టీ20 వరల్డ్‌కప్-2024లో జోరు మీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీ సూపర్-8లో భాగంగా అంటిగ్వా వేదికగా శనివారం బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది.
ఈ మ్యాచ్‌కు భారత్ అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సెమీస్ బెర్త్‌ను ఖారారు చేసుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ప్రశంసల వర్షం కురిపించాడు.
బుమ్రా వరల్డ్‌క్లాస్ బౌలర్ అని లారా కొనియాడాడు. కాగా ఈ మెగా టోర్నీలో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 8 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌పై విజయంలో కూడా బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
"జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ స్థాయి బౌలర్. వరల్డ్ క్రికెట్‌లో ఇటువంటి బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. బుమ్రా లాంటి బౌలర్ జట్టులో ఉండాలని ప్రతీఒక్కరూ కోరుకుంటున్నారు. మా జట్టులో కూడా బుమ్రా లాంటి పేస్ గుర్రం ఉంటే బాగుండేది అనిపిస్తోంది.
అందుకే రెండు రోజుల క్రితం నేను సరదాగా కొన్ని వ్యాఖ్యలు చేశాను. బుమ్రా వెస్ట్రన్ ఈస్ట్‌లో ఉండి వెస్టిండీస్‌కు ప్రాతనిథ్యం వహించాలంటే పాస్‌పోర్ట్‌తో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని చెప్పాను. కానీ అది జరగదు(నవ్వుతూ). ఇక టీమిండియాతో మ్యాచ్‌కు ముందు బంగ్లాదేశ్ ప్లేయర్లకు ఒక్క సలహా ఇవ్వాలనకుంటున్నాను.
మీరు బుమ్రాను ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ బుమ్రాను టార్గెట్ చేయకూడదు.
ఎందుకంటే బుమ్రాను టార్గెట్ చేస్తే బంగ్లా వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను భారత్‌కు సమర్పించుకోవాల్సి ఉంటుందని" లారా పేర్కొన్నాడు. అదేవిధంగా మెక్‌గ్రాత్, ఆంబ్రోస్, వసీం అక్రమ్ టాప్ క్లాస్ బౌలర్‌లలో ఒకడిగా బుమ్రా నిలిచిపోతాడని లారా ప్రశంసించాడు.
Comments
Please login to add a commentAdd a comment