తండ్రితో కలిసి స్కెటింగ్ చేస్తున్న షీతల్ పాండ్యా
నూఢిల్లీ : క్యాన్సర్ మహ్మమారిపై అవగాహన కల్పించాడానికి దేశ రాజధాని ఢిల్లీ నుంచి అహ్మాదాబాద్ వరకు కేవలం ఐదేళ్ల పసిప్రాయంలోనే రోలర్ స్కెటింగ్ చేసింది. అత్యంత పిన్న వయసులోనే ప్రపంచ రికార్డు నెలకొల్పింది రోలర్ స్కెటర్ షీతల్ పాండ్యా. 1989 జూన్ 7న ఆమె గిన్నిస్ బుక్‌లో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఐదేళ్లప్పుడు ఆ పిడుగు సాధించిన విజయానికి నేటితో 29 ఏళ్లు నిండాయి.
తన తండ్రి జగదీష్ పాండ్యాతో కలిసి అతి చిన్న వయసులో అంత దూరం రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆమె ఈ ఘనత సాధించింది. అంతే కాకుండా 2009లో కూడా ఆరు రాష్ట్రాల మీదుగా రోలర్ స్కెటింగ్ చేస్తూ ఆడ పిల్లల రక్షణపై అవగాణ కలిగించింది. ‘సెవ్ గర్ల్ చెల్డ్’ అనే పేరుతో ఆమె ఈ ప్రయాణం సాగించింది.
Comments
Please login to add a commentAdd a comment