
సాక్షి, తిరుపతి: ప్రపంచ రికార్డు కోసం ఎనిమిదేళ్ల బాలుడు స్కేటింగ్ యాత్ర చేస్తున్నాడు. ఏర్పేడుకు చెందిన వేదనరసింహ సోమవారం ఉదయం ఏర్పేడు నుంచి రోలర్ స్కేటింగ్ యాత్ర ప్రారంభించాడు. వెంకటగిరి, రాపూరు, పెంచలకోన, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, నెల్లూరు, గూడూరు మీదుగా మొత్తం 270 కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. సోమవారం మధ్యాహ్నానికి కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చేరుకుంది.
ఉయ్యాలపల్లి పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు వేదనరసింహకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలుడి కోచ్ ప్రతాప్ వివరాలు వెల్లడిస్తూ.. ఇప్పటి వరకు కర్ణాటకకు చెందిన వెన్సికసిరి అనే ఎనిమిదేళ్ల బాలిక 2022 ఫిబ్రవరిలో 250 కి.మీ. నాన్‌స్టాప్ సోలో స్కేటింగ్ చేసి వరల్డ్ రికార్డు సాధించిందని, ఆ రికార్డును అధిగమించేందుకు వేదనరసింహ 270 కి.మీ స్కేటింగ్ యాత్ర చేస్తున్నట్టు చెప్పారు.
చదవండి: జనం మధ్యకు పులి కూనలు..24 గంటలు గడిచిన తల్లి జాడ లేదు!
Comments
Please login to add a commentAdd a comment