న్యూఢిల్లీ: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఓడిన నెల రోజుల తర్వాత భారత జట్టు వచ్చే డబ్ల్యూటీసీ (2023–25) కోసం తమ పోరును కొత్తగా ప్రారంభించనుంది. వెస్టిండీస్‌లో జరిగే పర్యటనతో ఇది మొదలవుతుంది. ఈ టూర్‌ను సోమవారం బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇందులో భాగంగా భారత్, విండీస్ మధ్య 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి.
ఇరు జట్ల మధ్య జులై 12–16 మధ్య తొలి టెస్టు (డొమినికాలో), జులై 20–24 మధ్య రెండో టెస్టు (ట్రినిడాడ్)లో జరుగుతాయి. జులై 27, 29న రెండు వన్డేలు బార్బడోస్‌లో, ఆగస్టు 1న మూడో వన్డే ట్రినిడాడ్‌లో నిర్వహిస్తారు. ఆగస్టు 3, 6, 8, 12, 13 తేదీల్లో జరిగే 5 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. ఇందులో తొలి 3 టి20లు ట్రినిడాడ్, గయానాలలో జరగనుండగా...చివరి 2 టి20లకు ఫ్లోరిడా (అమెరికా)లోని లాడర్‌హిల్ స్టేడియం ఆతిథ్యమిస్తుంది.
చదవండి: World Cup 2023: భారత మ్యాచ్ ‘భాగ్యం’ లేదు!
Comments
Please login to add a commentAdd a comment