ఆస్ట్రేలియా శుభారంభం | Australia :Smith, Marsh centuries | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా శుభారంభం

Published Fri, Feb 17 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 3:57 AM

ఆస్ట్రేలియా శుభారంభం

ఆస్ట్రేలియా శుభారంభం

తొలి ఇన్నింగ్స్‌లో 327/5
స్మిత్, మార్ష్  సెంచరీలు
భారత్‌ ‘ఎ’తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌


ముంబై: భారత పర్యటనను ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసంతో ప్రారంభించింది. భారత్‌ ‘ఎ’తో శుక్రవారం ప్రారంభమైన మూడు రోజుల మ్యాచ్‌లో ఆ జట్టు బ్యాట్స్‌మెన్‌కు మంచి ప్రాక్టీస్‌ లభించింది. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (161 బంతుల్లో 107; 12 ఫోర్లు, 1 సిక్స్‌), షాన్‌ మార్ష్  (173 బంతుల్లో 104; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీలు సాధించారు. ప్రస్తుతం క్రీజ్‌లో మిషెల్‌ మార్ష్  (16 బ్యాటింగ్‌), వేడ్‌ (7 బ్యాటింగ్‌) ఉన్నారు. భారత యువ బౌలర్లు తొలి రోజు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. భారత్‌ ‘ఎ’ జట్టులోకి ఎంపికైన హైదరాబాద్‌ క్రికెటర్లు సిరాజ్, రాహుల్‌ సింగ్‌లకు ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం మాత్రం దక్కలేదు.

సైనీకి 2 వికెట్లు...
టాస్‌ గెలిచిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. భారత్‌తో తొలి టెస్టు తుది జట్టులో ఉండే అవకాశం ఉన్న టాప్‌–5 బ్యాట్స్‌మెన్‌తో బరిలోకి దిగిన ఆసీస్‌... ప్రధాన పేసర్లు స్టార్క్, హాజల్‌వుడ్‌లకు ఈ మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చింది. ఢిల్లీకి చెందిన పేసర్‌ నవదీప్‌ సైనీ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన షార్ట్‌ బాల్‌ను వార్నర్‌ (30 బంతుల్లో 25; 4 ఫోర్లు) సరిగా ఆడలేకపోవడంతో ఎడ్జ్‌ తీసుకొని గాల్లో లేచిన బంతిని కీపర్‌ ఇషాన్‌ అందుకున్నాడు. మరి కొద్దిసేపటికే సైనీ బౌలింగ్‌లోనే దూరంగా వెళుతున్న బంతిని ఆడి రెన్‌షా (11) కీపర్‌కే క్యాచ్‌ ఇచ్చాడు.

భారీ భాగస్వామ్యం...
55/2 స్కోరు వద్ద జత కలిసిన స్మిత్, షాన్‌మార్ష్  స్వేచ్ఛగా ఆడారు. వీరిద్దరు పేస్, స్పిన్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. ఒక్క ఓవర్‌ కూడా వేయకుండానే ఆఫ్‌ స్పిన్నర్‌ కృష్ణప్ప గౌతమ్‌ గాయంతో మ్యాచ్‌ నుంచి తప్పుకోగా... లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ వీరిద్దరిని కట్టడి చేయడంలో విఫలమయ్యాడు. కెరీర్‌లో 100వ ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌ ఆడుతున్న స్మిత్‌... 154 బంతుల్లో 15వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మూడో వికెట్‌కు 40.5 ఓవర్లలో 156 పరుగులు జోడించిన అనంతరం స్మిత్‌ రిటైర్డ్‌ అవుట్‌గా తప్పుకున్నాడు. 88 పరుగుల వద్ద సైనీ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన షాన్‌ మార్ష్  కూడా కొద్ది సేపటికే కెరీర్‌లో 21వ శతకం అందుకొని స్వచ్ఛందంగా వెనుదిరిగాడు. మార్ష్ , హ్యాండ్స్‌కోంబ్‌ (70 బంతుల్లో 45; 3 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 79 పరుగులు జత చేశారు. భారత్‌ కొత్త బంతిని తీసుకున్న తర్వాత తొలి ఓవర్లోనే హ్యాండ్స్‌కోంబ్‌ను పాండ్యా అవుట్‌ చేశాడు. చివర్లో మిషెల్‌ మార్ష్  వేడ్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా రోజును ముగించారు.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) ఇషాన్‌ (బి) సైనీ 25; రెన్‌షా (సి) ఇషాన్‌ (బి) సైనీ 11; స్మిత్‌ (రిటైర్డ్‌ అవుట్‌) 107; షాన్‌ మార్‌‡్ష (రిటైర్డ్‌ అవుట్‌) 104; హ్యాండ్స్‌కోంబ్‌ (సి) పాంచల్‌ (బి) పాండ్యా 45; మిషెల్‌ మార్‌‡్ష (బ్యాటింగ్‌) 16; వేడ్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (90 ఓవర్లలో 5 వికెట్లకు) 327.

వికెట్ల పతనం: 1–33; 2–55; 3–211; 4–290; 5–305.
బౌలింగ్‌: అశోక్‌ దిండా 15.2–1–49–0; హార్దిక్‌ పాండ్యా 17–3–64–1; సైనీ 12.4–4–27–2; నదీమ్‌ 23–0–90–0; అఖిల్‌ హేర్వాడ్కర్‌ 11–0–48–0; శ్రేయస్‌ అయ్యర్‌ 7–0–32–0; ప్రియాంక్‌ పాంచల్‌ 4–0–11–0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement