Pandya
-
పాండ్యా ప్రపంచ రికార్డుకు 29 ఏళ్లు
నూఢిల్లీ : క్యాన్సర్ మహ్మమారిపై అవగాహన కల్పించాడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్ వరకు కేవలం ఐదేళ్ల పసిప్రాయంలోనే రోలర్ స్కెటింగ్ చేసింది. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పింది రోలర్ స్కెటర్ షీతల్ పాండ్యా. 1989 జూన్ 7న ఆమె గిన్నిస్ బుక్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐదేళ్లప్పుడు ఆ పిడుగు సాధించిన విజయానికి నేటితో 29 ఏళ్లు నిండాయి. తన తండ్రి జగదీష్ పాండ్యాతో కలిసి అతి చిన్న వయసులో అంత దూరం రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆమె ఈ ఘనత సాధించింది. అంతే కాకుండా 2009లో కూడా ఆరు రాష్ట్రాల మీదుగా రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆడ పిల్లల రక్షణపై అవగాణ కలిగించింది. ‘సెవ్ గర్ల్ చెల్డ్’ అనే పేరుతో ఆమె ఈ ప్రయాణం సాగించింది. -
వివాదం లేకపోతే మజా ఏముంటుంది?
భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్... ఏదో ఒక రూపంలో వ్యాఖ్యనో, వివాదమో వెంట రావడం చాలా సహజం. అందులోనూ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పాత్ర లేకుండా ఏదీ జరగదేమో! రెండో వన్డేలో మరోసారి అలాంటి ఘటన జరిగింది. రిచర్డ్సన్ వేసిన 48వ ఓవర్లో నాలుగో బంతిని పాండ్యా గాల్లోకి ఆడగా కవర్స్‌లో స్మిత్ దానిని క్యాచ్ పట్టాడు. అయితే బంతి ఎత్తుపై అనుమానం ఉన్న స్మిత్ ముందు జాగ్రత్తగా రనౌట్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బౌలర్ నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో వికెట్లను పడగొట్టాడు. మరోవైపు ఎలాగూ క్యాచ్ ఇచ్చానని భావించిన పాండ్యా దీన్నంతా గమనించకుండా పెవిలియన్ వైపు నడిచాడు. అదే సమయంలో వర్షం రావడం వల్ల ఫీల్డ్ అంపైర్లు కూడా ఆ పరిణామాలపై దృష్టి పెట్టకుండా మైదానం వదిలారు. అయితే విరామం అనంతరం మూడో అంపైర్ ఆ బంతిని నోబాల్‌గా ప్రకటించడంతో పాండ్యా నాటౌట్ అని తేలింది. అలా అయితే రనౌట్‌ను ఎలా కాదంటారంటూ స్మిత్ అంపైర్లతో వాదనకు దిగాడు. తాము రనౌట్ చేసినప్పుడు బంతి ఇంకా ‘డెడ్’ కాలేదని అతను చెప్పాడు. అయితే ఐసీసీ నిబంధనల (27.7) ప్రకారం... అంపైర్ అవుట్‌గా ప్రకటించక ముందే బ్యాట్స్‌మన్ తనకు తాను అవుటైనట్లు భావించి మైదానం వీడినప్పుడు, ఈ విషయంలో అంపైర్ సంతృప్తి చెందితే... తాను జోక్యం చేసుకొని తర్వాతి పరిణామాలను చెల్లనివిగా పరిగణిస్తూ బ్యాట్స్‌మన్‌ను తిరిగి క్రీజ్‌లోకి పిలవవచ్చు. అంపైర్ నిర్ణయం స్మిత్‌లో మళ్లీ అసహనం పెంచిందనడంలో సందేహం లేదు. -
తొలి వన్డేలో భారత్ జయభేరి
-
తొలి వన్డేలో భారత్ జయభేరి
-
'హార్దిక' విజయం
►తొలి వన్డేలో భారత్ జయభేరి ►పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ రాణించిన ధోని ►భారత బౌలర్ల జోరు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ జోరు... ధోని సమయోచిత ప్రదర్శన... బౌలర్ల సమష్టి కృషి వెరసి భారత్‌కు ఆస్ట్రేలియాపై శుభారంభాన్ని అందించాయి. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా... పాండ్యా, ధోని జోడి ముందుగా మన జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందిస్తే... ఆ తర్వాత చహల్, కుల్దీప్ మణికట్టు మాయాజాలం కంగారూలను కట్టి పడేసింది. మరో పది నిమిషాల పాటు వర్షం పడితే మ్యాచ్ రద్దయ్యే స్థితి నుంచి చివరకు విజయం భారత్ వైపు నిలిచింది. టి20 తరహా ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన ఆసీస్ పేలవ బ్యాటింగ్‌తో చేతులెత్తేసింది. చెన్నై: శ్రీలంకపై సూపర్ ప్రదర్శన తర్వాత అదే జోరును సొంతగడ్డపై కూడా భారత్ కొనసాగించింది. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌లో తొలి విజయంతో సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత్ 26 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయీస్ ప్రకారం) ఆసీస్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హార్దిక్ పాండ్యా (66 బంతుల్లో 83; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), ఎమ్మెస్ ధోని (88 బంతుల్లో 79; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించారు. అనంతరం భారీ వర్షం కారణంగా సుదీర్ఘ సమయం పాటు మ్యాచ్ ఆగిపోయింది. ఎట్టకేలకు వాన ఆగిన తర్వాత ఆసీస్ విజయ లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా నిర్దేశించారు. ఆ జట్టు చివరకు 21 ఓవర్లలో 9 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా...చహల్‌కు 3 వికెట్లు దక్కాయి. రెండో వన్డే గురువారం కోల్‌కతాలో జరుగుతుంది. కూల్టర్ నీల్ జోరు... 11 పరుగులకు 3 వికెట్లు... చిదంబరం స్టేడియంలోని పిచ్ ఆరంభంలో బౌన్స్‌కు అనుకూలించడంతో భారత్ పరిస్థితి ఇది. ఆసీస్ పేసర్లు కమిన్స్, కూల్టర్ నీల్ తమ పదునైన బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా నిరోధించగలిగారు. ముఖ్యంగా కూల్టర్ నీల్ బంతులను అంచనా వేయడంలో పొరబడిన తొలి ముగ్గురు బ్యాట్స్‌మెన్ డ్రైవ్‌లు ఆడబోయి అవుటయ్యారు. ముందుగా రహానే (5) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా...ఆ తర్వాత బ్యాక్వర్డ్ పాయింట్లో మ్యాక్స్‌వెల్ అద్భుత క్యాచ్‌కు కోహ్లి (0) డకౌటయ్యాడు. రెండు బంతుల అనంతరం మనీశ్ పాండే (0) కూడా కెప్టెన్‌ను అనుసరించాడు. అంతకుముందే 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్లిప్‌లో స్మిత్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన రోహిత్ శర్మ (44 బంతుల్లో 28; 3 ఫోర్లు), కేదార్ జాదవ్ (54 బంతుల్లో 40; 5 ఫోర్లు) కలిసి ఈ దశలో పరిస్థితిని చక్క దిద్దే ప్రయత్నం చేశారు. నెమ్మదిగా ఆడుతూ వచ్చిన రోహిత్ చివరకు భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్ స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. కేదార్ కూడా కొద్ది సేపటికి పెవిలియన్ చేరడంతో భారత్ స్కోరు 87/5 వద్ద నిలిచింది. కీలక భాగస్వామ్యం... వరుస వికెట్లు పడిన తర్వాత జట్టును ఆదుకోవాల్సిన బాధ్యతను సీనియర్ ధోని, జూనియర్ పాండ్యా తీసుకున్నారు. ఈ ప్రయత్నంలో మధ్యలో కొద్దిసేపు పెద్దగా పరుగులే రాలేదు. అనంతరం పాండ్యా దూకుడుగా చెలరేగిపోగా, మరో ఎండ్‌లో ధోని ఓపిగ్గా, ప్రశాంతంగా ఆడే ప్రయత్నం చేశాడు. కూల్టర్ నీల్ బౌలింగ్‌లో 13 పరుగుల వద్ద పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో స్మిత్ వదిలేయడం కూడా భారత్‌కు కలిసొచ్చింది. ముఖ్యంగా జంపా బౌలింగ్‌ను చితక్కొట్టిన పాండ్యా, ఈ క్రమంలో 48 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరకు జంపా బౌలింగ్‌లో పాండ్యా వెనుదిరగడంతో 118 పరుగుల ఆరో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత ధోని వంతు వచ్చింది. తన తొలి 66 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా లేకుండా 40 పరుగులు చేసిన ధోని...ఆ తర్వాత ఆడిన 22 బంతుల్లోనే 39 పరుగులు చేశాడు. 75 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్న ధోని...ఫాల్క్‌నర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. మరోవైపు నుంచి భువనేశ్వర్ (30 బంతుల్లో 32 నాటౌట్; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో భారత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. మ్యాక్సీ మినహా... టి20 తరహా లక్ష్య ఛేదనలో హిట్టర్లు ఉన్న ఆస్ట్రేలియా జట్టుకు మంచి విజయావకాశాలు కనిపించాయి. అయితే కార్ట్‌రైట్ (1)ను బుమ్రా బౌల్డ్ చేసి భారత్‌కు శుభారంభం అందించిన తర్వాత ఆ జట్టు ఏ దశలోనూ గెలుపు దిశగా సాగినట్లు కనిపించలేదు. వార్నర్ (28 బంతుల్లో 25; 2 ఫోర్లు) తన సహజశైలికి భిన్నంగా ఆడటం ఆ జట్టుకు ఉపయోగపడకపోగా...స్మిత్ (1), హెడ్ (5), స్టొయినిస్ (3), వేడ్ (9) వరుస కట్టి విఫలమయ్యారు. ఇన్నింగ్స్‌లో ఒక దశలో మ్యాక్స్‌వెల్ మెరుపు బ్యాటింగ్ మాత్రం ఆసీస్ విజయంపై ఆశలు రేపింది. కుల్దీప్ వేసిన ఓవర్లో అతను 3 సిక్సర్లు, 1 ఫోర్‌తో 22 పరుగులు రాబట్టాడు. అయితే అదే జోరులో మ్యాక్స్‌వెల్ డీప్‌లో క్యాచ్ ఇచ్చి అవుటైన తర్వాత కం గారూలు కోలుకోలేకపోయారు. చివర్లో ఫా ల్క్నర్ (25 బంతుల్లో 32 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పోరాడినా లాభం లేకపోయింది. పాండ్యా మెరుపులు ఆసీస్ లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా వేసిన 37వ ఓవర్లో హార్దిక్ పాండ్యా విశ్వరూపం ప్రదర్శించాడు. రెండో బంతిని ఫోర్‌గా మలచిన అతను తర్వాతి మూడు బంతులను వరుసగా 6, 6, 6 కొట్టాడు. ఇందులో రెండో సిక్సర్ స్టేడియం పైకప్పును తాకింది. ఈ ఓవర్లో భారత్‌కు మొత్తం 24 పరుగులు లభించాయి. ‘హ్యాట్రిక్’ సిక్సర్లు కొట్టడం పాండ్యా స్వల్ప అంతర్జాతీయ కెరీర్లో ఇది నాలుగోసారి కావడం విశేషం. చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు పాక్‌పై, ఆ తర్వాత శ్రీలంకపై టెస్టు మ్యాచ్‌లో అతను ఈ ఫీట్ ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ కూడా కుల్దీప్ బౌలింగ్‌లో సరిగ్గా ఇదే తరహాలో వరుసగా 4, 6, 6, 6తో చెలరేగడం యాదృచ్ఛికం. ►100 మూడు ఫార్మాట్లు కలిపి అంతర్జాతీయ క్రికెట్లో ధోని అర్ధసెంచరీల సంఖ్య. ధోని టెస్టుల్లో 33, వన్డేల్లో 66, టి20ల్లో ఒక అర్ధ సెంచరీ సాధించాడు. -
ఆస్ట్రేలియా శుభారంభం
తొలి ఇన్నింగ్స్‌లో 327/5 స్మిత్, మార్ష్ సెంచరీలు భారత్ ‘ఎ’తో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: భారత పర్యటనను ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత్ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్ లభించింది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (161 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్), షాన్ మార్ష్ (173 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్‌లో మిషెల్ మార్ష్ (16 బ్యాటింగ్), వేడ్ (7 బ్యాటింగ్) ఉన్నారు. భారత యువ బౌలర్లు తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత్ ‘ఎ’ జట్టులోకి ఎంపికైన హైదరాబాద్ క్రికెటర్లు సిరాజ్, రాహుల్ సింగ్‌లకు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం మాత్రం దక్కలేదు. సైనీకి 2 వికెట్లు... టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్‌తో తొలి టెస్టు తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న టాప్–5 బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగిన ఆసీస్... ప్రధాన పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది. ఢిల్లీకి చెందిన పేసర్ నవదీప్ సైనీ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన షార్ట్ బాల్‌ను వార్నర్ (30 బంతుల్లో 25; 4 ఫోర్లు) సరిగా ఆడలేకపోవడంతో ఎడ్జ్ తీసుకొని గాల్లో లేచిన బంతిని కీపర్ ఇషాన్ అందుకున్నాడు. మరి కొద్దిసేపటికే సైనీ బౌలింగ్‌లోనే దూరంగా వెళుతున్న బంతిని ఆడి రెన్షా (11) కీపర్‌కే క్యాచ్ ఇచ్చాడు. భారీ భాగస్వామ్యం... 55/2 స్కోరు వద్ద జత కలిసిన స్మిత్, షాన్‌మార్ష్ స్వేచ్ఛగా ఆడారు. వీరిద్దరు పేస్, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒక్క ఓవర్ కూడా వేయకుండానే ఆఫ్ స్పిన్నర్ కృష్ణప్ప గౌతమ్ గాయంతో మ్యాచ్ నుంచి తప్పుకోగా... లెఫ్టార్మ్ స్పిన్నర్ షాబాజ్ నదీమ్ వీరిద్దరిని కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్లో 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్న స్మిత్... 154 బంతుల్లో 15వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 40.5 ఓవర్లలో 156 పరుగులు జోడించిన అనంతరం స్మిత్ రిటైర్డ్ అవుట్‌గా తప్పుకున్నాడు. 88 పరుగుల వద్ద సైనీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన షాన్ మార్ష్ కూడా కొద్ది సేపటికే కెరీర్లో 21వ శతకం అందుకొని స్వచ్ఛందంగా వెనుదిరిగాడు. మార్ష్ , హ్యాండ్స్కోంబ్ (70 బంతుల్లో 45; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 79 పరుగులు జత చేశారు. భారత్ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే హ్యాండ్స్‌కోంబ్‌ను పాండ్యా అవుట్ చేశాడు. చివర్లో మిషెల్ మార్ష్ వేడ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: వార్నర్ (సి) ఇషాన్ (బి) సైనీ 25; రెన్షా (సి) ఇషాన్ (బి) సైనీ 11; స్మిత్ (రిటైర్డ్ అవుట్) 107; షాన్ మార్‡్ష (రిటైర్డ్ అవుట్) 104; హ్యాండ్స్కోంబ్ (సి) పాంచల్ (బి) పాండ్యా 45; మిషెల్ మార్‡్ష (బ్యాటింగ్) 16; వేడ్ (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 327. వికెట్ల పతనం: 1–33; 2–55; 3–211; 4–290; 5–305. బౌలింగ్: అశోక్ దిండా 15.2–1–49–0; హార్దిక్ పాండ్యా 17–3–64–1; సైనీ 12.4–4–27–2; నదీమ్ 23–0–90–0; అఖిల్ హేర్వాడ్కర్ 11–0–48–0; శ్రేయస్ అయ్యర్ 7–0–32–0; ప్రియాంక్ పాంచల్ 4–0–11–0. -
రోహిత్, ధావన్, రాహుల్ ఔట్..
ఇంగ్లండ్ తో త్వరలో ప్రారంభంకానున్న ఐదు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టులకు టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్ లో భారత్ కొందరు ప్రధాన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదు. స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో గాయపడ్డ టీమిండియా ఓపెనర్లు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ లు తొలి రెండు టెస్టులకు దూరం కానున్నారు. వీరితో పాటు విండీస్ తో సిరీస్ లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన రోహిత్ శర్మనూ గాయాలు వెంటాడుతుండటంతో చోటు దక్కించుకోలేపోయాడు. ఫామ్ లోకి వచ్చారంటే ఈ ముగ్గురూ మ్యాచ్ పై ప్రభావం చూపగల ప్రతిభావంతులే. వెస్టిండీస్ తో సిరీస్ లో రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన గౌతమ్ గంభీర్ పై సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంచింది. రెండేళ్ల కిందట ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత గంభీర్ కు అవకాశాలు దక్కలేదన్న విషయం తెలిసిందే. తాజాగా విండీస్ పై మూడో టెస్టులో తన ఫామ్ మరోసారి నిరూపించుకోవడంతో గౌతీకి అవకాశమిచ్చారు. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో మురళీ విజయ్ కి మళ్లీ చాన్స్ ఇచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన హార్థిక్ పాండ్యాతో పాటు జయంత్ యాదవ్ కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. -
వన్స్‌మోర్
► భారత్, బంగ్లా ఫైనల్ పోరు నేడు ఆత్మవిశ్వాసంతో ధోనిసేన ► సంచలనం కోసం బంగ్లా తహతహ ఆసియా కప్ టి20 టోర్నీ సరిగ్గా పది రోజుల క్రితం బంగ్లాదేశ్‌పై ఘనంగా గెలిచి ఆసియా కప్‌ను మొదలుపెట్టిన భారత్... ఆ తర్వాత టోర్నీ మొత్తం తన సత్తా చూపెట్టింది. ప్రత్యర్థులందర్నీ చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు టైటిల్ పోరులో మళ్లీ బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. మరోసారి టోర్నీ తొలి మ్యాచ్ ఫలితాన్ని ధోనిసేన పునరావృతం చేస్తే ఆసియాకప్‌తో ఘనంగా స్వదేశానికి వచ్చి ప్రపంచకప్ సమరాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించొచ్చు. మిర్పూర్: బంగ్లాదేశ్ జట్టు ఏడాది కాలంగా సొంతగడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతోంది. ప్రస్తుత ఆసియాకప్ టి20 టోర్నీలోనూ ఒక్క భారత్ మినహా అన్ని జట్లపై గెలిచింది. ఇందులో పాకిస్తాన్, శ్రీలంకలాంటి బలమైన జట్లపై విజయాలు ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. దీనికితోడు స్టేడియాన్ని హోరెత్తించే అభిమానుల మద్దతు కూడా వారికే ఉంటుంది. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో ధోనిసేన ఏమాత్రం అలసత్వం చూపకుండా బంగ్లాను మరోసారి కొట్టేయాలి. ఫామ్ పరంగా భారత్ ఈ మ్యాచ్‌లో తిరుగులేని ఫేవరెట్. అయితే అనిశ్చితికి మారుపేరైన టి20 ఫార్మాట్లో భారత్‌నూ ఓడించి ఓ పెద్ద టైటిల్ గెలవాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. మళ్లీ పాత జట్టే యూఏఈతో మ్యాచ్‌కు రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చిన ధోని... ఫైనల్‌కు మాత్రం మళ్లీ పాత జట్టునే బరిలోకి దించనున్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఓపెనర్లలో రోహిత్ ఇప్పటికే టోర్నీలో 137 పరుగులు చేసినా.. ధావన్ చెలరేగాల్సి ఉంది. కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తుండగా, రైనా కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. శ్రీలంక, యూఏఈలపై మంచి ఇన్నింగ్స్ ఆడి ఒత్తిడి తగ్గించుకున్న యువరాజ్ ఈ మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తుండటం భారత్‌కు అదనపు బలం. జడేజా బ్యాట్ మెరవకపోయినా... బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. కీలక వికెట్లతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు చూపెడుతున్నాడు. ఇక ప్రధాన స్పిన్నర్ అశ్విన్ తన బాధ్యత మరోసారి సమర్థంగా నిర్వర్తిస్తే టీమిండియాకు తిరుగుండదు. పేసర్లు నెహ్రా, జస్ప్రీత్ బూమ్రాలు అంచనాలకు అనుగుణంగా రాణిస్తుండటం అనుకూలాంశం. ఓవరాల్‌గా జట్టుపై కెప్టెన్ ధోని పూర్తి విశ్వాసం చూపెట్టడం శుభసూచకం. గాయాల బెడద మరోవైపు బంగ్లాదేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ టోర్నీ నుంచి వైదొలగగా, ఆల్‌రౌండర్ షకీబ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆడటంపై అనిశ్చితి నెలకొంది. అయితే పాక్‌తో ఆడిన తుది జట్టునే ఫైనల్‌కు కొనసాగించాలని మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ స్లో వికెట్‌ను ఎంచుకుంటే మాత్రం స్పిన్నర్ అరాఫత్ సన్నీ చోటు నిలబెట్టుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉన్నా కీలక సమయంలో తడబడటం ఆందోళనగా మారింది. తమీమ్ ఇక్బాల్ ఇంతవరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహమాన్‌లు పోరాడుతున్నా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతున్నారు. ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా మరోసారి కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్ట్రయిక్ బౌలర్ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమిన్ హుస్సేన్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. తస్కిన్, మోర్తజా, షకీబ్‌లు గాడిలో పడాల్సి ఉంది. అంచనాలకు మించి రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ను కట్టడి చేయడం బంగ్లాకు అంత సులువుకాదు. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. బంగ్లాదేశ్: మోర్తజా (కెప్టెన్), తమీమ్, సౌమ్య, షబ్బీర్, ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా, మిథున్, అల్ అమిన్, సన్నీ, తస్కిన్. పిచ్, వాతావరణం టోర్నీ ఆరంభంతో పోలిస్తే పిచ్‌లు క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయి. అలాగే మంచు కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వర్షం ముప్పేమీ లేదు. బంగ్లాదేశ్‌తో ఫైనల్ కూడా ఓ మామూలు మ్యాచ్‌లాంటిదే. భారత జట్టులో ప్రతి ఒక్కరికీ అనుభవం ఉంది కాబట్టి ప్రతి జట్టును, ప్రతి మ్యాచ్‌ను ఒకేలా చూశాం. అయితే తొలి మ్యాచ్‌లో బంగ్లాపై గెలవడం మాకు కలిసొచ్చింది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో మేం చివరి 10 ఓవర్ల వరకూ ఒత్తిడిలోనే ఆడాం. ఇక తర్వాతి మ్యాచ్‌ల్లో మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. మా బ్యాటింగ్, బౌలింగ్ బాగా పని చేశాయి. ఎలాంటి పిచ్‌లు ఇస్తారనేది మన చేతుల్లో లేదు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. - రవిశాస్త్రి (భారత్ టీమ్ డెరైక్టర్) 1 భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒక పెద్ద టోర్నీ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి ఈ మ్యాచ్‌లో భారత్ జట్టే ఫేవరెట్. ఇందులో ఎలాంటి చర్చకు తావులేదు. అయితే ఇక్కడి అభిమానులు, పరిస్థితులు, పిచ్ మాకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో చివరి వరకు పోరాడేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికీ మా జట్టులో టి20 స్టార్ లేడు. అయినా మేమంతా సమష్టిగా రాణించి విజయాలు సాధిస్తున్నాం. - మోర్తజా (బంగ్లా కెప్టెన్) -
రాహుల్.. అదుర్స్
ఆకట్టుకున్న ఓజా, పాండ్యా * బోర్డు ప్రెసిడెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 296 ఆలౌట్ * దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 72; 13 ఫోర్లు) భారత తుది జట్టులోకి వచ్చే అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. నాణ్యమైన సఫారీ పేసర్ల అటాకింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. నమన్ ఓజా (80 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో శుక్రవారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 78.5 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. ఎల్గర్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వాన్‌జెల్ (18), హర్మర్ (4) నిరాశపర్చారు. శార్దూల్ రెండు వికెట్లు తీశాడు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బోర్డు ప్రెసిడెంట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఉన్ముక్త్ చంద్ (4), పుజారా (5), శ్రేయస్ (9) విఫలంకావడంతో బోర్డు జట్టు 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్, కరుణ్ నాయర్ (70 బంతుల్లో 44; 9 ఫోర్లు) అద్భుతమైన స్ట్రోక్స్‌తో ప్రొటీస్ పేసర్లపై ఆధిపత్యం చూపెట్టారు. ఆరంభంలో నిప్పులు చెరిగిన స్టెయిన్, ఫిలాండర్ ఓవర్లలో చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు కొడుతూ నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత స్వల్ప విరామాల్లో ఈ ఇద్దరూ వెనుదిరిగినా... ఓజా, జాక్సన్ (15)లు మంచి సమన్వయంతో ఆడారు. దీంతో మరో వికెట్ పడకుండా 208/5 స్కోరుతో బోర్డు జట్టు టీకి వెళ్లింది. టీ తర్వాత హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) జయంత్ యాదవ్ (22)లు వేగంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. స్టెయిన్, హర్మర్ చెరో మూడు వికెట్లు తీశారు. -
కృష్ణా డెల్డాకు తక్షణం నీరు విడుదల
హైదరాబాద్: నల్గొండ, కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం తక్షణం నీటిని విడుదల చేయాలని కృష్ణా వాటర్ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. బోర్డ్ చైర్మన్ పాండ్య అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. గత పదేళ్ల కృష్ణా జలాల విడుదలపై నివేదిక ఇవ్వాలని పాండ్య అధికారులను ఆదేశించారు. తాగునీటి జలాల విడుదల పై పది రోజుల తర్వాత మరో సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. -
సీఎస్‌లతో కేంద్ర జలసంఘం కార్యదర్శి భేటీ
-
సీఎస్‌లతో కేంద్ర జలసంఘం కార్యదర్శి భేటీ
హైదరాబాద్ : కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి పాండ్య మంగళవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో విడి విడిగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మలతో కృష్ణా జలాలపై సమీక్ష నిర్వహించారు. నీటి విడుదల వివాదంపై రెండు ప్రభుత్వాలతో పాండ్య చర్చించారు. కాగా కృష్ణా డెల్టాకు నీటి విడుదల విషయంలో తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ఉంది. రాష్ట్రా స్థాయి కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈనెల 25 నుంచి నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీల నీటిని డెల్టాకు విడుదల చేయాల్సి ఉంది. గడువు దగ్గరకు వస్తున్నా... ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నీటి విడుదల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ వివాదంపై కేంద్ర జలసంఘం ఇరు ప్రభుత్వాలతో చర్చలు జరిపి ఓ కొలిక్కి తీసుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ నరసింహన్‌ను కూడా పాండ్యా కలిసే అవకాశం ఉంది.