ఐపీఎల్-2023లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న శ్రీలంక కెప్టెన్ దసున్ షనక తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది సీజన్ నుంచి తప్పుకున్న న్యూజిలాండ్ కెప్టెన్, గుజరాత్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ స్థానంలో షనక ఈ క్యాష్‌రిచ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తనకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో విఫలమమ్యాడు.
ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన షనక కేవలం 26 పరుగులు మాత్రమే చేశాడు. సీఎస్‌కేతో జరిగిన క్వాలిఫియర్-1లో కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన షనక కేవలం 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరిగే క్వాలిఫియర్-2లో దసన్‌కు చోటు దక్కే ఛాన్స్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సైతం షనక ప్రదర్శన పట్ల ఆసంతృప్తి వ్యక్తం చేశాడు.
"అహ్మదాబాద్‌లో గుజరాత్‌ను ఓడించడం అంత సులభం కాదు. వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో గుజరాత్ ఓడిపోయింది. కాబట్టి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలి హార్దిక్ అండ్ కో భావిస్తుంది. ముంబై బాగా కష్టపడాలి. అదే విధంగా ఈ మ్యాచ్‌లో ముంబై తమ జట్టులో పెద్దగా మార్పులు చేయకపోవచ్చు. హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తికేయను తీసుకురావచ్చు.
ఇక గుజరాత్ విషయానికి వస్తే.. వారు బౌలింగ్ పరంగా పటిష్టంగానే ఉన్నారు. కానీ బ్యాటింగ్‌లో కాస్త నిలకడ లోపించింది. ముఖ్యంగా దాసున్ షనక తీవ్ర నిరాశపరిచాడు. అతడి స్థానంలో ఓడియన్ స్మిత్ లేదా అల్జారీ జోసెఫ్‌ను తీసుకుంటే బాగుంటుంది. లేదా మనోహర్‌కు అవకాశం ఇచ్చిన పర్వాలేదు. అతడు కూడా భారీ సిక్స్‌లు కొట్టగలడు. షనకపై చాలా ఆశలు పెట్టుకున్నాను. అతడు నా అంచనాలకు కనీసం ఒక్క శాతం కూడా చేరుకోలేకపోయాడు అని క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
చదవండి: T20 WC 2023: టీ20 ప్రపంచకప్ జట్టులో కోహ్లి ఉండాలా వద్దా? గవాస్కర్ సమాధానమిదే
Comments
Please login to add a commentAdd a comment