టీ20 ప్రపంచకప్-2024 విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో భారత్ 13 ఏళ్ల వరల్డ్‌కప్ నిరీక్షణకు తెరపడింది. అయితే భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. టోర్నీ అసాంతం బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
కీలకమైన ఫైనల్లో సైతం బుమ్రా సత్తాచటాడు. భారత్‌కు ఓటమి తప్పదనుకున్న ప్రతీసారి బుమ్రా బంతితో మ్యాజిక్ చేసేవాడు. తన బౌలింగ్‌తో వరల్డ్‌క్లాస్ బ్యాటర్లను సైతం ముప్పుతిప్పలు పెట్టాడు.
ఈ మెగా టోర్నీలో 8 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 4.17 ఏకానమీతో 15 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు వరించింది. వరల్డ్ క్రికెట్‌లో బుమ్రాని మించిన బౌలర్ మరొకడు లేడని కార్తీక్ కొనియాడాడు.
"బుమ్రా ఒక వరల్డ్‌క్లాస్ బౌలర్. జస్ప్రీత్ కోహినూర్ వజ్రం కంటే విలువైనవాడు. కామెంటరీలో కూడా ఇదే విషయం చాలా సార్లు చెప్పాను. వరల్డ్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ బుమ్రాని మించిన వాడు మరొకడు లేడు.
ఒత్తడిలో అద్బుతంగా బౌలింగ్ చేయడమే బుమ్రా స్పెషల్. అతడు లాంటి బౌలర్ ఒకరు జట్టులో ఉండాలని ప్రతీ కెప్టెన్ కోరుకుంటాడు. ఎటువంటి పరిస్థితులైనా బుమ్రా రాణించగలడు. ఇది అందరూ బౌలర్లు చేయలేరు. నిజంగా బుమ్రా చాలా బ్రిలియంట్ అంటూ" క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కార్తీక్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment