'సచిన్‌, లారా కాదు.. నా లైఫ్‌లో నేను చూసిన బెస్ట్‌ ప్లేయర్‌ అతడే' | Justin Langer Names Virat kohli As Best Player I Have Seen In My Life | Sakshi
Sakshi News home page

'సచిన్‌, లారా కాదు.. నా లైఫ్‌లో నేను చూసిన బెస్ట్‌ ప్లేయర్‌ అతడే'

Published Mon, Apr 8 2024 10:09 PM | Last Updated on Mon, Apr 8 2024 11:09 PM

Justin Langer Names Virat kohli As Best Player I Have Seen In My Life - Sakshi

ఐపీఎల్‌-2024లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ అదరగొడుతోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌లు మూడింట విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. అయితే లక్నో విజయాల వెనుక ఓ మాస్టర్‌ మైండ్‌ ఉంది. అతడే లక్నో హెడ్‌ కోచ్‌, ఆసీస్‌ లెజెండరీ క్రికెటర్‌ జస్టిన్ లాంగర్.

ఈ ఏడాది సీజన్‌తో లక్నో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన లాంగర్‌ తన అనుభవంతో జట్టును విజయ పథంలో నడిపిస్తున్నాడు. అయితే లాంగర్‌ తాజాగా లక్నో సూపర్‌ జెయింట్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ క్రమంలో తన లైఫ్‌లో చూసిన అద్బుతమైన క్రికెటర్లు గురించి లాంగర్‌ చర్చించాడు. 

"ఇప్పటివరకు నా జీవితంలో నేను చూసిన బెస్ట్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లినే. ఈ విషయాన్ని నేను ఇప్పటికే చాలా సార్లు పబ్లిక్‌గా చెప్పాను. నాకు లెజండరీ క్రికెటర్లు వివ్ రిచర్డ్స్, అలన్ బోర్డర్‌, మార్టిన్ క్రోవ్‌లు అంటే కూడా నాకు ఇష్టం. మార్టిన్ క్రోవ్‌కు ప్రత్యర్ధిగా కూడా నేను ఆడాను.

అదేవిధంగా బ్రియాన్ లారా,  సచిన్ టెండూల్కర్‌ కూడా గొప్ప ఆటగాళ్లు. కానీ విరాట్‌ ఎనర్జీ వీరిందరి కంటే అద్భుతం. అతడు చాలా ఫిట్‌గా ఉన్నాడు. విరాట్‌ మైదానంలో వికెట్ల మధ్య పరిగెత్తడం, ఫీల్డింగ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటాడు.

కాబట్టి అతని ఆట చూడటం నాకు చాలా ఇష్టం. మాతో మ్యాచ్‌లో కోహ్లిని తొందరగా ఔట్‌ చేయడం ఔట్‌ చేయడం చాలా సంతోషంగా అన్పించిందని" లక్నో సూపర్‌ జెయింట్స్‌ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూలో లాంగర్‌ పేర్కొన్నాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement