బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్ సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 8 పరుగుల తేడాతో విండీస్ గెలుపొందింది. ఈ గెలుపుతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన తొలి జట్టుగా విండీస్ అవతరించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియా గడ్డపై విండీస్‌కు ఇది 27 ఏళ్ల తర్వాత తొలి టెస్టు విజయం కావడం విశేషం.
ఈ విజయంలో విండీస్ యువ పేసర్ షామర్ జోసెఫ్ కీలక పాత్ర పోషించాడు. తన బొటన వేలు విరిగినప్పటికి జోసెఫ్ అద్భత ప్రదర్శన కనబరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టి తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కన్నీళ్లు పెట్టుకున్న బ్రియాన్ లారా..
కాగా చారిత్రాత్మక విజయం అనంతరం ఈ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా భావోద్వేగానికి లోనయ్యాడు. లారా ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచర కామెంటేటర్ గిల్ క్రిస్ట్.. లారాను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
స్కోర్లు
విండీస్ తొలి ఇన్నింగ్స్: 310/10
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 289/9(డిక్లెర్)
విండీస్ రెండో ఇన్నింగ్స్: 193/10
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 207/7
ఫలితం: 8 పరుగుల తేడాతో విండీస్ విజయం
The 3 Kings…@gilly381 @BrianLara #Smithy
— Mark Howard (@MarkHoward03) January 28, 2024
❤️ test cricket…@FoxCricket pic.twitter.com/rQBxho9z3B
The moment Shamar Joseph breached Fortress Gabba and sealed a stunning victory for West Indies beating Australia🔥 pic.twitter.com/HSwnpBfpwR
— Devanayagam (@Devanayagam) January 28, 2024
Comments
Please login to add a commentAdd a comment