![Shreyas Iyer Smashes Huge Six At ICC Academy Ground Became Viral - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/18/ball.gif.webp?itok=_dNE0q62)
దుబాయ్: టీమిండియా ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2021 రెండో అంచె పోటీలకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం యూఏఈలో ఉన్న అయ్యర్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు. ప్రాక్టీస్ సమయంలో అతను కొట్టిన సిక్సర్ మైదానం అవతల పడింది. దీనికి సంబంధించిన వీడియోను అయ్యర్ తన ఇన్‌స్టాలో షేర్ చేయగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న శ్రేయాస్ అయ్యర్ భుజం గాయంతో ఈ సీజన్‌కు అనూహ్యంగా దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో రిషబ్ పంత్ నాయకత్వం వహించాడు.
ఈ సీజన్‌లో దుమ్మురేపిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు.. 2 ఓటములతో పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచింది. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్ 14వ సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. కాగా లీగ్‌లో రెండో అంచె పోటీలు సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానుంది. గాయం నుంచి కోలుకున్న అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు మళ్లీ నాయకత్వం వహించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment