ఐపీఎల్-2023 ముగింపు దశకు చేరుకుంది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న తుదిపోరులో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అమీతుమి తెల్చుకోనున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్‌తో ఈ ఏడాది సీజన్‌కు ఎండ్‌కార్డ్ పడనుంది. ముఖ్యంగా ఈ ఏడాది సీజన్‌లో భారత యువ ఆటగాళ్లు జైశ్వాల్, శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లు దుమ్మురేపారు.
వీరితోపాటు టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇక విదేశీ ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఫాప్ డుప్లెసిస్, హెన్రిచ్ క్లాసెన్ కూడా అదరగొట్టారు. కాగా ఈ ఏడాది క్యాష్‌రిచ్ లీగ్‌లో తనను బాగా అకట్టుకున్న ఐదుగురు బ్యాటర్లను భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఎంపికచేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్‌కు చోటు దక్కకపోవడం గమానార్హం.
"ఐపీఎల్-2023లో నన్ను బాగా అకట్టుకున్న ఐదుగురు పాండవులను ఎంచుకున్నాను. ఈ సీజన్‌లో బాగా ఆడినా ఐదుగురు బ్యాటర్లే నా పంచ పాండవులు. ఈ జాబితాలో నేను చాలా మంది ఓపెనర్లను ఎంపిక చేయలేదు. ఎందుకంటే ఓపెనర్లకు పరుగులు చేసేందుకు చాలా అవకాశాలు ఉంటాయి. ఈ సీజన్‌లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన వారిలో మొదటి వ్యక్తి రింకూ సింగ్. అందుకు కారణం మీరు నాకు అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక బ్యాటర్ వరుసగా ఐదు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.
అది కేవలం రింకూకు మాత్రమే సాధ్యపడింది. రింకూ తర్వాత శివమ్ దుబే నన్ను బాగా ఇంప్రెస్ చేశాడు. అతడు ఈ ఏడాది సీజన్‌లో భిన్నంగా ఆడాడు. 160 పైగా స్ట్రైక్ రేటుతో 33 సిక్స్‌లు బాదాడు. చెన్నైకు అతడు విలువైన ఆస్తి. నా మూడో పాండవుడు యశస్వీ జైశ్వాల్. జైశ్వాల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతడు కచ్చితంగా భారత జట్టు తరపున ఆడుతాడు. నాలుగో వ్యక్తి సూర్యకుమార్ యాదవ్. సూర్య ఈ ఏడాది సీజన్‌కు ముందు పెద్దగా ఫామ్ లేడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో వరసుగా డకౌట్లయ్యాడు. ఐపీఎల్ ప్రారంభంలో కూడా పెద్దగా రాణించలేకపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం అదరగొడుతున్నాడు. అందుకే సూర్యను ఎంపిక చేశా. ఇక ఐదో వ్యక్తిని టాస్ వేసి సెలక్ట్ చేసుకున్నా. ఎందుకంటే మిడిలార్డర్‌లో చాలా మంది అద్భుతంగా రాణించారు. అయితే నేను మాత్రం హెన్రిచ్ క్లాసెన్‌ను సెలక్ట్ చేశాను. అతడు మిడిల్ ఆర్డర్‌లో ఇన్నింగ్స్‌లు అద్భుతం" అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: ఐపీఎల్-2023 ఛాంపియన్స్‌కు ప్రైజ్ మనీ ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment