగుండేది అనిపిస్తోంది. అందుకే రెండు రోజుల క్రితం నేను సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశాను. బుమ్రా వెస్ట్రన్ ఈస్ట్‌లో ఉండి వెస్టిండీస్‌కు ప్రాతనిథ్యం వహించాలంటే పాస్‌పోర్ట్‌తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పాను. కానీ అది జరగదు(నవ్వుతూ). ఇక టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఒక్క సలహా ఇవ్వాలనకుంటున్నాను. మీరు బుమ్రాను ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ బుమ్రాను టార్గెట్ చేయకూడదు. ఎందుకంటే బుమ్రాను టార్గెట్ చేస్తే బంగ్లా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను భారత్‌కు సమర్పించుకోవాల్సి ఉంటుందని" లారా పేర్కొన్నాడు. అదేవిధంగా మెక్‌గ్రాత్, ఆంబ్రోస్, వసీం అక్రమ్ టాప్ క్లాస్ బౌలర్లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోతాడని లారా ప్రశంసించాడు. -
ఆసీస్, పాక్ కాదు.. ఆ రెండు జట్లు మధ్యే వరల్డ్‌కప్ ఫైనల్
క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న టీ20 వరల్డ్‌కప్-2024కు మరో రెండు వారాల్లో తెరలేవనుంది. అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా జూన్ 1 నుంచి ఈ పొట్టి వరల్డ్‌కప్ షురూ కానుంది. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో పాల్గోనే అన్ని జట్లు దాదాపుగా తమ వివరాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో సెమీ ఫైనల్స్‌కు చేరే జట్లను వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా అంచనా వేశాడు. వెస్టిండీస్, భారత్, అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్‌కు చేరుతాయని లారా తెలిపాడు. అంతేకాకుండా. జూన్ 29న తుది పోరులో వెస్టిండీస్, భారత జట్లు తలపడతాయని లారా జోస్యం చెప్పాడు.వెస్టిండీస్ ఒక అద్బుతమైన జట్టు. జట్టులో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. జట్టులో ప్రతీ ఒక్కరికి తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఉంది. మరోవైపు భారత వరల్డ్‌కప్ జట్టుపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటకి.. టాప్-4లో మాత్రం కచ్చితంగా ఉంటుంది.టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో భారత్-విండీస్ జట్లు తలపడితే నేను చూడాలనకుంటున్నాను. ఈ రెండు టీమ్స్ ఫైనల్లో తల పడి అత్యుత్తమ జట్టు ఛాంపియన్స్‌గా నిలవాలి. అదేవిధంగా భారత్, విండీస్ పాటు అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ కూడా సెమీఫైనల్స్‌కు చేరే అవకాశముందని లారా క్రికెట్ పాకిస్తాన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లారా పేర్కొన్నాడు.కాగా ఈ పొట్టి వరల్డ్‌కప్‌లో భారత జట్టు కంటే విండీస్‌కే ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. విండీస్ రెండు సార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది. వెస్టిండీస్ 2012 ,2016లో టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు 2007లో జరిగిన టీ20 వరల్డ్‌కప్ తొలి ఎడిషన్ టైటిల్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. -
బుమ్రా ఒక్కడే ఏమి చేయగలడు.. ముంబై బౌలింగ్‌పై లారా విమర్శలు
ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ముంబై విఫలమైంది. దీంతో తమ సొంత గ్రౌండ్లో ఓటమిపాలై మరోసారి ముంబై జట్టు విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని లారా అభిప్రాయపడ్డాడు. "ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కన్పిస్తోంది. సన్‌రైజర్స్‌పై 230 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో కూడా వారు దగ్గరగా వచ్చారు. ఆ తర్వాత ఆర్సీబీపై 196 లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలో ఛేదించారు. నిన్నటి సీఎస్కే మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు పర్వాలేదన్పించారు. కానీ ముంబై బౌలింగ్ విభాగం మాత్రం పేలవంగా ఉంది. బౌలింగ్‌లో యూనిట్లో జస్ప్రీత్ బుమ్రా ఒంటరియ్యాడు. అతడికి మిగితా బౌలర్ల నుంచి సహకారం లభించడం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఏడు ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ నాలుగు ఓవర్లే బౌలింగ్ చేశారు. దూబే క్రీజులో ఉన్నాడని స్పిన్నర్లను హార్దిక్ నమ్మలేదు. బౌలింగ్ విషయంలో ముంబై ఇండియన్స్ మెరుగ్వాలి. సీఎస్కే బౌలింగ్ యూనిట్‌ను చూసి ప్రత్యర్ది జట్లు చాలా విషయాలు నేర్చుకోవాలి. సీఎస్కేలో ప్రతీ బౌలర్‌కు తమ రోల్‌పై ఒక క్లారిటీ ఉందని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో లారా పేర్కొన్నాడు. -
'సచిన్, లారా కాదు.. నా లైఫ్‌లో నేను చూసిన బెస్ట్ ప్లేయర్ అతడే'
ఐపీఎల్-2024లో లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్ మైండ్ ఉంది. అతడే లక్నో హెడ్ కోచ్, ఆసీస్ లెజెండరీ క్రికెటర్ జస్టిన్ లాంగర్. ఈ ఏడాది సీజన్‌తో లక్నో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్ తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్‌లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్ చర్చించాడు. "ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్ ఆటగాడు విరాట్ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్‌గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్, మార్టిన్ క్రోవ్‌లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్‌కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను. అదేవిధంగా బ్రియాన్ లారా, సచిన్ టెండూల్కర్ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. విరాట్ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్‌లో కోహ్లిని తొందరగా ఔట్ చేయడం ఔట్ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్ జెయింట్స్ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూలో లాంగర్ పేర్కొన్నాడు. -
27 ఏళ్ల తర్వాత తొలి విజయం.. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా! వీడియో
బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై విండీస్‌కు ఇది 27 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం కావడం విశేషం. ఈ విజయంలో విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించాడు. తన బొటన వేలు విరిగినప్పటికి జోసెఫ్ అద్భత ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా.. కాగా చారిత్రాత్మక విజయం అనంతరం ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా భావోద్వేగానికి లోనయ్యాడు. లారా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర కామెంటేటర్ గిల్ క్రిస్ట్.. లారాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కోర్లు విండీస్ తొలి ఇన్నింగ్స్: 310/10 ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 289/9(డిక్లెర్) విండీస్ రెండో ఇన్నింగ్స్: 193/10 ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207/7 ఫలితం: 8 పరుగుల తేడాతో విండీస్ విజయం The 3 Kings…@gilly381 @BrianLara #Smithy ❤️ test cricket…@FoxCricket pic.twitter.com/rQBxho9z3B — Mark Howard (@MarkHoward03) January 28, 2024 The moment Shamar Joseph breached Fortress Gabba and sealed a stunning victory for West Indies beating Australia🔥 pic.twitter.com/HSwnpBfpwR — Devanayagam (@Devanayagam) January 28, 2024 -
లారాకు ఉద్వాసన.. సన్‌రైజర్స్ కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ప్లేయర్
ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్రాంచైజీ యాజమాన్యం ప్రస్తుత హెడ్ కోచ్, బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారాపై వేటు వేసింది. అతని స్థానంలో కొత్త కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత ఆస్ట్రేలియా పురుషుల టీమ్ అసిస్టెంట్ కోచ్ డేనియల్ వెటోరీని నియమించింది. గత సీజన్లో (2023) జట్టు పేలవ ప్రదర్శనకు లారాను బాధ్యున్ని చేస్తూ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. 2023 సీజన్ ప్రారంభానికి ముందు టామ్ మూడీ నుంచి బాధ్యతలు చేపట్టిన లారా.. ఆ సీజన్లో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు. అతని ఆధ్వర్యంలో సన్‌రైజర్స్ 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి ఆఖరి స్థానంతో ముగించింది. 🚨Announcement🚨 Kiwi legend Daniel Vettori joins the #OrangeArmy as Head Coach🧡 Welcome, coach! 🔥 pic.twitter.com/2wXd8B1T86 — SunRisers Hyderabad (@SunRisers) August 7, 2023 ఆరు సీజన్లలో నలుగురు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గత ఆరు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చింది. 2019, 2022 సీజన్లలో టామ్ మూడీ.. 2020, 2021 సీజన్లలో ట్రెవర్ బేలిస్.. 2023 సీజన్లో లారా.. తాజాగా వెటోరీ సన్‌రైజర్స్ హెడ్ కోచ్‌లుగా నియమితులయ్యారు. గతంలో ఆర్సీబీ కోచ్‌గా వెటోరీ.. న్యూజిలాండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్లేయర్‌గా పేరు గాంచిన డేనియల్ వెటోరీ.. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. ప్రస్తుతం అతను ఆస్ట్రేలియా పురుషుల జట్టు అసిస్టెంట్ కోచ్ పదవితో పాటు హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్హమ్ ఫీనిక్స్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వెటోరీ.. కరీబియన్ లీగ్‌లో బార్బడోస్ రాయల్స్ హెడ్ కోచ్‌గా, బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ హెడ్‌కోచ్‌గా, ఇంగ్లండ్ వైటాలిటీ బ్లాస్ట్‌లో మిడిల్సెక్స్ హెడ్‌కోచ్‌గా, బంగ్లాదేశ్ జాతీయ పురుషుల జట్టు స్పిన్ కన్సల్టెంట్గానూ పని చేశాడు. -
నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా
భారత్-వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొదలు కానుంది. ఇప్పటికే డొమినికాకు చేరుకున్న ఇరు జట్లు తమ ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంటున్నాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమి తర్వాత టీమిండియాకు ఇదే తొలి సిరీస్ కాగా.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో పేలవ ప్రదర్శన విండీస్‌కు కూడా ఇది మొదటి టెస్టు సిరీస్. దీంతో ఇరు జట్లు కూడా డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఊవ్విళ్లరుతున్నాయి. ఇక తొలి టెస్టు నేపథ్యంలో వెస్టిండీస్ మెంటార్ బ్రియాన్ లారా తమ జట్టుకు మద్దతుగా నిలిచాడు. జట్టులో కొంత మంది అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని, వారికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉంది అని లారా అభిప్రాయపడ్డాడు. "ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా ప్రారంభమయ్యే ఈ టెస్టు సిరీస్ మాకు చాలా కీలకం. టీమిండియా ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్లలో ఒకటి. వారికి తమ స్వదేశంలోనైనా, విదేశీ గడ్డలపైనా అయినా ప్రత్యర్ధిలకు మట్టి కరిపించే సత్తా ఉంది. అటువంటి టాప్ క్లాస్ టీమ్‌తో మేము తలబడబోతున్నాం. మేము అందుకు తగ్గట్టు సన్నద్దం అవుతున్నాము. మేము ఇప్పటికే ఒక ట్రైనింగ్ క్యాంప్‌ను కూడా ఏర్పాటు చేశాం. తొలి టెస్టుకు ఇంకా మాకు కేవలం మూడు రోజుల మాత్రమే ఉంది. క్రైగ్ బ్రాత్‌వైట్ నేతృత్వంలోని యువ జట్టు భారత్‌కు పోటీ ఇస్తుందని నేను భావిస్తున్నాను. ఈ సిరీస్‌లో కొంతమంది యువ ఆటగాళ్లు తమ సత్తా చాటడానికి సిద్దంగా ఉన్నారు. భారత్ వంటి కఠిన జట్లతో ఆడితేనే మన టాలెంట్ ఎంటో బయటపడుతుందని లారా విలేకురల సమావేశంలో పేర్కొన్నాడు. కాగా ఈ టీమిండియా సిరీస్‌తో కిర్క్ మెకెంజీ,అలిక్ అథానాజ్లు అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. టీమిండియాతో తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు: క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్. ట్రావెలింగ్ రిజర్వ్స్: టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్. చదవండి: Ind Vs WI: ఇండియా వర్సెస్ వెస్టిండీస్.. షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం, జట్లు.. పూర్తి వివరాలివే -
IPL- SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం.. ఇకపై..
Indian Premier League- Sunrisers Hyderabad: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీని తప్పించింది. అతడి స్ధానంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఎస్ఆర్హెచ్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్ఆర్హెచ్ శనివారం ప్రకటించింది. కాగా బ్రియాన్ లారా ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఎస్ఆర్హెచ్ లారాతో ఒప్పందం కుదుర్చకుంది. "క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్ సీజన్లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు" అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. 🚨Announcement 🚨 The cricketing legend Brian Lara will be our head coach for the upcoming #IPL seasons. 🧡#OrangeArmy pic.twitter.com/6dSV3y2XU2 — SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022 కాగా ఈ ఏడాది ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాది సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్..కేవలం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక టామ్ మూడీ విషయానికి వస్తే... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టీ20 లీగ్‌లో పాల్గొనున్న డెసర్ట్ వైపర్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు. As his term with us draws to an end, we would like thank Tom for his contributions to SRH. It has been a much cherished journey over the years, and we wish him the very best for future endeavours. pic.twitter.com/aGKmNuZmq8 — SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022 చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్దిల్.. -
Brian Lara: ముంబై ఇండియన్స్ గురించే నా ఆందోళన
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లాడిన డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని ముంబై ఇండియన్స్.. తన తదుపరి నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు ఢిల్లీకి వెళుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై పోరుకు సిద్దమవుతోంది. ఇదే తనను కలకర పరుస్తోందని అంటున్నాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. స్టార్ స్పోర్ట్ షో ‘క్రికెట్ లైవ్’లో మాట్లాడిన లారా.. నాకైతే ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆందోళనగానే ఉంది. వారు ఇప్పుడు మరొక వేదికి ఢిల్లీకి వెళుతున్నారు. అది ఇంకా స్లోపిచ్. వారు అక్కడ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఆ స్లోపిచ్‌లపై ముంబై నాలుగు మ్యాచ్‌లను ఆడబోతుంది. ఎలా ఆడుతుందనేది నాకు ఒక ప్రశ్నగానే ఉంది. నేను అనేది ఏమిటంటే, హోరాహోరీ మ్యాచ్‌లు ఫలితం ఎలా ఉంటుందో ఈ టోర్నమెంట్లో చెప్పలేకపోతున్నాం. ప్రతీ వేదికలోనూ విజయాలు సాధిస్తున్న జట్లు మిగతా వేదికలకు ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతున్నాయి. ఇక ఆత్మవిశ్వాసం లేని జట్లకు వేదికలనేది సమస్యగా మారిపోయింది. ఆర్సీబీ ప్రతీ వేదికలో విజయాలు సాధించడంతో వారికి వేదిక సమస్య అనేది ఉండటం లేదు. వారిని ఆత్మవిశ్వాసం నడిపిస్తోంది’ అని లారా తెలిపాడు. రేపు (గురువారం) రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనుంది. ఇక్కడ చదవండి: Virender Sehwag: పంత్ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను -
క్రీజ్‌లోకి మళ్లీ ‘మాస్టర్’
మెల్బోర్న్: క్రికెట్ ‘దేవుడు’ సచిన్ టెండూల్కర్ మళ్లీ క్రీజులోకి దిగాడు. తనను క్రికెట్లో రారాజుగా చేసిన బ్యాటింగ్‌తో మళ్లీ మెరిశాడు. ‘కార్చిచ్చు’తో మసి అయిన ఆస్ట్రేలియాలో తన పెద్ద మనసు చాటుకున్నాడు. విరాళాలు పోగు చేసే సత్కార్యంలో తన బ్యాటింగ్ ఆట చూపెట్టాడు. బ్యాటింగ్ ఎవరెస్ట్, క్రికెట్ గ్రేటెస్ట్‌కు బౌలింగ్ చేసే అదృష్టం ఆస్ట్రేలియన్ మహిళల జట్టు సూపర్‌స్టార్ ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీ దక్కించుకుంది. ఈ ‘మెన్ ఇన్ బ్లూ’ ఆటగాడు కొంగొత్త డ్రెస్సింగ్‌తో బరిలోకి దిగాడు. పసుపు రంగు హెల్మెట్ ధరించి, అల్ట్రాలైట్ కూకాబుర్రా లోగో (సాధారణంగా ఎంఆర్ఎఫ్ లేదంటే అడిడాస్ లోగో) ఉన్న బ్యాట్‌తో ఐదు నిమిషాలు సచిన్ బ్యాటింగ్ చేశాడు. షార్ట్ ఫైన్ లెగ్, డీప్ స్క్వేర్‌లో తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో అక్కడి ప్రేక్షకుల్ని టెండూల్కర్ అలరించాడు. నిజానికి కార్చిచ్చు విరాళాల సేకరణలో పాలుపంచుకునేందుకు అక్కడికి వెళ్లాడు. కానీ 10 ఓవర్ల ఆటలో మాత్రం ఆడలేదు. అయితే మహిళా స్టార్ పెర్రీ తన బౌలింగ్‌ను ఎదుర్కోవాలని సామాజిక సైట్లో వీడియో మెసేజ్ చేయగా... సచిన్ సరేనంటూ ఆమె ముచ్చట తీర్చాడు. తన క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. అంతకుముందు జరిగిన 10 ఓవర్ల పొట్టి మ్యాచ్‌లో పాంటింగ్ ఎలెవన్ పరుగు తేడాతో గిల్‌క్రిస్ట్ ఎలెవన్‌పై నెగ్గింది. పాంటింగ్ జట్టు 104/5 స్కోరు చేయగా... మన యువరాజ్ సింగ్ (2) ఆడిన గిల్‌క్రిస్ట్ జట్టు 103/6 వద్ద ఆగిపోయింది. లారా, కోట్నీ వాల్‡్ష, వసీమ్ అక్రమ్, పాంటింగ్, హేడెన్, గిల్‌క్రిస్ట్, వాట్సన్, సైమండ్స్ తదితర క్రికెటర్లు చారిటీ మ్యాచ్‌లో ఉత్సాహంగా ఆడారు. ఈ మ్యాచ్ ద్వారా 77 లక్షల 23 వేల 129 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 36 కోట్ల 85 లక్షలు) విరాళంగా సేకరించామని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని కార్చిచ్చు బాధితులకు అందజేస్తామని తెలిపింది. ఔరా... లారా... క్రికెట్ తెలిసిన వారికి లారా తెలియకుండా ఉండడు. వెస్టిండీస్ క్రికెట్లోనే కాదు... ప్రపంచ క్రికెట్లోనే అసాధారణ బ్యాటింగ్ మాంత్రికుడు బ్రియాన్ లారా. అతని ఆట, కెరీర్ ఎంతో అద్భుతంగా సాగింది. ఇంకా చెప్పాలంటే అతని రికార్డు (టెస్టుల్లో 400 నాటౌట్) ఇంకా చెక్కు చెదరలేదు. 50 ఓవర్లలోనే 350 లక్ష్యమైనా ఉఫ్‌మని ఊదేస్తున్న ఈ రోజుల్లో... వన్డేల్లోనే డబుల్ సెంచరీల మీద డబుల్ సెంచరీలు బాదుతున్న రోహిత్, పరుగులు పరుగుల్లా కాకుండా వరదలెత్తిస్తున్న విరాట్, విధ్వంసం సృష్టించే వార్నర్లాంటి వారంతా ఉన్న నేటితరం క్రికెట్లో... లారా సంప్రదాయ క్రికెట్లో సాధించిన ‘క్వాడ్రపుల్ సెంచరీ’ జోలికి ఎవరూ వెళ్లలేకపోయారు. కానీ లారా మాత్రం తనకు ఏమాత్రం తెలియని టి20 క్రికెట్‌ను అవలీలగా ఆడేస్తానని తన బ్యాట్‌తో అది కూడా 50 ఏళ్ల వయసులో చాటడం గొప్ప విశేషం. ఈ క్రికెట్ చరిత్రకారుడు బుష్ఫైర్ (కార్చిర్చు) చారిటీ మ్యాచ్‌లో పాంటింగ్ ఎలెవన్ తరఫున 10 ఓవర్ల క్రికెట్ ఆడాడు. 11 బంతుల్లోనే 30 పరుగులు చేశారు. అతని 3 ఫోర్లు, 2 సిక్సర్లు చూస్తే మాత్రం ఇప్పటికీ అతను తాజాగా ఆడుతున్న క్రికెటర్‌నే గుర్తుచేస్తాయి తప్ప రిటైర్డ్ క్రికెటర్ అని అనిపించదు! -
కోహ్లి అన్నీ గెలిపిస్తాడు: లారా
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ ఐసీసీ టోర్నీలన్నీ గెలుస్తుందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఐసీసీ మెగా ఈవెంట్లను గెలిపించే సత్తా, సామర్థ్యం కోహ్లికి ఉంది. ఈ టోర్నీల్లో ప్రత్యర్థులందరి లక్ష్యం భారతే అవుతుంది. టీమిండియాని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. భారత్‌తో జరిగే మ్యాచ్ తమకు కీలకంగా మిగతా జట్లు భావిస్తాయి. అంత పటిష్టంగా భారత జట్టు ఎదిగింది’ అని అన్నాడు. విరాట్ సారథ్యంలో భారత్ ఇటు టెస్టుల్లో అటు వన్డేల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిందని చెప్పాడు. తాను టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల అజేయమైన రికార్డును చెరిపేసే సత్తా ఆసీస్ ఓపెనర్ వార్నర్‌తో పాటు భారత స్టార్లు రోహిత్ శర్మ, కోహ్లిలకు ఉందని అన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే స్టీవ్ స్మిత్ మేటి బ్యాట్స్‌మన్ అయినప్పటికీ... తన రికార్డును చేరుకోలేడని... వార్నర్, కోహ్లి, రోహిత్‌లాంటి అటాకింగ్ బ్యాట్స్‌మెన్ చెరిపేస్తారని చెప్పాడు. -
కోహ్లి క్రికెట్ రొనాల్డో: లారా
విశాఖపట్నం: వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా భారత కెప్టెన్ విరాట్ కోహ్లిని సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోతో పోల్చాడు. అతని శారీరక సామర్థ్యం, మానసిక సై్థర్యం, బ్యాటింగ్ నైపుణ్యం అసాధారణమని 50 ఏళ్ల లారా ప్రశంసించాడు. మూడు ఫార్మాట్లలోనూ ఎవరికీ సాధ్యం కానీ 50 పరుగుల సగటు అతనిదని కితాబిచ్చాడు. ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్‌కు వచ్చిన లారా మీడియాతో మాట్లాడుతూ ‘నా దృష్టిలో కోహ్లి క్రికెట్ రొనాల్డో. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్‌కు కోహ్లి ఏ మాత్రం తీసిపోడు. ఆటలో, సన్నాహకంలో అతని నిబద్ధతను మెచ్చుకోవాల్సిందే. బ్యాటింగ్‌లో అతను కష్టపడేతత్వం గొప్పగా ఉంటుంది. ఏ తరం క్రికెట్ జట్టుకైనా సరిగ్గా సరిపోయే బ్యాట్స్‌మన్ అతను’ అని విరాట్‌ను ఆకాశానికెత్తాడు. అంతకుముందు ఢిల్లీలో ఈ విండీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా లారా క్రికెట్‌కు చేసిన సేవలను కోవింద్ కొనియాడారు. వర్ధమాన క్రీడాకారులకు లారా ఓ రోల్ మోడల్ అని ఆయన కితాబిచ్చారు. -
చెత్త రికార్డు: లారాను దాటేసిన కోహ్లి
పెర్త్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్‌లో చేసిన సెంచరీతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పలు రికార్డులు బద్దలు కొట్టాడు. భారత్ ఘోర పరాజయంతో అతడి కెప్టెన్సీ కెరీర్లో చెత్త రికార్డు కూడా నమోదైంది. పెర్త్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 146 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కోహ్లి 25వ సెంచరీ వృధాగా పోయింది. తాను సెంచరీ కొట్టినా జట్టు ఓడిపోవడం కోహ్లికి ఇది ఏడోసారి కావడం గమనార్హం. కెప్టెన్‌గా సెంచరీ చేసినా టీమ్ ఓడిపోవడం అతడికిది ఆరోసారి. ఇంతకుముందు వెస్టిండీస్ బ్రియన్ లారా పేరిట ఈ చెత్త రికార్డు ఉండేది. లారా సెంచరీలు చేసిన ఐదుసార్లు విండీస్ ఓడిపోయింది. వీరి తర్వాత ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఉన్నాడు. అతడు నాలుగు పర్యాయాలు శతకాలు బాదినప్పుడు ఆసీస్ పరాజయం పాలైంది. 15వ ఓటమి పెర్త్ టెస్ట్ ఓటమి టీమిండియా చెత్త రికార్డును మరింత ముందుకు తీసుకెళ్లింది. గత 15 ఏళ్లలో 200, అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడి ఓడిపోవడం భారత క్రికెట్ జట్టుకు ఇది 15వ సారి కావడం గమనార్హం. భారత్ చివరిసారిగా 2003లో అడిలైడ్‌లో జరిగిన టెస్ట్‌లో 200 పైగా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. ఛేజింగ్‌లో టీమిండియా ఈ ఏడాది ఆరుసార్లు ఓడిపోయింది. కేప్‌టౌన్(టార్గెట్ 208), సెంచూరియన్(287), బర్మింగ్‌హామ్(194), సౌతాంప్టన్ (245), ఓవల్ (464), పెర్త్ (287) టెస్టుల్లో చతికిలపడింది.