ఐపీఎల్-2024లో భాగంగా వాంఖడే వేదికగా సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ముంబై విఫలమైంది. దీంతో తమ సొంత గ్రౌండ్‌లో ఓటమిపాలై మరోసారి ముంబై జట్టు విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌పై వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముంబై బౌలింగ్ విభాగం అంత పటిష్టంగా లేదని లారా అభిప్రాయపడ్డాడు.
"ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పరంగా చాలా బలంగా కన్పిస్తోంది. సన్‌రైజర్స్‌పై 230 పరుగుల టార్గెట్ ఛేజింగ్‌లో కూడా వారు దగ్గరగా వచ్చారు. ఆ తర్వాత ఆర్సీబీపై 196 లక్ష్యాన్ని కేవలం 15 ఓవర్లలో ఛేదించారు. నిన్నటి సీఎస్‌కే మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు పర్వాలేదన్పించారు. కానీ ముంబై బౌలింగ్ విభాగం మాత్రం పేలవంగా ఉంది. బౌలింగ్‌లో యూనిట్‌లో జస్ప్రీత్ బుమ్రా ఒంటరియ్యాడు.
అతడికి మిగితా బౌలర్ల నుంచి సహకారం లభించడం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు ఏడు ఎకానమీ రేటుతో పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ నాలుగు ఓవర్లే బౌలింగ్ చేశారు. దూబే క్రీజులో ఉన్నాడని స్పిన్నర్లను హార్దిక్ నమ్మలేదు. బౌలింగ్ విషయంలో ముంబై ఇండియన్స్ మెరుగ్వాలి. సీఎస్‌కే బౌలింగ్ యూనిట్‌ను చూసి ప్రత్యర్ది జట్లు చాలా విషయాలు నేర్చుకోవాలి. సీఎస్‌కేలో ప్రతీ బౌలర్‌కు తమ రోల్‌పై ఒక క్లారిటీ ఉందని" స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్‌లో లారా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment