జస్ప్రీత్‌ బుమ్రా నాకంటే 1000 రెట్లు బెటర్‌: కపిల్‌ దేవ్ Jasprit Bumrah 1000 Times Better Than me: Kapil Dev | Sakshi
Sakshi News home page

జస్ప్రీత్‌ బుమ్రా నాకంటే 1000 రెట్లు బెటర్‌: కపిల్‌ దేవ్

Published Thu, Jun 27 2024 8:49 PM | Last Updated on Thu, Jun 27 2024 11:52 PM

Jasprit Bumrah 1000 Times Better Than me: Kapil Dev

క‌పిల్ దేవ్‌.. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో త‌న పేరును సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించుకున్నాడు. భార‌త్‌కు తొలి వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను అందించిన కెప్టెన్‌గా క‌పిల్ దేవ్ ఖ్యాతి గ‌డించాడు. ఇండియ‌న్ క్రికెట్‌లో అత్యుత్త‌మ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా నిలిచిన క‌పిల్ దేవ్‌.. తన కంటే అద్భుతమైన బౌలర్‌ ఉన్నాడని ఒక‌రిని కొనియాడాడు. 

అత‌డే టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా. బుమ్రాపై క‌పిల్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. "బుమ్రా ఒక అద్బుత‌మైన బౌల‌ర్‌. జ‌స్ప్రీత్ నా కంటే 1000 రెట్లు బెట‌ర్‌.  ప్ర‌స్తుత త‌రం క్రికెట‌ర్ల‌లో చాలా మంది నైపుణ్యం కలిగిన వారే. 

మాకు అనుభ‌వం ఉంది. కానీ వారు మాక‌న్న చాలా ఎక్కువ పరిణితి చూపిస్తున్నారు. అదేవిధంగా మాకంటే ఫిట్‌గా ఉన్నారు. మాకంటే ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డ‌తారు కూడా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యా ప్ర‌తీ ఒక్క‌రూ త‌మ పాత్ర పోషిస్తున్నారు. 

ట్రోఫీని గెలవడమే వారి ల‌క్ష్య‌మ‌ని" పీటీఐకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌పిల్‌దేవ్ పేర్కొన్నాడు. కాగా టీ20 వరల్డ్‌కప్‌లో బుమ్రా అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్ప‌టివ‌ర‌కు 4 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 8 వికెట్లు పడగొట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement