Ojha
-
బెంగాల్‌తో ఓజా ‘ఆట’ ముగిసింది!
రంజీ జట్టులో దక్కని చోటు కోల్‌కతా: హైదరాబాద్‌కు చెందిన లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా దేశవాళీ కెరీర్ స్వయంకృతంతో ప్రమాదంలో పడింది. రంజీ ట్రోఫీలో పాల్గొనే బెంగాల్ జట్టును మంగళవారం ప్రకటించినా... అందులో ఓజాకు చోటు దక్కలేదు. అతడు చాలా రోజులుగా తమకు అందుబాటులోనే లేడని, అందువల్ల ఓజా గురించి కనీసం చర్చించలేదని బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు. ఇటీవల బెంగాల్ జట్టు కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణా శిబిరానికి కూడా ఓజా హాజరు కాలేదు. హైదరాబాద్ తరఫున రెగ్యులర్‌గా రంజీ ఆడిన ఓజా 2015–16, 2016–17 సీజన్లలో బెంగాల్‌కు ఆడాడు. తమకు లెఫ్టార్మ్ స్పిన్నర్ అవసరం ఉందంటూ సౌరవ్ గంగూలీ స్వయంగా ఓజాను పిలిచి ప్రోత్సహించారు. అయితే ఈ ఏడాది సొంత జట్టు హైదరాబాద్‌కు ఆడేందుకు ఆసక్తి చూపించిన ఓజాకు నిరభ్యంతరకర పత్రం ఇచ్చేందుకు గంగూలీ నిరాకరించారు. అప్పటి నుంచి అతను ‘క్యాబ్’ అధికారులకు అందుబాటులో లేకుంండా పోయాడు. ట్విట్టర్లో మాత్రం అతను తరచుగా పోస్టింగ్‌లు పెడుతూ చురుగ్గా ఉండటం విశేషం. బెంగాల్ తిరస్కరించడంతో ఈ ఏడాది ఏ జట్టుకు కూడా రంజీలు ఆడే అవకాశం లేని ఓజా కెరీర్ ఇక ముందు కూడా కొనసాగడం కష్టంగా కనిపిస్తోంది. భారత్ తరఫున 24 టెస్టుల్లో 113 వికెట్లు పడగొట్టిన ఓజా... 18 వన్డేల్లో 21 వికెట్లు, 6 టి20 మ్యాచ్‌లలో 10 వికెట్లు తీశాడు. -
రాయుడు, ఓజా వచ్చేశారు
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ కొత్త సీజన్‌కు ముందు హైదరాబాద్ జట్టు కోసం ప్రాక్టీస్ మ్యాచ్‌లు నిర్వహించేందుకు హెచ్‌సీఏ సిద్ధమైంది. ఇందులో భాగంగా హైదరాబాద్, విదర్భ క్రికెట్ అసోసియేషన్ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌లు ఈ నెల 24 నుంచి ఆగస్ట్ 2 వరకు జరుగుతాయి. ఇందులో తలపడే హైదరాబాద్ జట్టును బుధవారం ప్రకటించారు. గత ఏడాది వరకు హైదరాబాద్‌కు దూరంగా ఉన్న అంబటి రాయుడు, ప్రజ్ఞాన్ ఓజా తిరిగి జట్టులోకి రావడం విశేషం. రాయుడు... ఆంధ్ర, బరోడా, విదర్భ జట్ల తరఫున ఆడగా, ఓజా బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. దాదాపు ఇదే జట్టు రంజీ ట్రోఫీకి కూడా ఎంపికయ్యే అవకాశం ఉండటంతో వీరిద్దరి పునరాగమనం ఖాయమైంది. జట్టు: అంబటి రాయుడు, అక్షత్ రెడ్డి, బి. సందీప్, తన్మయ్ అగర్వాల్, ఠాకూర్ తిలక్‌వర్మ, ఆకాశ్ భండారి, ప్రజ్ఞాన్ ఓజా, సీవీ మి లింద్, రవికిరణ్, కె.సుమంత్, మెహదీ హసన్, ఆశిష్ రెడ్డి, విశాల్ శర్మ, రోహిత్ రా యుడు, ముదస్సిర్ హుస్సేన్. స్టాండ్ బైస్: పి.రోహిత్ రెడ్డి, శ్రవణ్ కుమార్, కోచ్: అర్జున్ యాదవ్. హెచ్‌సీఏ సెలక్షన్స్ వాయిదా: నగరంలోని వివిధ మైదానాల్లో నేడు, రేపు జరగాల్సిన హెచ్‌సీఏ ఎ2–డివిజన్ రెండు రోజుల లీగ్ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. అలాగే రెండు రోజుల లీగ్ జట్ల కోసం హెచ్‌సీఏ నిర్వహించాలనుకున్న ఓపెన్ సెలక్షన్స్ కూడా వాయిదా పడ్డాయి. జింఖానా గ్రౌండ్స్‌లో ఈ నెల 24వ తేదీన సెలక్షన్స్ నిర్వహిస్తారు. -
గంభీర్ గర్జన
♦ నైట్‌రైడర్స్ అలవోక విజయం ♦ 8 వికెట్లతో ఓడిన సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అందరూ కలిసి 9 ఫోర్లు కొడితే... కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఒక్కడే 13 ఫోర్లు బాదాడు. మ్యాచ్‌పై అతని ఆధిపత్యం ఎలా సాగిందనేదానికి ఇది ఉదాహరణ. ముందు మెరుగైన బౌలింగ్ వ్యూహాలతో రైజర్స్‌ను కట్టడి చేసిన అతను... ఆ తర్వాత చక్కటి బ్యాటింగ్‌తో జట్టును నడిపించి మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశాడు. ఫలితంగా ఐపీఎల్-9లో కోల్‌కతాకు రెండో విజయం దక్కగా, హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లో చివరిసారిగా 2014 ఐపీఎల్లో తలపడ్డాయి. నాడు కూడా సన్‌రైజర్స్ సరిగ్గా 142 పరుగులే చేస్తే... గంభీర్ సేన అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్లతో నెగ్గింది. సీజన్ మారినా ఫలితంలో మాత్రం మార్పు లేదు. సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్లో సొంతగడ్డపై విజయాల బోణీ చేయాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశ నెరవేరలేదు. గంభీర్ సేన జోరు ముందు లీగ్‌లో సన్‌కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇయాన్ మోర్గాన్ (43 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ ఓజా (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం కోల్‌కతా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గౌతం గంభీర్ (60 బంతుల్లో 90 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. గంభీర్, ఉతప్ప (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్‌కు 75 బంతుల్లో 92 పరుగులు జత చేయడంతో జట్టుకు ఛేదనలో ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. తమ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సోమవారం ముంబైతో ఇదే మైదానంలో ఆడుతుంది. ఆదుకున్న మోర్గాన్, ఓజా సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6) మరోసారి విఫలం కాగా... ఇన్నింగ్స్ రెండో బంతికే అవుటైనా నోబాల్ కావడంతో బతికిపోయిన వార్నర్ (13) ఆ అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. వీరిద్దరు ఐదు బంతుల వ్యవధిలో అవుట్ కాగా, హెన్రిక్స్ (6), హుడా (6) కూడా నిలవలేకపోయారు. పవర్‌ప్లేలో హైదరాబాద్ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. 50 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో సన్‌రైజర్స్‌ను మోర్గాన్, ఓజా ఆదుకున్నారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా నరైన్ బౌలింగ్‌లో మోర్గాన్ వరుసగా రెండు ఫోర్లు, ఓజా సిక్సర్ కొట్టి ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మోర్కెల్ బౌలింగ్‌లో ఇద్దరూ చెరో సిక్స్ బాదారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 67 బౌలింగ్‌లో జోడించిన తర్వాత రసెల్ అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యానికి ఓజా వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లోనే మోర్గాన్ కూడా అవుటయ్యాడు. 13 ఓవర్ల వరకు ఒక్క ఓవర్లోనూ పదికి మించి పరుగులు రాబట్టలేకపోయిన హైదరాబాద్, చివరి ఐదు ఓవర్లలో 48 పరుగులు చేయడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. గంభీర్ దూకుడు ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీలలో ఒకటైన గంభీర్, ఉతప్ప మరోసారి నైట్‌రైడర్స్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరు ఏ దశలోనూ ఇబ్బందికి లోను కాకుండా సాధికారికంగా ఆడటంతో తొలి పది ఓవర్లలో జట్టు స్కోరు 72 పరుగులకు చేరింది. లీగ్‌లో ఈ జంట 9వ సారి అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఈ క్రమంలో గంభీర్ టి20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కరణ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు బాది జోరు పెంచిన గంభీర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఎట్టకేలకు ఉతప్పను అవుట్ చేసి ఆశిష్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టగా, కొద్ది సేపటికే ముస్తఫిజుర్ అద్భుత బంతితో రసెల్ (2) వికెట్లను గిరాటేశాడు. అయితే మరో వైపు దూకుడును కొనసాగించిన గంభీర్ తన జట్టుకు రెండో విజయాన్ని అందించాడు. రెండో వికెట్ పడిన సమయానికి కోల్‌కతా విజయం కోసం 46 పరుగులు కావాల్సి ఉండగా, గంభీర్ ఒక్కడే 6 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) ఉమేశ్ 13; ధావన్ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 6; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; మోర్గాన్ (సి) షకీబ్ (బి) ఉమేశ్ 51; హుడా (సి) ఉమేశ్ (బి) రసెల్ 6; ఓజా (సి) చావ్లా (బి) మోర్కెల్ 37; ఆశిష్ రెడ్డి రనౌట్ 13; కరణ్ నాటౌట్ 2; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-18; 2-23; 3-36; 4-50; 5-117; 6-128; 7-141. బౌలింగ్: మోర్కెల్ 4-0-35-2; ఉమేశ్ 4-0-28-3; షకీబ్ 3-0-18-0; రసెల్ 4-0-19-1; నరైన్ 4-0-26-0; చావ్లా 1-0-13-0. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) ఆశిష్ 38; గంభీర్ (నాటౌట్) 90; రసెల్ (బి) ముస్తఫిజుర్ 2; పాండే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-92; 2-97. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-29-0; శరణ్ 4-0-31-0; ముస్తఫిజుర్ 4-0-29-1; కరణ్ 2.2-0-24-0; హెన్రిక్స్ 2-0-19-0; ఆశిష్ రెడ్డి 2-0-14-1. సూపర్ క్యాచ్ ఐపీఎల్లో రిలే క్యాచ్‌లు పట్టడం కొత్త కాకపోయినా... శనివారం మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు రసెల్ మరో సారి ఆ ఫీట్‌ను అద్భుతంగా చేసి చూపించాడు. మోర్కెల్ బౌలింగ్‌లో నమన్ ఓజా భారీ షాట్ కొట్టగా, బంతి గాల్లోకి చాలా ఎత్తున లేచింది. లాంగాన్‌లో ఉన్న రసెల్ అనూహ్యంగా తన ఎడమ వైపు చాలా దూరం పరుగెత్తుకొచ్చాడు. ఎట్టకేలకు ఎడమ చేత్తో దానిని అందుకున్న అతను నియంత్రణ కోల్పోయాడు. సరిగ్గా గాల్లో ఉన్న సమయంలో బంతిని మళ్లీ బౌండరీ లోపలికి విసిరేసి తప్పుకున్నాడు. దానిని కాస్త తడబడుతూనే అయినా చావ్లా అందుకోవడంతో ఓజా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత రసెల్ ప్రేక్షకుల వైపు వంగి రెండు చేతులూ జోడించి పదే పదే నమస్కారాలు చేయడం ఆకట్టుకుంది. -
రాహుల్.. అదుర్స్
ఆకట్టుకున్న ఓజా, పాండ్యా * బోర్డు ప్రెసిడెంట్ తొలి ఇన్నింగ్స్‌లో 296 ఆలౌట్ * దక్షిణాఫ్రికాతో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబై: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు లోకేశ్ రాహుల్ (132 బంతుల్లో 72; 13 ఫోర్లు) భారత తుది జట్టులోకి వచ్చే అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకున్నాడు. నాణ్యమైన సఫారీ పేసర్ల అటాకింగ్‌ను అద్భుతంగా ఎదుర్కొని ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధసెంచరీతో అదరగొట్టాడు. నమన్ ఓజా (80 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్) కూడా సమయోచితంగా ఆడటంతో శుక్రవారం ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లో బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్‌లో 78.5 ఓవర్లలో 296 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8.2 ఓవర్లలో 2 వికెట్లకు 46 పరుగులు చేసింది. ఎల్గర్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. వాన్‌జెల్ (18), హర్మర్ (4) నిరాశపర్చారు. శార్దూల్ రెండు వికెట్లు తీశాడు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... బోర్డు ప్రెసిడెంట్ టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. ఉన్ముక్త్ చంద్ (4), పుజారా (5), శ్రేయస్ (9) విఫలంకావడంతో బోర్డు జట్టు 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే రాహుల్, కరుణ్ నాయర్ (70 బంతుల్లో 44; 9 ఫోర్లు) అద్భుతమైన స్ట్రోక్స్‌తో ప్రొటీస్ పేసర్లపై ఆధిపత్యం చూపెట్టారు. ఆరంభంలో నిప్పులు చెరిగిన స్టెయిన్, ఫిలాండర్ ఓవర్లలో చూడచక్కని కవర్‌డ్రైవ్‌లు కొడుతూ నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించారు. లంచ్ తర్వాత స్వల్ప విరామాల్లో ఈ ఇద్దరూ వెనుదిరిగినా... ఓజా, జాక్సన్ (15)లు మంచి సమన్వయంతో ఆడారు. దీంతో మరో వికెట్ పడకుండా 208/5 స్కోరుతో బోర్డు జట్టు టీకి వెళ్లింది. టీ తర్వాత హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) జయంత్ యాదవ్ (22)లు వేగంగా ఆడటంతో గౌరవప్రదమైన స్కోరు లభించింది. స్టెయిన్, హర్మర్ చెరో మూడు వికెట్లు తీశారు.