
రోహిత్, ధావన్, రాహుల్ ఔట్..
ఇంగ్లండ్ తో త్వరలో ప్రారంభంకానున్న ఐదు టెస్టుల సిరీస్ లో రెండు టెస్టులకు టీమిండియాను ఎంపిక చేశారు. అయితే ఈ సిరీస్ లో భారత్ కొందరు ప్రధాన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోలేదు. స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ లో గాయపడ్డ టీమిండియా ఓపెనర్లు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్ లు తొలి రెండు టెస్టులకు దూరం కానున్నారు. వీరితో పాటు విండీస్ తో సిరీస్ లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించిన రోహిత్ శర్మనూ గాయాలు వెంటాడుతుండటంతో చోటు దక్కించుకోలేపోయాడు. ఫామ్ లోకి వచ్చారంటే ఈ ముగ్గురూ మ్యాచ్ పై ప్రభావం చూపగల ప్రతిభావంతులే.
వెస్టిండీస్ తో సిరీస్ లో రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన గౌతమ్ గంభీర్ పై సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంచింది. రెండేళ్ల కిందట ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత గంభీర్ కు అవకాశాలు దక్కలేదన్న విషయం తెలిసిందే. తాజాగా విండీస్ పై మూడో టెస్టులో తన ఫామ్ మరోసారి నిరూపించుకోవడంతో గౌతీకి అవకాశమిచ్చారు. ప్రధాన ఆటగాళ్లు లేకపోవడంతో మురళీ విజయ్ కి మళ్లీ చాన్స్ ఇచ్చారు. ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన సిరీస్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన హార్థిక్ పాండ్యాతో పాటు జయంత్ యాదవ్ కు టెస్టు అరంగేట్రం చేసే అవకాశం లభించింది.