ఐపీఎల్‌లో గత కొన్ని సీజన్లగా సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్‌లు మారుతున్నప్పటికీ.. జట్టు ఆటతీరు మాత్రం మారడంలేదు. ఈ క్రమంలో ఐపీఎల్-2024 సీజన్‌కు ముందు తమ జట్టును మరోసారి ప్రక్షాళన చేయాలని సన్‌రైజర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా హెడ్ కోచ్ బ్రియాన్ లారాపై వేటు వేయనున్నట్లు సమాచారం.
అతడి నేతృత్వంలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు ఈ ఏడాది సీజన్‌లో తీవ్ర నిరాశ పరిచింది. ఐపీఎల్ 2023లో 14 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం నాలుగింట మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆఖరి స్ధానంలో నిలిచింది. కొత్త కెప్టెన్, కొత్త హెడ్‌కోచ్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ తమ స్ధాయికి తగ్గట్టు రాణించలేకపోయింది.
ఈ క్రమంలో లారాను తప్పించాలని ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విండీస్ క్రికెట్ జట్టును చక్కదిద్దే బాధ్యతను కూడా లారా తీసుకోవడంతో.. అతడు కూడా ఐపీఎల్ వైపు అంత మొగ్గు చూపకపోతునున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విండీస్ హెడ్ కోచ్ ఆండీ కోలీతో పాటు బ్రియాన్ లారా కూడా టీమ్‌కి సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.
ఎస్‌ఆర్‌హెచ్ హెడ్‌కోచ్‌గా వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత పరిస్ధితులను బట్టి చూస్తే కచ్చితంగా వచ్చే ఏడాది సీజన్‌లో సన్‌రైజర్స్‌కి కొత్త హెడ్‌కోచ్ వచ్చే అవకాశం ఉంది. అయితే తమ జట్టు హెడ్‌కోచ్ పదవి కోసం టీమిండియా మాజీ ఓపెనర్‌ను వీరేంద్ర సెహ్వాగ్‌ను సన్‌రైజర్స్ యాజమాన్యం సంప్రదించినట్లు తెలుస్తోంది. అతడి సమాధానం కోసం ఎస్‌ఆర్‌హెచ్ ఎదురుచూస్తున్నట్లు సమాచారం.
గతంలో సెహ్వాగ్ పంజాబ్ కింగ్స్‌కు మెంటార్‌గా నాలుగు సీజన్ల పాటు పనిచేశాడు. అదే విధంగా ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో అడిన అనుభవం కూడా సెహ్వాగ్ ఉంది. ఈ క్రమంలోనే అతడిని తమ జట్టు కోచింగ్ పగ్గాలు అప్పజెప్పాలని ఎస్‌ఆర్‌హెచ్ భావిస్తోంది. కానీ అభిమానులు మాత్రం డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కి 2009లో టైటిల్ అందించిన ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ని హెడ్ కోచ్‌గా నియమిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
చదవండి: Ind Vs WI 2nd Test: ధోని భయ్యా లేడు కదా.. ఇలాగే ఉంటది! ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి! వాళ్లకు కూడా..
Comments
Please login to add a commentAdd a comment