విండీస్‌ 421 | West Indies beat New Zealand by 91 runs in the World Cup practice | Sakshi
Sakshi News home page

విండీస్‌ 421

Published Wed, May 29 2019 3:43 AM | Last Updated on Thu, May 30 2019 1:53 PM

West Indies beat New Zealand by 91 runs in the World Cup practice - Sakshi

బ్రిస్టల్‌: న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. క్రీజులో దిగిన ప్రతి బ్యాట్స్‌మన్‌ చెలరేగి ఆడటంతో తొలుత ఆ జట్టు 49.2 ఓవర్లలో 421 పరుగులకు ఆలౌటైంది. షై హోప్‌ (86 బంతుల్లో 101; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీ చేయగా, ఓపెనర్‌ ఎవిన్‌ లూయీస్‌ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్‌), ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. క్రిస్‌ గేల్‌ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ హోల్టర్‌ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. బౌల్ట్‌కు (4/50) నాలుగు వికెట్లు దక్కాయి. ఛేదనలో వికెట్‌ కీపర్‌ బ్లండెల్‌ (89 బంతుల్లో 106; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీ, కెప్టెన్‌ విలియమ్సన్‌ (64 బంతుల్లో 85; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) మినహా మరెవరూ నిలవకపోవడంతో న్యూజిలాండ్‌ 47.2 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement