Photo Courtesy: IPL
న్యూఢిల్లీ: ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్‌లాడిన డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఇప్పటివరకూ పెద్దగా ఆకట్టుకోని ముంబై ఇండియన్స్.. తన తదుపరి నాలుగు మ్యాచ్‌లు ఆడేందుకు ఢిల్లీకి వెళుతుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై పోరుకు సిద్దమవుతోంది. ఇదే తనను కలకర పరుస్తోందని అంటున్నాడు వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా. స్టార్ స్పోర్ట్ షో ‘క్రికెట్ లైవ్’లో మాట్లాడిన లారా.. నాకైతే ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆందోళనగానే ఉంది. వారు ఇప్పుడు మరొక వేదికి ఢిల్లీకి వెళుతున్నారు.
అది ఇంకా స్లోపిచ్. వారు అక్కడ ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. ఆ స్లోపిచ్‌లపై ముంబై నాలుగు మ్యాచ్‌లను ఆడబోతుంది. ఎలా ఆడుతుందనేది నాకు ఒక ప్రశ్నగానే ఉంది. నేను అనేది ఏమిటంటే, హోరాహోరీ మ్యాచ్‌లు ఫలితం ఎలా ఉంటుందో ఈ టోర్నమెంట్‌లో చెప్పలేకపోతున్నాం. ప్రతీ వేదికలోనూ విజయాలు సాధిస్తున్న జట్లు మిగతా వేదికలకు ఆత్మవిశ్వాసంతో అడుగుపెడుతున్నాయి. ఇక ఆత్మవిశ్వాసం లేని జట్లకు వేదికలనేది సమస్యగా మారిపోయింది. ఆర్సీబీ ప్రతీ వేదికలో విజయాలు సాధించడంతో వారికి వేదిక సమస్య అనేది ఉండటం లేదు. వారిని ఆత్మవిశ్వాసం నడిపిస్తోంది’ అని లారా తెలిపాడు. రేపు (గురువారం) రాజస్థాన్ రాయల్స్‌తో ముంబై ఇండియన్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో తలపడనుంది.
ఇక్కడ చదవండి:
Virender Sehwag: పంత్ కెప్టెన్సీకి 5 మార్కులు కూడా ఇవ్వను
Comments
Please login to add a commentAdd a comment