నల్గొండ, కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం తక్షణం నీటిని విడుదల చేయాలని కృష్ణా వాటర్ బోర్డ్ సమావేశం నిర్ణయించింది.
హైదరాబాద్: నల్గొండ, కృష్ణా డెల్టాకు తాగునీటి అవసరాల కోసం తక్షణం నీటిని విడుదల చేయాలని కృష్ణా వాటర్ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. బోర్డ్ చైర్మన్ పాండ్య అధ్యక్షతన జరిగిన సమావేశం ముగిసింది. గత పదేళ్ల కృష్ణా జలాల విడుదలపై నివేదిక ఇవ్వాలని పాండ్య అధికారులను ఆదేశించారు.
తాగునీటి జలాల విడుదల పై పది రోజుల తర్వాత మరో సారి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.