రాహుల్.. అదుర్స్ | Rahul, Ojha shine as South Africans toil | Sakshi
Sakshi News home page

రాహుల్.. అదుర్స్

Published Fri, Oct 30 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

రాహుల్.. అదుర్స్

రాహుల్.. అదుర్స్

ఆకట్టుకున్న ఓజా, పాండ్యా
* బోర్డు ప్రెసిడెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 296 ఆలౌట్
* దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్
ముంబై: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 72; 13 ఫోర్లు) భారత తుది జట్టులోకి వచ్చే అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. నాణ్యమైన సఫారీ పేసర్ల అటాకింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. నమన్ ఓజా (80 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో శుక్రవారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 78.5 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. ఎల్గర్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వాన్‌జెల్ (18), హర్మర్ (4) నిరాశపర్చారు. శార్దూల్ రెండు వికెట్లు తీశాడు.
 
బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బోర్డు ప్రెసిడెంట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఉన్ముక్త్ చంద్ (4), పుజారా (5), శ్రేయస్ (9) విఫలంకావడంతో బోర్డు జట్టు 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్, కరుణ్ నాయర్ (70 బంతుల్లో 44; 9 ఫోర్లు) అద్భుతమైన స్ట్రోక్స్‌తో ప్రొటీస్ పేసర్లపై ఆధిపత్యం చూపెట్టారు. ఆరంభంలో నిప్పులు చెరిగిన స్టెయిన్, ఫిలాండర్ ఓవర్లలో చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు కొడుతూ నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించారు.

లంచ్ తర్వాత స్వల్ప విరామాల్లో ఈ ఇద్దరూ వెనుదిరిగినా... ఓజా, జాక్సన్ (15)లు మంచి సమన్వయంతో ఆడారు. దీంతో మరో వికెట్ పడకుండా 208/5 స్కోరుతో బోర్డు జట్టు టీకి వెళ్లింది. టీ తర్వాత హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) జయంత్ యాదవ్ (22)లు వేగంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. స్టెయిన్, హర్మర్ చెరో మూడు వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement