PC: BCCI/IPL
Indian Premier League- Sunrisers Hyderabad: ఐపీఎల్-2023 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీని తప్పించింది. అతడి స్ధానంలో వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారాను తమ జట్టు ప్రధాన కోచ్‌గా ఎస్‌ఆర్‌హెచ్ నియమించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఎస్‌ఆర్‌హెచ్ శనివారం ప్రకటించింది.
కాగా బ్రియాన్ లారా ప్రస్తుతం సన్‌రైజర్స్ బ్యాటింగ్ కోచ్, వ్యూహాత్మక సలహాదారుగా ఉన్నాడు. ఈ ఏడాది సీజన్‌కు ముందు ఎస్‌ఆర్‌హెచ్ లారాతో ఒప్పందం కుదుర్చకుంది. "క్రికెట్ లెజెండ్ బ్రియాన్ లారా రాబోయే ఐపీఎల్ సీజన్‌లకు మా జట్టు ప్రధాన కోచ్‌గా పనిచేయనున్నారు" అని సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది.
🚨Announcement 🚨
— SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022
The cricketing legend Brian Lara will be our head coach for the upcoming #IPL seasons. 🧡#OrangeArmy pic.twitter.com/6dSV3y2XU2
కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్ తీవ్రంగా నిరాశపరిచింది. ఈ ఏడాది సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్..కేవలం 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక టామ్ మూడీ విషయానికి వస్తే... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సరికొత్త టీ20 లీగ్‌లో పాల్గొనున్న డెసర్ట్ వైపర్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్‌గా ఎంపికయ్యాడు.
As his term with us draws to an end, we would like thank Tom for his contributions to SRH. It has been a much cherished journey over the years, and we wish him the very best for future endeavours. pic.twitter.com/aGKmNuZmq8
— SunRisers Hyderabad (@SunRisers) September 3, 2022
చదవండి: Asia Cup 2022: ఇదేం బౌలింగ్ రా బాబు.. అప్పుడు సూర్య! ఇప్పుడు కుష్‌దిల్..
Comments
Please login to add a commentAdd a comment